Disconnect
-
కోటి మొబైల్ కనెక్షన్లు డిస్కనెక్ట్
ఇబ్బందికరమైన కాలర్లు, మోసాలకు పాల్పడుతున్న మొబైల్ కనెక్షన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్, టెలికాం డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఇలాంటి కోటికిపైగా మొబైల్ కనెక్షన్లను డిస్కనెక్ట్ చేసినట్లు అధికారిక ప్రకటనలో వెల్లడించాయి. అలాగే సైబర్ క్రైమ్, ఆర్థిక మోసాలకు పాల్పడినందుకు 2.27 లక్షల మొబైల్ హ్యాండ్సెట్లను టెలికాం శాఖ బ్లాక్ చేసింది."ఇప్పటి వరకు, సంచారసాథి సహాయంతో 1 కోటికి పైగా మోసపూరిత మొబైల్ కనెక్షన్లు డిస్కనెక్ట్ చేశాం. అలాగే సైబర్ క్రైమ్/ఆర్థిక మోసాలకు పాల్పడినందుకు 2.27 లక్షల మొబైల్ హ్యాండ్సెట్లు బ్లాక్ చేశాం" అని ప్రకటన పేర్కొంది. స్పామ్ కాల్స్ కోసం రోబోకాల్స్, ప్రీ-రికార్డ్ కాల్స్‌తో సహా బల్క్ కనెక్షన్లను ఉపయోగిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని టెలికాం ఆపరేటర్లను ట్రాయ్ ఆదేశించింది.వాటి కనెక్షన్లను డిస్కనెక్ట్ చేసి బ్లాక్‌లిస్ట్ చేయాలని సూచించింది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ 4జీ కోసం 5జీ ఫోన్ కొనాలా?"గడిచిన 15 రోజుల్లో అటువంటి 3.5 లక్షల నంబర్లు డిస్కనెక్ట్ చేశాం. 50 సంస్థలను బ్లాక్‌లిస్ట్ చేశాం. అలాగే దాదాపు 3.5 లక్షల ఉపయోగించని, ధ్రువీకరించని ఎస్ఎంఎస్ హెడర్లు, 12 లక్షల కంటెంట్ టెంప్లేట్లను బ్లాక్ చేశాం" అని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చర్యలతో పాటు నాణ్యతా సేవా నిబంధనలను ట్రాయ్ సవరించింది. ఇవి అక్టోబర్ 1 నుండి అమలులోకి రానున్నాయి. ఏప్రిల్ 1 నుండి మొబైల్ సర్వీస్ క్యూఓఎస్ పనితీరు సమీక్ష త్రైమాసిక ప్రాతిపదికన కాకుండా నెలవారీగా నిర్వహించనున్నట్లు కూడా ప్రకటనలో వెల్లడించారు. -
బీజేపీ తొలి జాబితాపై నేతల్లో అసంతృప్తి?
2024 లోక్‌సభ ఎన్నికలకు కర్ణాటక నుంచి పోటీచేసే 20 మంది అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. అదిమొదలు బీజేపీలోని కొందరు నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారని, వారంతా కాంగ్రెస్‌లో చేరే అవకాశాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప పార్టీపై తిరుగుబాటు ప్రకటించారు. వారం రోజుల క్రితం విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో తన కుమారుడు కేఈ కాంతేష్‌కు చోటు దక్కకపోవడంతో ఆయన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీఎస్ యడియూరప్పపై తీవ్రంగా మండిపడ్డారు. కర్నాటకలో 28 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. బీజేపీ తన కుమారునికి హవేరీ లోక్‌సభ సీటును కేటాయించాలని కేఎస్ ఈశ్వరప్ప కోరారు. అయితే ఆ పార్టీ అక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని పోటీకి దింపింది. తన కుమారుడికి టికెట్ రాకపోవడంతో కలత చెందిన ఈశ్వరప్ప అందుకు నిరసనగా యడియూరప్ప పెద్ద కుమారుడు బీవై విజయేంద్రపై శివమొగ్గ నుంచి తాను పోటీకి దిగుతున్నట్లు ప్రకటించారు. కర్ణాటకలో బీజేపీ పరిస్థితి దారుణంగా ఉందని మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈశ్వరప్ప వ్యాఖ్యానించారు. కర్ణాటక బీజేపీ ఒక కుటుంబం ఆధీనంలో ఉందని, దానిని అందరూ వ్యతిరేకించాలన్నారు. ఇదిలావుండగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తొలుత విముఖత చూపిన మాజీ ముఖ్యమంత్రి డీవీ సదానంద గౌడ కూడా హఠాత్తుగా ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రజలకు తెలియజేస్తానని ఆయన తెలిపారు. మరోవైపు కొప్పల్ నుంచి రెండుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన కారడి సంగన్నకు టికెట్ దక్కకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి డాక్టర్ బసవరాజ్‌ను పోటీకి దింపాలని పార్టీ నిర్ణయించింది. తాను కూడా కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నానని, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సంగన్న మీడియాకు తెలిపారు. తుమకూరు నుంచి వి సోమన్నను బీజేపీ పోటీకి దింపడంతో కర్ణాటక మాజీ మంత్రి జేసీ మధుస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన (యడ్యూరప్ప) తనకు అండగా నిలవకపోవడం, తన అభ్యర్థిత్వానికి మద్దతివ్వకపోవడం బాధగా ఉందని, దీంతో పార్టీలో ఉండాలా వద్దా? అనే ఆలోచనలో పడ్డానని అన్నారు. కాంగ్రెస్‌లోకి వెళ్లడం కూడా సేఫ్ జోన్ కాదు అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా కర్ణాటకలో ఏప్రిల్ 26, మే 7 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. -
ఆరేళ్ల చిన్నారి బ్రెయిన్లో సగభాగం స్విచ్ఆఫ్ అయ్యింది? ఐనా..
మెదడులో సగభాగాన్ని స్విచ్ఆఫ్ చేయడం గురించి విన్నారా?. అదేంటి అని ఆశ్చర్యపోకండి. నిజంగానే ఏదో ఎలక్ట్రిక్ స్విచ్ని ఆఫ్ చేసినట్లుగా ఓ ఆరేళ్ల చిన్నారి మెదడుల సగభాగాన్ని స్విచ్ఆఫ్ చేశారు. ఎందుకిలా? ఏం జరిగింది ఆ చిన్నారికి తదితరాల గురించే ఈ కథనం.! వివరాల్లోకెళ్తే.. యూఎస్‌లోని ఆరేళ్ల చిన్నారి బ్రియానా బోడ్లీ అరుదైన మెదడువాపు వ్యాధి బారిన పడింది. ఆ వ్యాధి పేరు రాస్ముస్సేన్కి సంబంధించిన మెదడువాపు వ్యాధి. వైద్య పరిభాషలో చెప్పాలంటే దీన్ని రాస్ముస్సేన్స్ ఎన్సెఫాలిటిస్ అనే మెదడు వాపు వ్యాధి. దీని కారణంగా ఆమె పక్షవాతానికి గురయ్యి నడవలేనంత దయనీయ స్థితిలో ఉంది. కనీసం మాటలు కూడా పలకలేదు. ఈ వ్యాధి కారణంగా ఆమె మెదడులోని ఒక వైపు భాగం కుచించుకుపోవడం మొదలైంది. నెమ్మది నెమ్మదిగా ఆ వ్యాధి ఆమెపై ఓ రేంజ్లో విజృంభించడం ప్రారంభించింది. దీంతో వైద్యలు ఆమె పరిస్థితి విషమించకూడదనే ఉద్దేశంతో యాంటీ సీజర్, స్టెరాయిడ్లు ఇచ్చారు. అంతేగాదు ఆ వ్యాధిని నయం చేసేందుకు మెదడులో ఒకవైపు భాగాన్ని పనిచేయకుండా డిస్కనెక్ట్ చేశారు. అంటే ఒకరకంగా ఒకవైపు మెదడుని స్విచ్ఆఫ్ చేశారు. ఆ చిన్నారి ఎదుర్కొంటున్న వ్యాధిని నయం చేసేందుకు ఇలా ఒకవైపు మెదడుని పూర్తిగా డిస్కనెక్ట్ చేసినట్లు లోమాలిండా యూనివర్సిటీ డాక్టర్ ఆరోన్ రాబిసన్ చెప్పారు. ఈ మేరకు వైద్యులు రాబిసన్ మాట్లాడుతూ..మెదడులో పనిచేయని భాగాన్ని సిల్వియన్ షిషర్ అనే పిలిచే బ్రెయిన్ ఓపెన్ సర్జరీ ద్వారా బ్రెయిన్‌ని ఆఫ్ చేయొచ్చని చెప్పారు. ఈ చికిత్సలో తాము మెదడులోని థాలమస్ ప్రాంతం నుంచి తెల్లటి పదార్థాన్ని రీమూవ్ చేస్తామని చెప్పారు. సగం మెదడుతో రోజూవారి సాధారణ జీవితాన్ని గడపగలమని చెప్పారు వైద్యులు. దీని గురించి ఆ చిన్నారి బ్రియానాకి దాదాపు 10 గంటలకు పైగా శస్త్ర చికిత్స చేసి మరీ మెదడులోని సగ భాగాన్ని డిస్కనెక్డ్ చేసినట్లు తెలిపారు. ఈ సర్జరీ కారణంగా ఆమె ఎడమ చేతిని కదపలేకపోవడం, కొంత మేర దృష్టిని సైతం కోల్పోయినప్పటికీ వివిధ ఫిజికల్ థెరఫీలతో మళ్లీ ఆమెను యథాస్థితికి తీసుకొచ్చేలా చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ చిన్నారి కొత్తగా నడవడం, బ్యాలెన్సింగ్ చేసుకోవడం వంటి నెపుణ్యాలను మళ్లీ అభ్యసిస్తోందని చెప్పారు రాబిసన్. ఇంతకీ రాస్ముస్సేన్ మెదడు వాపు వ్యాధి అంటే.. మెదడులో సగభాగంలో మంటతో కూడిన దీర్ఘకాలిక నొప్పి ఉంటుంది. ఈ వ్యాధి ముదిరితే సగభాగం పూర్తిగా పనితీరుని కోల్పోతుంది. దీంతో ఒక వైపు శరీరం చచ్చుబడి క్రమంగా క్షీణించిపోవడం జరుగుతుంది. ఈ పరిస్థితిని 1958లో తొలిసారిగా వైద్యుడు థియోడర్ రాస్ముస్సేన్ వివరించారు. అందువల్ల ఆ వైద్యుడి పేరు మీదనే ఈ వ్యాధికి ఈ పేరు పెట్టారు. ఈ వ్యాధి ప్రతి పదిమిలియన్ల మందిలో ఇద్దర్ని ప్రభావితం చేస్తుందని, సాధారణంగా సుమారు 2 నుంచి 10 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు, కౌమారదశలో ఉన్నవారు, ఆఖరికి పెద్దలను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు: రాస్ముస్సేన్ ఎన్సెఫాలిటిస్ అత్యంత సాధారణ మూర్చలాంటి లక్షణాలనే చూపిస్తుంది. ఇది శరీరంలోని బలమైన కండరాల కదలికలను నియంత్రిస్తుంది. ఒక చేయి, కాలు మెలితిప్పినట్లుగా వంకరగా మారతాయి. మెదడులో ఒకవైపు నుంచి తీవ్ర స్థాయిలో నొప్పి ప్రారంభమవుతుంది (చదవండి: కంటి రెప్పపై కురుపులు లేదా గడ్డలు ఇబ్బంది పెడుతున్నాయా?) -
మీకు తెలుసా?.. విద్యుత్ శాఖ నుంచి మెసేజ్‌లు రావు
ఎంవీపీ కాలనీ(విశాఖపట్నం): ‘డియర్ కస్టమర్.. మీ విద్యుత్ సరఫరా ఈ రోజు రాత్రి 10.38 గంటలకు నిలిచిపోతుంది. మీరు గత నెల బిల్లు చెల్లించలేదు. వెంటనే మా 998... నంబర్లో సంప్రదించండి. ధన్యవాదాలు’. విద్యుత్ శాఖ నుంచి వచ్చినట్లుగా ఉండే ఈ తరహా సందేశాన్ని నమ్మి మీరు ఫోన్ చేశారో.. మీ బ్యాంకు ఖాతాలో నగదు ఖాళీ అయినట్లే. అదేలా అనుకుంటున్నారా.. అయితే ఈ క్రింది పేరా చదవండి.. చదవండి: నేను..నాలా‘గే’ ఉంటా.. స్వలింగ సంపర్కులు, థర్డ్ జండర్స్ ప్రైడ్ వాక్ మీకు వచ్చిన సందేశంలోని నంబర్‌కు ఫోన్ చేయగానే అవతలి వ్యక్తులు అచ్చం విద్యుత్ శాఖ అధికారులుగానే మాట్లాడతారు. మీరు బిల్లు చెల్లించినట్లు చెప్పినా ఆ సొమ్ము మాకు చేరలేదంటారు. ఒక యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని రూ.10 చెల్లిస్తే బిల్లు వివరాలు తమ సిస్టంలో జనరేట్ అవుతాయంటూ నమ్మిస్తారు. అది నమ్మి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని రూ.10 చెల్లిస్తే వారికి పంట పండినట్లే. ఇక మీ ప్రమేయం లేకుండానే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు విత్‌డ్రా అయిపోతాయి. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పలు నగరాల్లో ఈ తరహా మోసాలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి మెసేజ్‌లు పంపించడం, విద్యుత్ బకాయిలపై ఫోన్లో సంప్రదించడం వంటి చర్యలు విద్యుత్ శాఖ చేయదని స్పష్టం చేస్తున్నారు. -
అన్నంత పని చేసేసిన రష్యా! షాక్‌లో అమెరికా, యూరప్ దేశాలు
Russia detaches: ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతుండడంతో అమెరికా యూరప్‌తో సహా పలు దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ రష్యా తగ్గేదేలే అంటూ కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. దీంతో పలు అగ్రదేశాలు రష్యా పై ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. అయితే రష్యా మాత్రం తన దూకుడును తగ్గించకుండా అమెరికాకు వరుస హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. అంతటితో ఆగకుండా ప్రస్తుతం అనుకున్నంత పనిచేసేసింది రష్యా ఇప్పడూ. తాను ముందు నుంచి హెచరిస్తున్న విధంగానే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వైదొలగింది. అంతేకాదు తాను అంతరిక్ష కేంద్రం నుంచి వైదొలగితే ఎదురయ్యే పరిణామాల గురించి రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్ అమెరికాను ముందుగానే హెచ్చరించారు కూడా. ఈ మేరకు రష్యా తాను అంతరిక్ష కేంద్రం నుంచి డిస్కనెక్ట్ అవుతున్నట్లు కనిపిస్తున్న వీడియోలను సోషల మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు అమెరికా ఆంక్షలు విధించిన కొద్ది రోజుల్లోనే ఈ వీడియోని అనూహ్యంగా విడుదల చేసింది. అయితే 47 సెకన్ల నిడివి గల వీడియోలో రష్యన్ వ్యోమగాములు రష్యన్ హాచ్ను లాక్ చేసి, ఫ్లయింగ్ అవుట్‌పోస్ట్ నుంచి దూరంగా జ్వెజ్డా మాడ్యూల్లో విన్యాసాలు చేస్తున్నట్లు చూపిస్తుంది. మాడ్యూల్ స్టేషన్ నివాస గృహాలకు ఇంధనం నింపుకునే సామర్థ్యాన్ని అందిస్తుంది. యూఎస్ విభాగంలో జపనీస్, యూరోపియన్ ప్రయోగశాలలు ఉన్నాయి. జ్వెజ్డా మాడ్యూల్ మొత్తం అవుట్‌పోస్ట్‌కు స్పేస్ టగ్‌గా కూడా పనిచేస్తుంది. స్టేషన్‌ను స్పేస్ జంక్ నుండి దూరంగా నడిపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మాడ్యూల్‌లోని లైఫ్-సపోర్ట్ సిస్టమ్ యూఎస్ ల్యాబ్, డెస్టినీ లోపల ఉన్న సిస్టమ్‌తో కలిసి పని చేస్తుంది, ఇది మొత్తం అవుట్‌పోస్ట్‌లో కీలకమైన భాగం. ప్రస్తుతం స్పేస్ స్టేషన్లో అమెరికన్, రష్యన్, యూరోపియన్ సంతతికి చెందిన ఏడుగురు వ్యోమగాములు ఉన్నారు. ఆ స్పేస్ స్టేషన్ నుంచి రష్యా వైదొలగి ఆ 500 టన్నుల నిర్మాణాన్ని భారత్‌కి, చైనాకి వదిలేసే అవకాశం కూడా ఉంది. వచ్చే ఐదేళ్లలో రష్యా ఇప్పటికే చైనా తరహాలో సొంత స్పేస్ స్టేషన్ కోసం ప్లాన్ చేస్తోంది కూడా. Russian Roskosmos creates a “joke” film about disconnecting of the Russian ISS modules from the station. Russian ISS modules like Zvezda provide most of the life support systems to the orbital station pic.twitter.com/qIVZphvfam — Dmitri Alperovitch (@DAlperovitch) March 5, 2022 (చదవండి: మోదీజీ యుద్ధం ఆపమని పుతిన్‌కి చెప్పండి!) -
మీకు ఈ మెసేజ్ వస్తుందా! మరేం పర్లేదు
వాట్సాప్ యూజర్ల ఆందోళనపై ఆ సంస్థ ప్రతినిధులు స్పందించారు. ఇటీవల వాట్సాప్ వినియోగదారులకు వింత సమస్య ఎదురైంది. ఆన్‌లో ఉన్న వాట్సాప్ ఒక్కసారిగా లాగ్ అవుట్ అవుతుంది. వెంటనే మీరు ఉపయోగిస్తున్న ఫోన్లో ఈ నెంబర్ వాట్సాప్ లేదు. బహుశా వేరే ఫోన్లో ఈ నెంబర్ వాట్సాప్ ఉంటుందేమో.. ఒక్కసారి చెక్ చేయండి లేదంటే మీ ఫోన్ నెంబర్ ను వెరిఫై చేసుకోండంటూ ఓ మెసేజ్ వచ్చింది. If you have been recently logged out from WhatsApp, on WhatsApp for Android, don't worry: it's a bug. You can log into WhatsApp again. pic.twitter.com/SnhFzUd5jP — WABetaInfo (@WABetaInfo) August 8, 2021 దీంతో ఆ మెసేజ్‌పై వాట్సాప్ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు.వాట్సాప్ హ్యాక్ అయ్యిందేమో? ఎవరన్నాహ్యాక్ చేశారేమో చెక్ చేయండి అంటూ వాట్సాప్‌కు రిక్వెస్ట్‌లు పెట్టారు. దీంతో యూజర్ల రిక్వెస్ట్ వాట్సాప్ రియాక్ట్ అయ్యింది. మీ ఫోన్ ను ఎవరూ హ్యాక్ చేయలేదు. బ్యాక్ ఎండ్ కోడ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ సమస్య గురించి యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తిరిగి వాట్సాప్‌లోకి లాగిన్ అవ్వొచ్చని డబ్ల్యూఏబీటా ఇన్ఫో ట్విట్టర్ వేదికగా తెలిపింది. దీంతో యూజర్లు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. -
లింక్ చేయకపోయినా..!?
సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్, మొబైల్ నెంబర్ అనుసంధానంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డీఓటీ) ప్రకటించింది. ఈ కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందువల్ల.. ఆధార్‌తో మొబైల్‌ను లింక్ చేయకపోయినా ఎటువంటి చర్యలు తీసుకోమని డీఓటీ కార్యదర్శి అరుణ సౌందరరాజన్ తెలిపారు. ఆధార్-మొబైల్ లింకింగ్ విషయంలో టెలికాం శాఖ సుప్రీంకోర్టు నిర్ణయం కోసం ఎదురు చూస్తోందని అరుణ సౌందరరాజన్ తెలిపారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఈ నెల 13న విచారణ జరపనుంది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఉన్న వినియోగదారుల వివరాలను మరోసారి ధృవీకరించుకోవాలని ప్రయివేట్ టెలికాం ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె స్పష్టం చేశారు. డిసెంబర్ 1లోగా మొబైల్ వినియోగదారులంతా.. తమతమ నెంబర్లను ఒన్ టైమ్ పాస్వర్డ్ సాయంతో వెరిఫై చేయించుకోవాలని ఆమె సూచించారు. -
వద్దంటే వదిలెయ్యాలి
క్రైమ్ పేరెంటింగ్ వదిలెయ్యకపోతే ఏమవుతుంది? లైఫ్‌లో ఎన్నో వదులుకోవాల్సి వస్తుంది! సంతోషాలను వదులుకోవాల్సి వస్తుంది.. గౌరవాన్ని వదులుకోవాల్సి వస్తుంది.. ఇంట్లో ప్రేమను.. బయట స్నేహాన్నీ వదులుకోవాల్సి వస్తుంది.. ఫుల్‌నెస్‌ను వదులుకోవాల్సి వస్తుంది.. చివరికి ఎంప్టీనెస్లో బతకాల్సి వస్తుంది! నీ ఫీలింగ్స్ తన ఫీలింగ్స్ కానక్కర్లేదు. అంతగా ఫీల్ అవొద్దు. వద్దంటే వదిలెయ్యాలి!! నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడితే... నువ్వంటే ఇష్టంలేదు అన్న ఆ అమ్మాయి అభిప్రాయాన్ని గౌరవించాలి.. ఆమె సంతోషాన్ని కోరుకొని పక్కకు తప్పుకోవాలి. ‘‘న్యూస్ పెట్టరా అజయ్’’ రిమోట్ అంతెత్తున ఎగిరి పడింది! ‘‘నువ్వే పెట్టుకో’’ సూర్య షాక్ తిన్నాడు. ‘‘ఒరేయ్.. ఎక్కడికీ! టిఫిన్ చెయ్యకుండా..’’ ఉప్మా ప్లేటు టేబుల్ మీద గిర్రున తిరిగింది! ‘‘ఇది టిఫినా మమ్మీ.. తినూ తినూ అని ఎందుకు చంపుతావ్?’’ వసంత షాక్ తింది! ‘‘అన్నయ్యా.. నా ఫోన్లో వై–ఫై డిస్కనెక్ట్ అయింది. కొంచెం కనెక్ట్ చెయ్యవా ప్లీజ్?’’పెద్ద సౌండ్‌తో తలుపు ధడేల్మంది.‘‘ఎన్నిసార్లు చెప్పాలి. నా రూమ్‌లోకి రావద్దని. ఫో అవతలికి’’ సౌమ్య షాక్ తింది. అమ్మ, నాన్న, చెల్లి... ఈ ముగ్గురూ షాక్ తిన్నవాళ్లు. అజయ్.. షాక్ ఇచ్చినవాడు! కొత్తగా ఇవ్వడం కాదు.. కొన్నాళ్లుగా వాడికి ఇంట్లోవాళ్ల పొడే గిట్టడం లేదు. మాటకు మందు ‘ఐ నో’ అంటున్నాడు. మాట తర్వాత ‘స్టే అవే’ అంటున్నాడు. ఏమైంది అజయ్‌కి!రాత్రి... భోజనం చేస్తూ కొడుకు తీరునే గమనిస్తున్నాడు సూర్య. టీవీలో ఏ ఒక్క చానల్ మీద కూడా మనసు లగ్నం చేయట్లేదు అజయ్. పదేపదే చానళ్లు మారుస్తున్నాడు. అసలు వాడి దృష్టి టీవీ మీద కూడా లేనట్లుంది. అన్యమనస్కంగా ఉన్నాడు. తినే తిండి మీద కూడా ధ్యాస లేదు. ఎక్కడో మనసు పెట్టి కంచంలో నాలుగు మెతుకులు కతికి లేస్తున్నాడు. వాడి ధోరణికి భార్యాభర్తలు మొహమొహాలు చూసుకోవడం ఎక్కువైపోయింది ఈమధ్య. చీటికి మాటికి కోపం! అజయ్ టీవీ రిమోట్‌ను విసిరేస్తూ అక్కడినుంచి తన బెడ్రూమ్లోకి వెళ్లిపోయాక అతడిని అనుసరించాడు సూర్య. నిజానికి ఆ వంకతో కొడుకుతో మాట్లాడాలనుకున్నాడు సూర్య. ఈ మధ్య అజయ్ ఏదో పోగొట్టుకున్నట్టుగా.. దిగులుగా.. కనిపిస్తున్నాడు. మాట్లాడితే కోపం తెచ్చుకుంటున్నాడు. మొదటినుంచీ కాస్త మొండివాడు. వాడు ఏది కావాలంటే అది కొనివ్వాల్సిందే. కోపమూ ఎక్కువే. కాని కొన్నిరోజులుగా ఆ కోపం మరింత ఎక్కువైంది! ఇంట్లో తల్లి దగ్గర, చెల్లి దగ్గర కూడా అదే ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇప్పుడు తండ్రి రాకను గమనించి కూడా గమనించనట్లే గదిలో లైట్ ఆఫ్ చేసి అటుతిరిగి పడుకున్నాడు అజయ్! అయామ్ ది బెస్ట్ అనే ఫీలింగ్ అజయ్.. బీటెక్ ఫైనలియర్లో ఉన్నాడు. చదువులో చురుకే. ఇంజనీరింగ్‌లో ఫ్రీ సీట్ కూడా సాధించుకున్నాడు. వాళ్లది మధ్యతరగతి కుటుంబం. తండ్రి సంపాదన మీదే అంతా నడుస్తుంది. సర్దుబాట్లతో సాగుతోంది. ఆ సర్దుబాటంటే చిరాకు అజయ్‌కి. దాంతో ముందు అజయ్‌కి అన్ని సమకూర్చాకే మిగతావాటితో మిగిలినవాళ్లు అడ్జస్టవడం అలవాటు చేసుకున్నారు. అందునా మొదటి సంతానం అవడంవల్ల ఇంట్లో అజయ్‌కే ప్రయారిటీ. ఈ ప్రాధాన్యం అజయ్‌లో తనేదో ప్రత్యేకం అనే భావనను పెంచిపోషించింది. ఐయామ్ ది బెస్ట్ ఎమాంగ్ ఆల్.. అనే ఫీలింగ్ జీర్ణించుకుపోయింది అజయ్‌లో. అజయ్ ఇంట్లో లేని ఓ రోజు ‘ఏమైంది అంకుల్... మమ్మల్ని రమ్మన్నారు?’ అజయ్ ఫ్రెండ్ రఘు అడిగాడు. అతనితోపాటు అజయ్ వాళ్లింటికి వచ్చిన మిగిలిన ముగ్గురు స్నేహితులూ ఆయన ఏం చెప్పబోతున్నాడోనని ఊహిస్తూ ఎదురు చూస్తున్నారు. ‘వసంతా... రఘు, దీపక్ వాళ్లు వచ్చారు.. టీలు.. పెట్టిస్తావా..?’ రిక్వెస్టింగ్‌గా అడిగాడు భార్యను సూర్య. అలాగే అంటూ వంటింట్లోంచి హాల్లోకి వచ్చి అజయ్ ఫ్రెండ్స్‌ని పలకరించి టీ పెట్టడానికి మళ్లీ లోపలికి వెళ్లిపోయింది వసంత. భార్య అక్కడ లేదని నిర్ధారించుకున్నాక గొంతు సవరించుకున్నాడు సూర్య. ‘చెప్పండంకుల్..’ అన్నాడు దీపక్. ‘ఏంలేదర్రా.. ఈ మధ్య అజయ్ మరీ మొండిగా బిహేవ్ చేస్తున్నాడు. ఏమైంది? కాలేజ్‌లో బాగానే ఉంటున్నాడా? ఎవరితోనైనా గొడవపడ్డాడా...?’.. కొంత కంగారుగానే అడిగాడు సూర్య. ‘అబ్బే.. అలాంటిదేమీ లేదు అంకుల్’ అని అన్నాడు రఘు.‘ఒరేయ్.. ఇంత దూరం వచ్చాక అసలు విషయం దాచడమెందుకు?’అని ఫ్రెండ్స్‌ని వారించి ‘అంకుల్.. నిజానికి మేమే మిమ్మల్ని కలుద్దామనుకున్నాం.. ఈలోపు మీరే పిలిచారు. మంచిదే అయింది..’ అంటూ జరిగిన విషయం చెప్పడం మొదలుపెట్టాడు జయంత్.‘అంకుల్.. మా క్లాస్మేట్ దివ్యని అజయ్ ఇష్టపడుతున్నాడు. ఆ అమ్మాయి వీడిని ఫ్రెండ్‌లాగే ట్రీట్ చేస్తోంది. మాతో సినిమాలకు వచ్చేది. క్యాంటీన్లో కూర్చుని తినేవాళ్లం.. ఇంకా... లాంగ్ డ్రైవ్స్కీ వచ్చింది. వాడి ప్లేట్లోంచి షేర్ చేసుకునేది.. ఇవన్నీ చూసి అజయ్ ఆమె కూడా తనను ఇష్టపడుతుందేమో అనుకున్నాడు అంకుల్’ అన్నాడు జయంత్. ‘వీడు ఆ అమ్మాయితో చెప్పాడా ఇష్టమని?’ అడిగాడు సూర్య. ‘ఊ... చెప్పాడు అంకుల్’ రఘు సమాధానం. ‘కాని ఆ అమ్మాయి మాత్రం.. నేను నిన్ను అలా చూడలేదు. అందరితో ఉన్నట్టే నీతో ఉన్నా. నిన్ను మంచి ఫ్రెండ్‌లాగే అనుకున్నా.. అసలు లవ్ అన్న థాటే లేదు నాకు. సారీ అజయ్.. ఒకవేళ నీకు నేను అలాంటి ఫీలింగ్ కలిగించి ఉంటే క్షమించు’’అని చెప్పింది. వాడు దాన్ని రిజెక్షన్లా ఫీలవుతున్నాడు. ఇన్సల్ట్ అనుకుంటున్నాడు. ఇది జరిగిన తర్వాత కూడా ఆ అమ్మాయి వాడితో స్నేహంగానే ఉండడానికి ప్రయత్నించింది. కాని వీడే సాధించే పని పెట్టుకున్నాడు. నిజం చెప్పాలంటే ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెడ్తున్నాడు అంకుల్. నీది తప్పురా.. అని చెప్పినందుకు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు!’ పూర్తి చేశాడు జయంత్. ‘బట్. ఆ అమ్మాయి అంత క్లోజ్‌గా మూవ్ కావల్సింది కాదేమో అంకుల్... ’ అన్నాడు దీపక్. ‘ఆ క్లోజ్‌నెస్ చూసి వాడే కాదు, నేనూ ఆమె వీడిని ఇష్టపడుతుందనే అనుకున్నా.. ’ అన్నాడు. ‘ఆగరా.. నువ్వు! అంకుల్.. ఆ పిల్ల అజయ్‌తోనే కాదు. మా అందరితోనూ అంతే క్లోజ్‌గా ఉంది.. నిజంగానే ఓ ఫ్రెండ్‌లాగే ఉంది. ఆ అమ్మాయిదేం తప్పులేదు’ అన్నాడు జయంత్. ‘హూ...’ అంటూ నిట్టూర్చాడు సూర్య. ఈలోపు టీలు తెచ్చిచ్చింది వసంత. అనుకుంటే సరిపోతుందా? బాల్కనీలో కూర్చుని సెల్ఫోన్లో చాట్ చేస్తున్న కొడుకు దగ్గరకు వెళ్లాడు సూర్య. ఒక కుర్చీలో కూర్చొని ఇంకో కుర్చీలో కాళ్లు బార్లా చాపి పెట్టుకున్న అజయ్.. తండ్రిని చూసి కూడా చూడనట్టే సెల్ఫోన్లో మునిగిపోయాడు. ‘‘కాళ్లు తియ్’’ అంటూ కొడుకు కాళ్లను తట్టాడు. ఇక తప్పదన్నట్టుగా కాళ్లు తీసి కింద పెట్టుకున్నాడు అజయ్. ఆ కుర్చీలో కూర్చుంటూ కొడుకు మీద చూపులు నిలిపాడు. ఇబ్బందిగా అనిపించిందేమో.. సర్దుకున్నాడు అజయ్. ‘నీతో మాట్లాడాలి..’ అన్నాడు సూర్య. ‘దేని గురించి?’ కొంచెం నిర్లక్ష్యంతో కూడిన సమాధానమే అజయ్ నుంచి. ఆ వెంటనే, ‘చూడూ... నాకు విషయం తెలిసింది’ అన్నట్టు కళ్లతోనే చెప్తూ.. ‘ఒరేయ్.. అనుకున్నవన్నీ సాధించడం కుదరదు’ అంటూ మొదలు పెట్టాడు. అజయ్ వయసులో సూర్య ‘‘నా పాతికేళ్ల వయసులో.. బిజినెస్ చేద్దామను కున్నా. మా నాన్నని పెట్టుబడి కోసం అయిదువేలు అడిగా. అప్పుడే చెల్లి పెళ్లి ఖాయం అయింది. ఇంట్లో డబ్బూ ఉంది. అయిదువేలు అందులోంచి ఇస్తే.. పెళ్లప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుందేమోనని ‘వీలుకాదు’ అని చెప్పాడు నాన్న . నేను నాన్నపై కోపం పెంచుకోలేదు. ఆయన నిస్సహాయతను అర్థం చేసుకున్నా. నా ఫ్రెండ్‌ని అడిగాను. వాడూ కుదరదనే అన్నాడు. వాడి మీదా కోపం పెంచుకోలేదు. పరిస్థితి తెలుసుకున్నా. ముందు ఏదో ఒక ఉద్యోగం చేసి కొంత డబ్బు పోగేసుకొని వ్యాపారం మొదలుపెట్టాలనుకున్నా. ఉద్యోగం సంపాదించా. అనుకున్నట్లుగానే షేర్స్ బిజినెస్‌లోకి దిగుదామనుకున్నా. కాని అప్పటికి అందులో పెట్టుబడి పెట్టిన నా ఫ్రెండ్స్ అంతా అప్పులపాలయ్యారు. అచ్చిరాదు అనుకొని ఉద్యోగంలోనే కంటిన్యూ అయ్యా. జాబ్‌తో గొప్పగా సంపాదించలేకపోవచ్చు.. కాని నా కుటుంబానికి మూడుపూటలా తిండి, నా పిల్లలకు మంచి చదువు.. నా భార్యకు చిన్నచిన్న ఆనందాలనైతే ఇవ్వగలిగాను. ఆ సంతృప్తిని అయితే సొంతం చేసుకున్నా. ఆ రోజు మా నాన్న మీద, నా ఫ్రెండ్ మీద కసి పెంచుకొని కక్ష్య సాధించి ఉంటే.. ఈ రోజు రత్నాల్లాంటి నా ఈ పిల్లలకు దూరమై ఉండేవాడిని. ఈ ఆనందాన్ని జీవితకాలం మిస్ అయి ఉండే వాడిని’’ అంటూ.. ఆగాడు సూర్య. అజయ్ తదేకంగా తండ్రినే చూస్తున్నాడు. ప్రేమించలేదని సాధించాలా!! ‘‘జీవితం అంటే అంతే.. మనసుపడ్డవన్నీ ఇవ్వదు. దక్కాల్సిందే దక్కుతుంది. దక్కినదాని మీద ప్రేమను పెంచుకోవాలి తప్ప, దక్కనిదానిపై ద్వేషాన్ని ఏర్పరచుకోకూడదు. అయినా నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడితే... నువ్వంటే ఇష్టంలేదు అన్న ఆ అమ్మాయి అభిప్రాయాన్నీ గౌరవించాలి.. ఆమె సంతోషాన్ని కోరుకొని పక్కకు తప్పుకోవాలి. అప్పుడే నీ ఇష్టానికి విలువ.. నువ్వంటే రెస్పెక్ట్ పెరుగుతుంది. వెంటపడి వే«ధించడం ఇష్టం కాదురా.. పైశాచికత్వం. రాక్షసత్వం. ఆ అమ్మాయి మనసులో మనిషిగా మిగులుతావో.. రాక్షసుడిగా ముద్రపడ్తావో.. నీ ఇష్టం!’ అంటూ కొడుకుతో చెప్పి అక్కడి నుంచి కదిలాడు సూర్య. – శరాది