గ్రామీణ ప్రాంతాలు
న్యూఢిల్లీ: తాజా బడ్జెట్‌లో గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. బడ్జెట్‌లో సగానికిపైగా గ్రామీణ ప్రాంతాలకే కేటాయించారు. వ్యవసాయంతో పాటు గ్రామీణాభివృద్ధి రంగాలకు పెద్దపీట వేశారు. 2018–19కిగాను మొత్తం బడ్జెట్‌లో సగానికిపైగా.. ఏకంగా 14.34 లక్షల కోట్లను గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ఇతర పథకాల కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 3.17 లక్షల కిలోమీటర్ల పొడవైన రోడ్లు నిర్మిస్తామని, 51 లక్షల కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. కొత్తగా 1.75 కోట్ల గృహాలకు విద్యుత్ కనెక్షన్లు ఇస్తామని, 1.88 కోట్ల టాయిలెట్లు నిర్మిస్తామని ప్రకటించారు.
2018–19లో మొత్తంగా 321 కోట్ల పనిదినాలు కల్పిస్తామన్నారు. ‘‘దేశంలోని గ్రామీణ ప్రాంతా ల్లో గరిష్ట స్థాయిలో జీవనోపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి, వ్యవసాయం, దాని అను బంధ రంగాలు, మౌలిక సదుపాయాలకు భారీ గా నిధులు కేటాయించాం..’’ అని జైట్లీ ప్రకటిం చారు. గ్రామీణాభివృద్ధి శాఖకు గతేడాది కన్నా రూ.7 వేల కోట్లు అదనంగా.. మొత్తం రూ.1.12 లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment