
సాక్షి, ముంబై: డాలర్‌మారకంలో దేశీయకరెన్సీ రూపాయి దూకుడు కొనసాగుతోంది. ముఖ్యంగా కొత్త ఏడాదిలో పటిష్టంగా ట్రేడ్ అవుతున్న రూపాయి సోమవారం 11 పైసల లాభంతో 63.26 వద్ద ప్రారంభమైంది. శుక్రవారం 63.37 వద్ద 32 నెలల గరిష్టాన్ని నమోదు చేసిన రూపాయి తాజాగా మరింత జోష్‌గా ట్రేడ్ అవుతుండడటం విశేషం.
కరెన్సీ డీలర్ల కొనుగోళ్లు, విదేశీ నిధుల పెట్టుబడులు, విదేశీ కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలహీనపడటంతో రూపాయికి మద్దతు లభించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్లు కూడా లాభాలతో కొత్త గరిష్టాల వద్ద పటిష్టంగా మొదలయ్యాయి. అటు పసిడి ధరలు స్వల్పంగా నష్టపోతున్నప్నటికీ స్థిరంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment