సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని అన్ని మొబైల్ నెంబర్లను ఆధార్‌తో తప్పనిసరిగా లింక్ చేయాల్సిందేనని కేంద్రం ప్రభుత్వం మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆధార్‌తో మొబైల్‌ను ఫిబ్రవరి 6 లోగా అందరూ తప్పనసరిగా అనుసంధానం చేసుకోవాలన కేంద్రం ప్రకటించింది. అంతేకాక పాత బ్యాంక్ అకౌంట్లకు ఇది వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. ఆధార్, మొబైల్ నెంబర్ అనుసంధానంపై గడువుతేదీలో ఇక మార్పులు ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. అయితే బ్యాంక్ అకౌంట్లకు గడుపు తేదీని మాత్రం మార్చి 31 వరకూ ప్రభుత్వం పొడిగించింది.
ఆధార్‌తో అనుసంధానం చేయడం అనేది.. వ్యక్తిగత గోప్యతా హక్కును ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టులో వేల సంఖ్యలో పిటీషన్లు దాఖలయ్యాయి. వీటిని రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది.
ఇదిలా ఉండగా.. మార్చి 31లోపు ఆధార్‌తో అనుసంధానం చేయబడని బ్యాంకు ఖాతాలను స్థంభింపచేయాలని ఆయా బ్యాంకులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment