న్యూఢిల్లీ: ధరల పెరుగుదల (ద్రవ్యోల్బణం) సమస్యను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఒక్కటే కట్టడి చేయలేదని మాజీ గవర్నర్ సీ రంగరాజన్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణ కట్టడిలో కీలకమైన సరఫరాలో సమస్యలను అధిగమించడంలో ప్రభుత్వానిదే కీలక పాత్ర అని ఆయన పేర్కొన్నారు. ‘నూతన ద్రవ్య విధాన ఫ్రేమ్‌వర్క్ – దాని అర్థం’’ అన్న చర్చాపత్రంపై ఆయన తన అభిప్రాయాలను వెలిబుచ్చుతూ, ద్రవ్యోల్బణం కట్టడిలో ఆర్‌బీఐ ద్రవ్య విధాన పరిమితుల గురించి మాట్లాడారు. రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం ఉండాలన్నది ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశం. అయితే, దీనికి ‘ప్లస్ 2’ లేదా ‘మైనస్ 2’ శాతాన్ని తగిన స్థాయిగా పరిగణనలోకి తీసుకుంటారు. కాగా ఉల్లి తదితర కూరగాయల రేట్లు ఆకాశాన్నంటడంతో రిటైల్ ద్రవ్యో ల్బణం ఒక్కసారిగా 7.5 శాతాన్ని జనవరి (7.59 శాతం) దాటింది. ద్రవ్యోల్బణం కట్టడితోపాటు, వృద్ధి, ఫైనాన్షియల్ రంగం సుస్థిరత వంటి ఎన్నో బాధ్యతలను ఆర్‌బీఐ నెరవేర్చాల్సి ఉంటుందని రంగరాజన్ అభిప్రాయపడ్డం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment