
తోడు లేని జీవితం
తోడు లేకపోతే... లైఫ్ అంటేనే మొహం మొత్తుతుంది. ఈ కారణంగానే ఢిల్లీ జూలో కొన్ని జంతువులు లైఫ్‌లెస్‌గా గడుపుతున్నాయి. అక్కడిప్పుడు రెండు ఆడ ఖడ్గమృగాలు, ఒక ఆడ హైనా, ఒక మగ ఆఫ్రికన్ ఎలిఫెంట్, ఒక మగ చిరుత, ఇంకో మగ నల్లచిరుత... తోడు లేక డల్‌గా ఉంటున్నాయి. ఏడాది క్రితం బర్డ్‌ఫ్లూ జాడలు కనిపించడంతో జూ లోకి కొత్త జంతువుల్ని, పక్షుల్ని తీసుకురావడం ఆపేశారు.
అంతకు ముందే వీటి జతలు కొన్ని అనారోగ్యంతో మరణించాయి. అప్పట్నుంచి ఇవి ఒంటరిగా ఈసురోమని కాలం గడుపుతున్నాయి. సందర్శకుల్ని ఏమాత్రం ఎక్సైట్ చేయడం లేదు కూడా. పరిస్థితి ఇలాగే ఉంటే జూ ఫేస్‌వాల్యూ పడిపోతుందని నేషనల్ జూలాజికల్ పార్క్ అధికారులు తక్షణం అనుసరించాల్సి వ్యూహం గురించి ఆలోచిస్తున్నారు.