భీమదేవరపల్లి: వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్‌కు చెందిన గద్ద సారయ్యకు చెందిన 120 నాటు కోళ్లు మృత్యువాత పడ్డాయి. సారయ్య కొన్ని నెలలుగా నాటు కోళ్లు పెంచి విక్రయిస్తూ జీననోపాధి పొందుతున్నాడు. రెండు రోజుల వ్యవధిలోనే అవి మృతి చెందడంతో దాదాపు రూ.లక్ష మేరకు నష్టపోయినట్లు తెలిపారు. చనిపోయిన కోళ్లను మండల పశువైద్యాధికారి మాలతి పరిశీలించారు. నమూనాలను పరీక్ష నిమిత్తం వరంగల్ ప్రాంతీయ పశు వైద్యశాలకు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. కాగా, పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ సోకుతుందనే ప్రచారం నేపథ్యంలో ఒకేసారి భారీ సంఖ్యలో కోళ్లు చనిపోవడం కలకలం రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment