సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ సర్కార్ గ్రామీణ భారతంపై ప్రత్యేక శ్రద్ధపెట్టింది. గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది. రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ను పెంచాలన్నది ఈ ఏడాది అతిపెద్ద నిర్ణయం. ఈ రబీ పంటల నుంచే కనీస మద్దతు ధర.. ఉత్పాదన వ్యయానికంటే ఒకటిన్నర రెట్లు (150శాతం ఎక్కువ) ఉండాలని నిర్ణయించింది. వ్యవస్థీకృత సాగు, సామూహిక వ్యవసాయ విధానాలకు అధిక ప్రాదాన్యం ఇస్తున్నట్లు జైట్లీ చెప్పారు.
వ్యవసాయ రంగంపై జైట్లీ ప్రసంగంలో ముఖ్యాంశాలు..
⇒భారత్ వ్యవసాయ ఆధారిత దేశం.
⇒గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి కల్పనకు రూ.14.34 లక్షల కోట్లు కేటాయింపు
⇒2022 నాటికి, అంటే 75వ స్వాతంత్ర్యవేడుకల నాటికి దేశంలోని రైతాంగాన్ని బలోపేతం చేస్తాం.
⇒కనీస మద్దతు ధరను ఒకటిన్నర రెట్లు(150 శాతానికి) పెంచుతున్నాం. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఇది అమలులోకి వస్తుంది.
⇒ఇందుకోసం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో నీతిఆయోగ్ చర్యలు జరిపి, స్పష్టమైన విధానాన్ని రూపొందిస్తాం
⇒ఇప్పటికే తీసుకొచ్చిన ఈ-నామ్ విధానం విజయవంతంగా అమలవుతున్నది
⇒రైతులు మరింత బలోపేతం అయ్యేలా దేశవ్యాప్తంగా 22 వేల గ్రామీణ అగ్రి కల్చరల్ మార్కెట్లు ప్రారంభించబోతున్నాం.
⇒2వేల కోట్ల మూలధనంతో ఈ అగ్రిమార్కెట్లను ఏర్పాటు చేస్తాం
⇒ఆయా క్లస్టర్లలో జరిగే గ్రామీణ ఉపాధి హామీ, ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాలను సమన్వయం చేస్తూ, ఆన్‌లైన్ ద్వారా అగ్రిమార్కెట్లకు అనుసంధానం చేస్తాం
⇒సామూహిక వ్యవసాయ విధానం (క్లసర్ మోడల్ కల్టివేషన్)ను కేంద్ర ప్రభుత్వం సమర్థిస్తున్నది.లోకి తీసుకురానున్నాం.
⇒2019 మార్చి నుంచే క్లస్టర్ మోడల్‌ను అమలు చేయబోతున్నాం
⇒మారుమూల గ్రామాల్లో పండించిన పంటలు మార్కెట్‌ను చేరేలా.. ప్రధాన మంత్రి గ్రామీణ యోజన ద్వారా పెద్ద ఎత్తున రోడ్లను నిర్మించబోతున్నాం.
⇒కౌలు రైతులకు రుణాలజారీని మరింత సులభతరం చేయబోతున్నాం.
Comments
Please login to add a commentAdd a comment