చురుక్కుల్లేవ్.. చమక్కుల్లేవ్.. కవితలు లేవు.. పంక్తులు లేవు.. జైట్లీ బడ్జెట్ ప్రసంగం ఎలాంటి ఛలోక్తులు లేకుండా అత్యంత సాదాసీదాగా సాగింది! బడ్జెట్‌లో చివర్లో వివేకానందుడి మాటలు తప్ప ఎక్కడా కవులు, ప్రముఖుల సూక్తులను ఉటంకించలేదు. గురువారం ఆయన పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆసాంతం.. రైతులు, పేదలు, గ్రామీణం, మహిళలు.. ఈ నాలుగు అంశాల చుట్టే తిరిగింది. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలను ప్రస్తావించే సమయంలో హిందీలో ప్రసంగించారు.