న్యూఢిల్లీ : బాలల పట్ల లైంగిక నేరాల నిరోధం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రభుత్వం కొన్ని రోజులపాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ‘జనాలు ఇంటర్‌నెట్‌లో అశ్లీల విషయాల గురించి సర్చ్ చేస్తున్నప్పుడు ఈ చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ కనిపిస్తుండటంతో.. వారు ఈ నంబర్‌ను సెక్సువల్ సర్వీస్‌లు అందజేయడానికి ఉద్దేశించినదిగా భావిస్తున్నారు. దాంతో జనాలు ఈ నంబర్‌కు ఫోన్ చేసి అసభ్యకరమైన సేవలు అందించాల్సిందిగా అడుగుతున్నారు. అందువల్ల కొన్ని రోజుల పాటు ఈ నంబర్‌ను నిలిపివేస్తున్నట్లు’ అధికారులు తెలిపారు.
ప్రస్తుతం చైల్డ్‌హెల్ప్‌లైన్ కోసం వినియోగిస్తున్న 1098 నంబర్ స్థానంలో త్వరలోనే మరో కొత్త నంబర్‌ని తీసుకువస్తామని అధికారులు వెల్లడించారు. అంతేకాక ఈ విషయం మీద పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 2016లో మహిళాశిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ చిన్నపిల్లల పట్ల లైంగిక నేరాలకు పాల్పడే వారికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయడానికి వీలుగా ‘ఇ - బాక్స్’ ప్రొగ్రామ్‌ని ప్రారంభించింది. అందులో భాగంగా ఈ చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్‌ను తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment