
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులు, మాజీ ప్రధానుల జీతభత్యాలు, ప్రయాణ ఖర్చులకు 2018–19 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూ. 295 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్‌లో రూ. 400 కోట్లు కేటాయించారు. ఈ మొత్తంలో 29% తగ్గించారు. బడ్జెట్‌లో కేటాయించిన మొత్తాన్నే మంత్రి మండలి, సహాయ మంత్రులు, మాజీ ప్రధానుల జీతభత్యాలకు, ఇతర సౌకర్యాలు, విందు, ప్రయాణ ఖర్చుల నిమిత్తం వినియోగించాలి. ఇక వీవీఐపీలు వినియోగించే విమానాల నిర్వహణ ఖర్చులను కూడా ఈ మొత్తంలోనే ఖర్చు చేయాలని జైట్లీ తెలిపారు. 2017–18 కేంద్ర బడ్జెట్‌లో రూ. 418.49 కోట్లను కేటాయించారు. ప్రధాని కార్యాలయం పాలనాపరమైన ఖర్చులకు ఈ ఏడాది బడ్జెట్లో రూ. 50.35 కోట్లను కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment