సి.రంగరాజన్
చెన్నై / వాషింగ్టన్: ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో కొన్నింటిని మాత్రమే ప్రస్తావించిందని ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధాని ఆర్థిక సలహా మండలి మాజీ చైర్మన్ సి.రంగరాజన్ అభిప్రాయపడ్డారు. ‘ఆర్థిక వృద్ధి నెమ్మదించడం, ప్రైవేటు పెట్టుబడులు తగ్గిపోవడం, వ్యవసాయ సంక్షోభం ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ సంక్షోభంతో పాటు ప్రైవేటు పెట్టుబడుల గురించి కొద్దిగా ప్రస్తావించారు.
కేవలం ఈ బడ్జెట్ సాయంతో ఆర్థిక వృద్ధి సాధ్యమా? అంటే అది అనుమానాస్పదమే. ఒకవేళ దేశంలోకి పెట్టుబడుల రాక పెరిగితే ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది. అందుకే నేను ఈ బడ్జెట్ కొన్ని సమస్యల్ని మాత్రమే స్పృశించింద నీ, అన్ని సమస్యల్ని ప్రస్తావించలే దని చెప్పాను’ అని రంగరాజన్ వ్యా ఖ్యానించారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యారం గానికి నిధుల కేటాయింపులు పెరగడం ఈ బడ్జెట్ విశేషమని రంగరాజన్ తెలిపారు. ఈ మార్పులు సరైన దిశలోనే సాగుతున్నాయని వెల్లడించారు. ఇకపై ఆర్థికలోటు ఎట్టిపరిస్థితుల్లోనూ పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. జైట్లీ ప్రకటించిన జాతీయ ఆరోగ్య రక్షణ పథకంపై మరింత స్పష్టత రావాల్సిన అవసరముందని రంగరాజన్ అభిప్రాయపడ్డారు.
ఆచరణీయ బడ్జెట్: పనగరియా
కేంద్ర బడ్జెట్ ఆచరణీయంగా ఉందని నీతి ఆయోగ్ మాజీ చైర్మన్ అరవింద్ పనగరియా తెలిపారు. ‘మొత్తం బడ్జెట్‌లో దాదాపు 10 కోట్ల కుటుంబాలను బీమా పరిధిలోకి తీసుకొచ్చే జాతీయ ఆరోగ్య రక్షణ పథకం అత్యంత ముఖ్యమైనది. ఇది దేశంలోని ప్రజల్ని సార్వత్రిక ఆరోగ్య బీమావైపు తీసుకెళ్తుంది. ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆచరణీయంగా ఉంది. జీఎస్టీ అమలుతో పరోక్ష పన్నులు కేవలం 11 నెలలకే వసూలు చేయగలిగారు. అలాగే నామమాత్రపు వృద్ధిరేటు కూడా అనుకున్నంతగా లేకపోవడంతో ఆర్థిక లోటు 3.2 శాతం నుంచి 3.5 శాతానికి చేరుకుంది’ అని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment