పాడుబడ్డ బావిలో పైపైకి గంగమ్మ!
బొంరాస్‌పేట : భూగర్భజలం అడుగంటిపోతూ ఆందోళన కలిగిస్తుంటే ఓ పాడుబడ్డ బావిలో నీరు ఊరుతూ ఆశ్చర్యం కలిగిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా బొంరాస్‌పేట మండలం చిల్మల్‌మైలారంలో ఓ రైతు పొలంలోని పాడుబడిన వ్యవసాయ బావిలో రెండువారాలుగా నీరు ఊరుతుంది. వివరాలు.. గ్రామానికి చెందినబర్ల వెంకటయ్య, రాములు, అంజిలప్ప అన్నదమ్ములు 25ఏళ్ల క్రితం సామూహిక బోర్‌వెల్ పథకం కింద వ్యవసాయ బోరు తవ్వారు. నీరు పుష్కలంగా రావడంతో ఐదేళ్లపాటు వ్యవసాయం చేశారు. కొన్నాళ్లకు నీరు పూర్తిగా ఇంకిపోవడంతో బాడుబడింది. నెల రోజుల క్రితం ఇదే బావిలో నీటిచెమ్మ మొదలై ప్రస్తుతం రోజుకు 6 ఇంచుల నీరు ఊరుతూ బావి నిండుకొస్తోం