
బీజింగ్ : చైనా, హుఝౌలోని ‘ థైహు లేక్ లాంగేమెంట్ ప్యారడైజ్ జూ’లో అత్యంత అరుదైన పులి పిల్లలు జన్మించాయి. జేయింట్ పాండా కంటే అరుదైన జాతికి చెందిన ఓ గోల్డెన్ టైగర్ ఈ నెల 19న నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం 24 గంటల వైద్య పర్యవేక్షణలో వాటిని ఉంచారు. జెనటిక్ మ్యూటేషన్ పద్ధతి ద్వారా బెంగాల్ టైగర్‌కు పుట్టిన జాతి ఈ గోల్డెన్ టైగర్. 2014 సర్వే ప్రకారం చైనాలో కేవలం 62 గోల్డెన్ టైగర్‌లు మాత్రమే ఉన్నాయని తేలింది. (వెబ్ సిరీస్ పిచ్చి 75 మందిని కాపాడింది)
ఈ సంఖ్య అంతరిస్తున్న పాండా జాతి కంటే తక్కువ. బంగారు రంగుతో, ఎర్రని, గోధుమ రంగు చారలతో ఇవి చూడముచ్చటగా ఉంటాయి. అవి పెద్దవయ్యే కొద్ది చారలు రంగు మారి నలుపు రంగులోకి పోతాయి. ప్రస్తుతం ఈ నాలుగు పులి పిల్లలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment