అన్నానగర్: అనుమానాస్పద స్థితిలో రెండు పులులు మృతిచెందినట్టు ముదుమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కన్జర్వేటర్, ఫీల్డ్ డైరెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. దాని ప్రకారం అవలాంజీ డ్యామ్ మిగులు నీటి కాలువ సమీపంలో ఆదివారం రెండు పులులు చనిపోయాయని ఎమరాల్డ్ రేంజర్లు నివేదించారు. వెంటనే నీలగిరి జిల్లా అటవీశాఖ అధికారి సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. విచారణ సమాచారం ప్రకారం, రెండూ ఆడ పులుల శరీరాలపై ఎలాంటి గాయాలు లేవు. రెండు రోజులకు ముందు చనిపోయి ఉండవచ్చు అని తెలుస్తుంది.
దేవరాజ్ నేతృత్వంలో 20 మంది ఉద్యోగులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. సమూహ సంఘటన చుట్టుపక్కల ప్రాంతాలను విచారణ చేస్తున్నారు. ఈ రెండు పులులు విషం తాగి చనిపోయాయేమోనని క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నేడు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం తర్వాతే అసలు కారణం వెల్లడవుతుంది. ఈ విధంగా అందులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment