
హైదరాబాద్: తెలంగాణలో కోడి గుడ్ల ధరలు రయ్ రయ్ మంటూ దూసుకుపోతున్నాయి. రూ. 6.50కే అమ్మో అనుకుంటున్న సామాన్యుడికి మళ్లీ పెంపు వార్త ఆందోనళకు గురిచేస్తోంది. తాజాగా గుడ్డు ధర మళ్లీ పెరిగింది.
ఇక, పది రోజుల్లో డజను కోడిగుడ్ల ధర ఏకంగా రూ.80కి చేరుకుంది. దీంతో, బయట దుకాణాల్లో లూజ్ ధర మళ్లీ పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఏడాది నుంచి డజను గుడ్ల ధర రూ.65 నుంచి రూ. 70 మధ్య ఉంది. అయితే.. ఇప్పుడు ఏకంగా ఎనభైకి చేరడం గమనార్హం.