సాక్షి, ముంబై: ఆసియా మార్కెట్ల బలంతో ఆరంభంలోనే పాజిటివ్‌గా ఉన్న మార్కెట్లు ప్రస్తుతం మరింత పుంజుకున్నాయి. ముఖ్యంగా ఉత్తరకొరియా ఉద్రికత్తగా కొద్దిగా చల్లారుతున్న సంకేతాలతో కొనుగోళ్ల ధోరణి భారీగా నెలకొంది. దీంతో సెన్సెక్స్ 261 పాయింట్లు జంప్‌చేసి 31,650ను తాకింది. నిఫ్టీ 90 పాయింట్లు ఎగసి 9,8856 వద్ద కొనసాగుతోంది.. తద్వారా నిఫ్టీ 9850ను అధిగమించడంతోపాటు మరోసారి 9,900 కీలక స్థాయివైపు చూస్తోంది. మంగళవారం భారగా అమ్మకాలు చేపట్టిన ట్రేడర్లు స్క్వేరప్ లావాదేవీలకు దిగడంతో, మార్కెట్లకు బలమొచ్చిందని, రిలీఫ్ ర్యాలీ అని నిపుణులు చెబుతున్నారు.
దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ఉన్నప్పటికీ మెటల్ 2 శాతం లాభపడి టాప్ విన్నర్‌గా ఉంది. దీనికి ఫార్మా ,బ్యాంకింగ్ సెక్టార్, రియల్టీ, ఆటో లాభాలు మద్దతినిస్తున్నాయి. ఐఓసీ, హిందాల్కో మార్కెట్ ను లీడ్ చేస్తుండగా వేదాంత, అంబుజా సిమెంట్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. వీటితో పాటు యస్‌బ్యాంక్, బీపీసీఎల్, అరబిందో, ఆర్‌ఐఎల్, హీరోమోటో, హెచ్డీఎఫ్‌సీ లాభపడుతున్నాయి. హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టీసీఎస్ స్వల్పంగా నష్టపోతున్నాయి.