కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 ఏడాదికిగాను కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 1, 2018 నుంచి ప్రారంభంకానున్న ఆర్థిక సంవత్సరానికి ఆయన గురువారం ఉదయం లోక్‌సభలో 11గంటలకు బడ్జెట్‌ను ప్రసంగ పాఠాన్ని మొదలుపెట్టారు. జైట్లీ బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఇది ఐదోసారి. ఎన్డీయే సర్కార్‌కు ఇది పూర్తిస్థాయి ఆఖరి బడ్జెట్. 2019లో సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ కేంద్రానికి అతిముఖ్యమైనది కాగా ఇదే ఏడాది ఎనిమిది రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌కు ప్రాధాన్యం సంతరించుకుంది. మరోపక్క, కేంద్రం జీఎస్‌టీని గత ఏడాది అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత వస్తున్న తొలి బడ్జెట్ కూడా ఇదే. ఈ నేపథ్యంలో ఆ బడ్జెట్‌లోని ప్రధాన అంశాలు మీ కోసం..