Mobile phone connections
-
కోటి మొబైల్ కనెక్షన్లు డిస్కనెక్ట్
ఇబ్బందికరమైన కాలర్లు, మోసాలకు పాల్పడుతున్న మొబైల్ కనెక్షన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్, టెలికాం డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఇలాంటి కోటికిపైగా మొబైల్ కనెక్షన్లను డిస్కనెక్ట్ చేసినట్లు అధికారిక ప్రకటనలో వెల్లడించాయి. అలాగే సైబర్ క్రైమ్, ఆర్థిక మోసాలకు పాల్పడినందుకు 2.27 లక్షల మొబైల్ హ్యాండ్సెట్లను టెలికాం శాఖ బ్లాక్ చేసింది."ఇప్పటి వరకు, సంచారసాథి సహాయంతో 1 కోటికి పైగా మోసపూరిత మొబైల్ కనెక్షన్లు డిస్కనెక్ట్ చేశాం. అలాగే సైబర్ క్రైమ్/ఆర్థిక మోసాలకు పాల్పడినందుకు 2.27 లక్షల మొబైల్ హ్యాండ్సెట్లు బ్లాక్ చేశాం" అని ప్రకటన పేర్కొంది. స్పామ్ కాల్స్ కోసం రోబోకాల్స్, ప్రీ-రికార్డ్ కాల్స్‌తో సహా బల్క్ కనెక్షన్లను ఉపయోగిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని టెలికాం ఆపరేటర్లను ట్రాయ్ ఆదేశించింది.వాటి కనెక్షన్లను డిస్కనెక్ట్ చేసి బ్లాక్‌లిస్ట్ చేయాలని సూచించింది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ 4జీ కోసం 5జీ ఫోన్ కొనాలా?"గడిచిన 15 రోజుల్లో అటువంటి 3.5 లక్షల నంబర్లు డిస్కనెక్ట్ చేశాం. 50 సంస్థలను బ్లాక్‌లిస్ట్ చేశాం. అలాగే దాదాపు 3.5 లక్షల ఉపయోగించని, ధ్రువీకరించని ఎస్ఎంఎస్ హెడర్లు, 12 లక్షల కంటెంట్ టెంప్లేట్లను బ్లాక్ చేశాం" అని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చర్యలతో పాటు నాణ్యతా సేవా నిబంధనలను ట్రాయ్ సవరించింది. ఇవి అక్టోబర్ 1 నుండి అమలులోకి రానున్నాయి. ఏప్రిల్ 1 నుండి మొబైల్ సర్వీస్ క్యూఓఎస్ పనితీరు సమీక్ష త్రైమాసిక ప్రాతిపదికన కాకుండా నెలవారీగా నిర్వహించనున్నట్లు కూడా ప్రకటనలో వెల్లడించారు. -
వర్చువల్ ఐడీని కూడా ఆధార్గానే పరిగణించవచ్చు
న్యూఢిల్లీ: వర్చువల్ ఐడీ, యూఐడీ టోకెన్లు కూడా ఆధార్ నంబరుకు సమానమైన ప్రత్యామ్నాయాలేనని, ధృవీకరణకు వీటిని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని విశిష్ట గుర్తింపు కార్డుల ప్రాధికార సంస్థ యూఐడీఏఐ స్పష్టం చేసింది. వ్యక్తిగత ప్రైవసీని పరిరక్షించే ఉద్దేశంతోనే ఈ రెండంచెల వ్యవస్థను టెలికం సంస్థలు వంటి ఆథెంటికేషన్ ఏజెన్సీల కోసం ప్రవేశపెట్టినట్లు వివరించింది. మొబైల్ ఫోన్ కనెక్షన్లు వంటివి తీసుకునేటప్పుడు గుర్తింపు ధృవీకరణ కోసం 12 అంకెల బయోమెట్రిక్ ఐడీని ఇవ్వాల్సిన పని లేకుండా వర్చువల్ ఐడీ సదుపాయాన్ని యూఐడీఏఐ జూలై 1న అందుబాటులోకి తెచ్చింది. 16 అంకెల ఈ తాత్కాలిక ఐడీని యూఐడీఏఐ వెబ్సైట్ నుంచి జనరేట్ చేసుకోవచ్చు. ఆధార్ డేటా దుర్వినియోగం అవుతున్న ఉదంతాల నేపథ్యంలో యూఐడీఏఐ ఈ వర్చువల్ ఐడీ, యూఐడీ టోకెన్లను ప్రవేశపెట్టింది. గుర్తింపు ధృవీకరణకు ఆధార్‌కి ప్రత్యామ్నాయంగా వీటిని ఉపయోగించేలా తగు మార్పులు చేసుకోవాలని టెల్కోలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు, సాధారణ బీమా సంస్థలు మొదలైన స్థానిక ఆథెంటికేషన్ యూజర్ ఏజెన్సీలకు సూచించింది. దానికి సంబంధించే తాజా వివరణనిచ్చింది. -
పల్లెల్లో మొబైల్ కనెక్షన్ల జోరు
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ కనెక్షన్లు జోరుగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చినెలలో నికర మొబైల్ టెలిఫోన్ కనెక్షన్లు 11.5 లక్షలు పెరిగాయని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) వెల్లడించింది. దీంతో భారత్‌లో మొత్తం వెర్లైస్ వినియోగదారుల సంఖ్య 90.45 కోట్లకు, మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 93.3 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఇవీ వివరాలు... ఫిబ్రవరి చివరి నాటికి 93.1 కోట్లకుగా ఉన్న మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 0.11 శాతం వృద్ధితో 93.3 కోట్లకు చేరింది. పల్లె ప్రాంతాల్లో మొబైల్ వినియోగదారుల సంఖ్య జోరుగా పెరిగిపోతోంది. ఫిబ్రవరిలో 37.49 కోట్లుగా ఉన్న ఈ సంఖ్య మార్చిలో 37.77 కోట్లకు పెరిగింది. మరో వైపు పట్టణ ప్రాంతాల్లో వినియోగదారుల సంఖ్య తగ్గింది. ఈ సంఖ్య 55.69 కోట్ల నుంచి 55.52 కోట్లకు క్షీణించింది. మార్చిలో ఐడియా సెల్యులర్కు వరుసగా రెండో నెలలో అధికంగా కొత్త వినియోగదారులు లభించారు. కొత్తగా చేరిన 22 లక్షల మంది వినియోగదారులతో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 13.57 కోట్లకు పెరిగింది. ఐడియా తర్వాత వొడాఫోన్‌కు అధిక సంఖ్యలో వినియోగదారులు లభించారు. ఈ కంపెనీకి 22.1 లక్షల మంది కొత్త వినియోగదారులు లభించారు. ఎయిర్‌టెల్‌కు 18.9 లక్షల మంది, ఎయిర్‌సెల్‌కు 10 లక్షల మంది, యూనినార్‌కు 7.1 లక్షల మంది, వీడియోకాన్‌కు 3.2 లక్షల మంది, సిస్టమకు 2.4 లక్షల మంది కొత్త వినియోగదారులు లభించారు. ఆర్‌కామ్‌తో పాటు, బీఎస్ఎన్ఎల్, టాటా టెలి సర్వీసెస్, ఎంటీఎన్ఎల్, లూప్ కంపెనీల వినియోగదారుల సంఖ్య తగ్గింది. బీఎస్ఎన్ఎల్కు 1.8 లక్షల మంది, టాటా టెలి సర్వీసెస్‌కు 1.4 లక్షల మంది, ఎంటీఎన్ఎల్ 1.3 లక్షల మంది, లూప్ మొబైల్ 40 వేల మంది తగ్గారు. వాడుకలో లేని 70 లక్షల వినియోగదారుల నంబర్లను రిలయన్స్ కమ్యూనికేషన్స్ తొలగించింది. అయినప్పటికీ, 11 కోట్ల మంది వినియోగదారులతో ఆర్‌కామ్ నాలుగో పెద్ద టెలికాం కంపెనీగా తన స్థానాన్ని నిలుపుకుంది. ఫిబ్రవరిలో 5.8 కోట్లుగా ఉన్న బ్రాడ్‌బాండ్ విని యోగదారుల సంఖ్య మార్చిలో 28.7 లక్షల (5%) వృద్ధితో 6.08 కోట్లకు చేరింది. వీటిల్లో వెర్లైస్ బ్రాడ్‌బాండ్ కనెక్షన్ల సంఖ్య 4.56 కోట్లుగా, ల్యాండ్‌లైన్ బ్రాడ్‌బాండ్ కనెక్షన్ల సంఖ్య 1.48 కోట్లు.