విద్యార్థులు ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయాలి
Published Sun, Aug 7 2016 12:12 AM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM
విద్యారణ్యపురి : జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవే ట్ యాజమాన్యాల పాఠశాలల విద్యార్థుల ఆధార్ నంబర్‌ను చైల్డ్ ఇన్‌ఫో వెబ్‌సైట్‌లో అనుసంధానం చేయాలని డీఈఓ పి.రాజీవ్ కోరారు. ఆధార్‌కార్డు నంబర్ కలిగి ఉంటేనే టెన్త్ విద్యార్థులకు నామినల్ రోల్స్, ప్రభుత్వం నుంచి లభించే ప్రోత్సహాకాలు అందిస్తారన్నారు. జిల్లాలో 47,658 మంది విద్యార్థులకు ఆధార్ నంబర్లు లేవన్నారు. వీటిల్లో అత్యధికంగా హన్మకొండ మండలంలో ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో 14,620మంది విద్యార్థులకు 8,899 మంది విద్యార్థులు మాత్రమే ఆధార్ నం బర్లు కలిగి ఉన్నారన్నారు. ఇక ప్రైవేట్ విద్యాసంస్థల్లో 56,035 మంది విద్యార్థులకు గాను 40,971 మంది విద్యార్థులకు ఆధార్ నంబర్ కలిగి ఉన్నారని చెప్పారు. వరంగల్ మండలంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో 10,617మందికి గాను 6,870 మంది విద్యార్థులు మాత్రమే ఆధార్ నంబర్ కలిగి ఉన్నారని తెలిపారు. ఆధార్‌నంబర్ లేని విద్యార్థు వివరాలన్నీ ఆయా ఎంఈవోల ద్వారా అన్ని పాఠశాలలకు పంపించామన్నారు. ఆధార్ కార్డు నంబ ర్ లేని విద్యార్థులు ఈనెల 31తేదీ వరకు మీసేవా కేంద్రంలో నంబర్‌ను పొందాలని కోరారు.
Advertisement
Advertisement