ఇబ్బందికరమైన కాలర్లు, మోసాలకు పాల్పడుతున్న మొబైల్ కనెక్షన్‌లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్, టెలికాం డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా ఇలాంటి కోటికిపైగా మొబైల్ కనెక్షన్‌లను డిస్‌కనెక్ట్ చేసినట్లు అధికారిక ప్రకటనలో వెల్లడించాయి. అలాగే సైబర్ క్రైమ్, ఆర్థిక మోసాలకు పాల్పడినందుకు 2.27 లక్షల మొబైల్ హ్యాండ్‌సెట్‌లను టెలికాం శాఖ బ్లాక్ చేసింది.
"ఇప్పటి వరకు, సంచారసాథి సహాయంతో 1 కోటికి పైగా మోసపూరిత మొబైల్ కనెక్షన్‌లు డిస్‌కనెక్ట్ చేశాం. అలాగే సైబర్ క్రైమ్/ఆర్థిక మోసాలకు పాల్పడినందుకు 2.27 లక్షల మొబైల్ హ్యాండ్‌సెట్‌లు బ్లాక్ చేశాం" అని ప్రకటన పేర్కొంది. స్పామ్ కాల్స్ కోసం రోబోకాల్స్, ప్రీ-రికార్డ్ కాల్స్‌తో సహా బల్క్ కనెక్షన్‌లను ఉపయోగిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని టెలికాం ఆపరేటర్లను ట్రాయ్ ఆదేశించింది.వాటి కనెక్షన్‌లను డిస్‌కనెక్ట్ చేసి బ్లాక్‌లిస్ట్ చేయాలని సూచించింది.
ఇదీ చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ కోసం 5జీ ఫోన్ కొనాలా?
"గడిచిన 15 రోజుల్లో అటువంటి 3.5 లక్షల నంబర్‌లు డిస్‌కనెక్ట్ చేశాం. 50 సంస్థలను బ్లాక్‌లిస్ట్ చేశాం. అలాగే దాదాపు 3.5 లక్షల ఉపయోగించని, ధ్రువీకరించని ఎస్‌ఎంఎస్ హెడర్‌లు, 12 లక్షల కంటెంట్ టెంప్లేట్‌లను బ్లాక్ చేశాం" అని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చర్యలతో పాటు నాణ్యతా సేవా నిబంధనలను ట్రాయ్ సవరించింది. ఇవి అక్టోబర్ 1 నుండి అమలులోకి రానున్నాయి. ఏప్రిల్ 1 నుండి మొబైల్ సర్వీస్ క్యూఓఎస్ పనితీరు సమీక్ష త్రైమాసిక ప్రాతిపదికన కాకుండా నెలవారీగా నిర్వహించనున్నట్లు కూడా ప్రకటనలో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment