డిజిటల్ నంబర్లను వివరిస్తున్న ఎస్పీ
గుంటూరు : అర్బన్ జిల్లా పరిధిలో ప్రయాణించే ప్రతి ఆటోకు పోలీసు గుర్తింపు నంబరు తప్పని సరిగా ఉండేలా చర్యలు చేపడుతున్నామని అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు చెప్పారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో గురువారం ఆటోలకు పోలీస్ గుర్తింపు నంబర్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రయాణీకులకు కనిపించేలా ఆటో యజమాని వివరాలు, క్విఆర్ కోడ్, ట్రాఫిక్ అధికారుల ఫోన్ నంబర్లతో కూడిన వివరాలతో పోలీస్ నంబర్‌తో ఉండేలా చర్యలు చేపట్టామని తెలిపారు.
అంతేకాకుండా ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఆటో వివరాలు సునాయాసంగా తెలుసుకునేందుకు వీలుగా ఏ ఆటో స్టాండ్‌కు సంబంధించిన వాహనం, యజమాని వివరాలు, డ్రైవింగ్ లైసెన్స్ నంబరు, ఆధార్, ఫోన్ నంబర్లను ఆటోడిజిటైజేషన్.కం వెబ్‌సైట్‌లో నమోదు చేస్తున్నామన్నారు. ఎవరైనా వివరాలు చూడాలనుకునే వారు ఈ వెబ్‌సైట్‌లో పరిశీలించుకొనే వెసులుబాటు ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండి ఎక్కిన వెంటనే సదరు ఆటో నంబరు, లేదా ట్రాఫిక్ పోలీస్ నంబరు గుర్తుంచుకోవడం లేకుండా ఫోన్‌లో ఫొటో తీయడం చేస్తే ఏదైనా నేరం జరిగిన సమయంలో సునాయాసంగా గుర్తుంచవచ్చని తెలిపారు. అనంతరం 200 ఆటోలకు పోలీస్ గుర్తింపు నంబర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు పాపారావు, వెంకటరెడ్డి, సీఐలు వేమారెడ్డి, పూర్ణచంద్రరావు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment