
విమానాలు
న్యూఢిల్లీ : పౌర విమానయాన శాఖకు తాజా బడ్జెట్‌లో రూ.6,602.86 కోట్ల నిధులు దక్కా యి. గతేడాదితో పోలిస్తే కేటాయింపులు మూడు రెట్లు పెరిగాయి. అయితే ఇందులో రూ.4,469.5 కోట్లను కేవలం రెండు విమానాలు కొనడానికే ప్రత్యేకంగా కేటాయించారు. రెండు బోయింగ్ 777–300 ఈఆర్ విమానా లను కొనుగోలు చేసి కేవలం వీవీఐపీల పర్య టనల కోసం మాత్రమే వాడనురు. ఉడాన్ పథకం కోసం రూ.1,014.09 కోట్లను కేటాయిం చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉడాన్ కోసం కేటాయించిన నిధులు రూ.200 కోట్లు మాత్రమే.
విమానాశ్రయాల సామర్థ్యం ఐదు రెట్లు..
ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియాకు నిధులు భారీగా తగ్గించి తాజా బడ్జెట్‌లో కేవలం రూ.650 కోట్లు కేటాయించారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి కూడా నిధులను దాదాపు సగానికి తగ్గించి రూ.73.3 కోట్లను మాత్రమే ఇచ్చారు. ఐఈబీఆర్ (ఇంటర్నల్ అండ్ ఎక్స్‌టర్నల్ బడ్జెటరీ రిసోర్సెస్) మార్గంలో ఏఏఐ మరో రూ.4,086 కోట్లు సమీకరిస్తుందని బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో పైలట్ శిక్షణా కేంద్రమైన ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీతో పాటు రాజీవ్ గాంధీ విమానయాన విశ్వవిద్యా లయాలకు కలిపి రూ.50 కోట్లు కేటాయించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు రూ.210 కోట్లు, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్)కి రూ.70 కోట్ల నిధులు దక్కాయి. ’ఎన్‌ఏబీహెచ్ (నెక్టŠస్‌జెన్ ఎయిర్‌పోర్ట్స్ ఫర్ భారత్) నిర్మాణ్’ ప్రాజెక్టులో భాగంగా దేశ విమానాశ్రయాల సామ ర్థ్యాన్ని ఐదు రెట్లు పెంచనున్నట్లు జైట్లీ చెప్పారు.
900 కొత్త ఎయిర్‌క్రాఫ్ట్ల కొనుగోలుకు ఆర్లర్లు
దేశవ్యాప్తంగా వాడుకలో లేని 56 విమానాశ్రయాలు, 31 హెలిపాడ్లను ‘ఉడాన్’ పథకం కింద వినియో గంలోకి తీసుకురా నున్నట్లు జైట్లీ ప్రకటించారు. ఏటా వంద కోట్ల ప్రయాణాలకు అనువుగా వీలుగా విమానాశ్ర యాలు విస్తరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే 16 ఎయిర్‌పోర్టుల్లో సేవలు ప్రారంభమైనట్లు వివరించారు. ‘గత మూడేళ్లుగా దేశీయ ప్రయాణికుల సంఖ్య ఏటా 18 శాతం పెరిగింది. మన విమానయాన సంస్థలు 900 కొత్త ఎయిర్‌క్రాఫ్ట్ల కొనుగోలుకు ఆర్లర్లు ఇచ్చాయి’ అని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో హవాయి చెప్పులు ధరించే వారు సైతం విమానాల్లో ప్రయాణిస్తారని వ్యాఖ్యానించారు.
సీ ప్లేన్ పరిశ్రమకు ప్రోత్సాహం
న్యూఢిల్లీ: దేశంలో సీ ప్లేన్ (నీటి మీదనే ల్యాండ్, టేకాఫ్ అయ్యే చిన్న విమానాలు)ల కార్యకలాపాల్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసం గంలో చెప్పారు. గతేడాది డిసెంబరులో విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ముంబై దగ్గర్లో వీటిని ప్రయోగా త్మకంగా నడిపింది. 400 మిలియన్ల అమెరికన్ డాలర్ల వ్యయంతో 100 సీ ప్లేన్‌లను కొనేందుకు కూడా ఈ సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. ఈ రంగానికి పెట్టుబడు లను ప్రోత్సహించే చర్యలు తీసుకుంటామని జైట్లీ చెప్ప డంపై స్పైస్‌జెట్ చైర్మన్, ఎండీ అజయ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. సీ ప్లేన్‌ల ద్వారా ప్రతి నదిని ఒక రన్‌వేగా, ప్రతి చెరువును ఒక విమానాశ్రయంగా మార్చడం సాధ్యపడుతుందని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment