ఆందోళనలో పౌల్ట్రీ నిర్వాహకులు
బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లు అనుమానం?
వేల్పూర్‌లో కోళ్ల రక్త నమూనాలను సేకరించిన అధికారులు
రుద్రూర్/నిజామాబాద్: పౌల్ట్రీ ఫామ్‌లలో కోళ్లు కుప్పలుకుప్పలుగా మృతి చెందుతున్నాయి. దీంతో పౌల్ట్రీ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. పొతంగల్ మండలం చేతన్‌నగర్ శివారులోని కోళ్ల ఫామ్‌లో గత రెండు రోజులుగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.
జల్లాపల్లికి చెందిన రవి చేతన్‌నగర్ శివారులో కోళ్ల ఫామ్‌ను లీజుకు తీసుకుని నడిపిస్తుండగా, సోమ, మంగళ వారాల్లో సుమారు 4,500 కోళ్లు మృతి చెందాయి. రూ.7లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బర్డ్ ఫ్లూతోనే కోళ్లు మృతి చెందుతున్నాయేమోనని అనుమానం వ్యక్తం చేశాడు.
వేల్పూర్ మండలం లక్కోర గ్రామానికి చెందిన కొట్టాల గోవర్ధన్‌కు చెందిన పౌల్ట్రీఫామ్‌లో మంగళవారం 25 కోళ్లు మృతి చెందాయి. సమాచారం అందుకున్న అధికారులు పౌల్ట్రీఫామ్‌ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. కోళ్ల నుంచి రక్త నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment