సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచాన్ని కుదిపేస్తోన్న కరోనా వైరస్ మహమ్మారికి సంబంధించిన వార్తల ప్రస్తావన వచ్చినప్పుడల్లా వివిధ దేశాల ప్రభుత్వాలు, అధికారులు, టీవీ యాంకర్లు ‘ఆర్’ నెంబర్ లేదా ఆరు శాతం ఎంతుందంటే’ అని చెబుతున్నారు. ఇంతకు ‘ఆర్’ నెంబర్ దేనికి ప్రాతినిథ్యం వహిస్తోంది. ఆర్ అంటే రీప్రొడక్షన్ (పునరుత్పత్తి). ఓ కరోనా వైరస్ బారిన పడిన రోగి ద్వారా ఎంత మందికి ఆ వైరస్ పాకుతుందన్న లెక్కలే ‘ఆర్’ నెంబర్లు లేదా శాతం. అంటే ఓ కరోనా రోగి నుంచి ఒకరికి మాత్రమే కరోనా వ్యాపిస్తే అది ‘ఆర్ వన్’గా, ఇద్దరికి, ముగ్గురికి వ్యాపిస్తే ‘ఆర్ 2’, ఆర్ 3’గా వ్యవహరిస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తికి కొలమానంగా ‘ఆర్’ అంకెను వాడుతున్నారు. ఆర్ అంకె తక్కువగా ఉంటే కరోనా వైరస్ తక్కువగా ఉన్నట్లయితే వ్యాధి అదుపులో ఉన్నట్లు అదే ఆర్ అంకె ఎక్కువగా ఉంటే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు. కరోనా వైరస్ విస్తరించిన తొలి రోజుల్లో బ్రిటన్‌లో ఆర్ రేటు 3గా ఉండేది. అంటే ఒకరి నుంచి ముగ్గురికి, ఆ ముగ్గురిలో ప్రతి ఒక్కరి నుంచి ముగ్గురికి వైరస్ వ్యాప్తి చెందడాన్నే ‘ఆర్ 3’గా వ్యవహరిస్తారు. (భారత్‌లో ఒక్క రోజే 17,296 కరోనా కేసులు)
ఇప్పుడు కరోనా వైరస్‌కు సంబంధించి ‘కే’ అనే పదం కొత్తగా పుట్టుకొచ్చింది. కే అంటే ఏమిటీ? అది దేనికి ప్రాతినిథ్యం వహిస్తోంది. కొందరి వ్యక్తుల్లో కరోనా వైరస్ తీవ్రంగా ఉన్నప్పటికీ బయటకేమీ కరోనా లక్షణాలు కనిపించవు. అలాంటి వారు సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతూ అనేక మందికి కరోనా వ్యాపించేందుకు కారణం అవుతారు. వారిని ‘కే’గా వ్యవహరిస్తున్నారు. ‘కే’ల సంఖ్య తక్కువున్నప్పటికీ వారి వల్ల వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతుంది. (కరోనా కట్టడిలో ఆ రాష్ట్రం ఆదర్శం)
Comments
Please login to add a commentAdd a comment