న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం స్పీడ్ ఆగస్టులో యథాతథంగా జూలై తరహాలోనే 1.08 శాతంగా కొనసాగింది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం కూడా నిర్దేశిత 4% దిగువన కొనసాగుతుండడంతో రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మరో దఫా రెపో రేటు కోతకు అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వృద్ధే లక్ష్యంగా రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 5.4 శాతం) గడచిన నాలుగు ద్వైమాసికాల్లో ఆర్‌బీఐ 1.1 శాతం తగ్గించిన సంగతి తెలిసిందే.
ఆరి్థక వృద్ధి మందగమనం, పారిశ్రామిక రంగం నత్తనడక వంటి అంశాల నేపథ్యంలో మరో దఫా రేటు కోత తప్పదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాజా ఆగస్టు గణాంకాలను చూస్తే, ఆహార ఉత్పత్తుల ధరలు కొంత పెరిగినా, తయారీ రంగంలో ఉత్పత్తుల ధరలు మాత్రం అసలు (జీరో) పెరగలేదు. ఫుడ్ ఆరి్టకల్స్ ధరలు జూలైలో 6.15 శాతం ఉంటే, ఆగస్టులో 7.67 శాతానికి ఎగశాయి. కూరగాయల ధరలు 10.67 శాతం నుంచి 13.07 శాతానికి ఎగశాయి. కాగా ఇంధనం, ఫ్యూయెల్ అండ్ పవర్ బాస్కెట్ ధర 4 శాతం పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment