
పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి.దామోదర నాయుడు వెల్లడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ పూర్తిగా అదుపులోనే ఉందని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి.దామోదరనాయుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బర్డ్ ఫ్లూ నిర్ధారణ జరిగిన తూర్పు గోదావరి జిల్లా కానూరు అగ్రహారం, పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరు, కృష్ణాజిల్లా బాదంపూడి, కర్నూలు జిల్లా ఎన్.ఆర్.పేట, ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం ప్రాంతాల్లో పటిష్ట చర్యలు తీసుకున్నామని, ఫలితంగా ఇతర ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఈ వ్యాధి నిర్ధారణ కాలేదన్నారు. ఆ ఐదు ప్రాంతాల్లో మినహా రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో కోళ్లు, గుడ్ల రవాణాపై ఆంక్షలు లేవని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment