ఇక్కడ రెండు పులులు భీకరంగా కొట్టేసుకుంటున్నాయి గానీ.. నిజానికివి తల్లీకూతుళ్లు.. మొన్న మొన్నటి వరకూ కలిసి ఉన్నవే.. కానీ ఇప్పుడు కూతురు తన జాగాలో అడుగుపెడితే చాలు... వాళ్లమ్మ కస్సుమంటోంది. ఇదిగో ఇలా పైన పడి కొట్టిసింది కూడా.. అడవుల్లోని పులులు తమ ప్రాంతంలోకి వేరే పులులు వస్తే చాలు.. ఇలాగే రియాక్ట్ అవుతాయి. ఎవరి రాజ్యం వాళ్లదన్నమాట.. సాధారణంగా పిల్లలను ఏమీ అనవని.. అయితే.. ఇక్కడ పులుల సంఖ్య పెరిగిందని.. దానివల్ల స్థలం కరువై చివరికి తల్లీకూతుళ్లు కూడా ఇలా చీటికిమాటికీ గొడవపడే స్థాయికి పరిస్థితి చేరిందని అటవీ రేంజర్లు చెబుతున్నారు. ఈ చిత్రాలను రణతంబోర్ జాతీయ పార్కులో పుణెకు చెందిన ఫోటోగ్రాఫర్ చంద్రబాల్ సింగ్ క్లిక్ మనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment