
సాక్షి, ముంబై : దేశీ ఇంధన ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరుగుదలను నమోదు చేశాయి. మంగళవారం (మే 21) పెట్రోల్ ధర 5 పైసలు, డీజిల్ ధర 9-10 పైసలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పైకి ఎగిశాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.43 శాతం పెరుగుదలతో 72.28 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.46 శాతం పెరుగుదలతో 63.50 డాలర్లకు ఎగసింది. దేశీయంగా పెట్రోలు ధరలను ప్రభావితం చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 5 పైసలు పెరుగుదలతో రూ.71.17కు చేరింది. డీజిల్ ధర 9 పైసలు పెరుగుదలతో రూ.66.20కు ఎగసింది.
వివిధ నగరాల్లో ఇంధన ధరలు లీటరుకు
ముంబై: పెట్రోల్ రూ.76.78, డీజిల్ రూ.69.36
కోలకతా : పెట్రోల్ రూ.73.24, డీజిల్ రూ.67.96
చెన్నై : పెట్రోల్ రూ.73.87 డీజిల్ రూ.69.97
హైదరాబాద్ : పెట్రోల్ రూ.75.48, డీజిల్ రూ.71.99
అమరావతి: పెట్రోలు రూ.75.24 , డీజిల్ రూ.71.36
విజయవాడ : పెట్రోల్ రూ.74.89 డీజిల్ రూ.71.03