బీజింగ్: చైనాను వణికిస్తున్న ప్రాణాంతక హెచ్7ఎన్9 రకం బర్డ్ ఫ్లూ వైరస్‌కు ఆ దేశ శాస్త్రవేత్తలు తొలి వ్యాక్సిన్‌ను తయారు చేశారు. చైనా శాస్త్రవేత్తలు ఫ్లూ వ్యాక్సిన్‌ను తయా రు చేయడం ఇదే తొలిసారి. పరిశోధనలో భాగంగా వీరు హెచ్7ఎన్9 వ్యాధి సోకిన రోగి నుంచి గొంతు నుంచి కణజాలం సేకరించారు. తర్వాత అందులోంచి వైరస్ విజ యవంతంగా వేరు చేశారు. దీని కోసం ప్లాస్మిడ్ రివర్స్ జెనెటిక్స్, జెనెటిక్స్ రీయసార్ట్‌మెంట్ అనే విధానాన్ని అనుసరించారు.