ఇమాందారీ కా ఉత్సవ్‌  | jaitley says people are welcomed to demonetisation | Sakshi
Sakshi News home page

ఇమాందారీ కా ఉత్సవ్‌ 

Published Fri, Feb 2 2018 3:49 AM | Last Updated on Thu, Sep 27 2018 9:07 PM

jaitley says people are welcomed to demonetisation

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి దేశప్రజల మద్దతు లభించిందని, ఇది నిజాయితీకి దక్కిన పురస్కారమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ పే ర్కొన్నారు. నల్లధనాన్ని అరికట్టడానికి తీసుకున్న ఈ చర్య, నిజాయితీగా పన్నులు చెల్లించేవారి మెప్పు పొందిందన్నారు. దీనిని ఆయన ‘ఇమాందారీ కా ఉత్సవ్‌’గా అభివర్ణించారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేసేవారి సంఖ్య పెరిగిందని గురువారం బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. పన్నుల విషయంలో ఇది గొప్ప విజయమని అన్నారు.

నిజాయితీగా పన్నులు చెల్లించేవా రికి తగిన ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. గ తంలో రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య 66.26 లక్షలుండగా, 2016–17లో ఈ సంఖ్య 85.51 లక్షల కు పెరిగిందన్నారు. అలాగే 2014–15 ఆర్థిక సంవత్సరం ఆరంభంలో పన్నులు చెల్లించేవారి సం ఖ్య 6.47 కోట్లు ఉండగా, 2017 మార్చి చివరి నాటికి ఆ సంఖ్య 8.27కోట్లకు పెరిగిందని జైట్లీ వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement