
న్యూఢిల్లీ: ఆహారం, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులపై సబ్సిడీలు ఈసారి 15 శాతం పెరిగాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీల కోసం కేంద్రం రూ.2.64 లక్షల కోట్లు కేటాయించింది. బడ్జెట్ సవరణల తర్వాత 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఈ సబ్సిడీల కోసం రూ.2,29,715.65 కోట్లు కేటాయించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆహార సబ్సిడీ కోసం రూ.1,69,323 కోట్లు కేటాయించగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,40,281 కోట్లు కేటాయించారు.
ఎరువుల కోసం సబ్సిడీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను రూ.70,079.85 కోట్లు కేటాయించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.64,973.5 కోట్లు కేటాయించారు. యూరియా కోసమే వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.44,989.5 కోట్లు కేటాయించారు. ఫాస్ఫేట్, పొటాషియం ఎరువుల కోసం రూ.25,090.35 కోట్లు కేటాయించగా, 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.22,251.8 కోట్లు కేటాయించారు. కాగా, పెట్రోలియం సబ్సిడీ కోసం రూ.24,932.8 కోట్లు, ఎల్పీజీ సబ్సిడీ కోసం రూ.24,933 కోట్లు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment