Suspicious status
-
‘నవాల్నీ’ మృతదేహం అతని తల్లికి అప్పగింత
మాస్కో: ఇటీవల రష్యాలోని ఆర్కిటిక్ పీనల్ కాలనీ జైలులో వివాదస్పద స్థితిలో మృతి చెందన రష్యా ప్రతిపక్షనేత, అధ్యక్షుడు పుతిన్ రాజకీయ ప్రత్యర్థి అలెక్సీ నావల్ని మృత దేహాన్ని ఎట్టకేలకు అతని తల్లికి అప్పగించారు. అలెక్సీ నావల్ని మరణించిన వారం రోజులకు ఆయన మృతదేహాన్ని తన తల్లికి అప్పగించారు. ‘అలెక్సీ మృతదేహాన్ని అతని తల్లికి అప్పగించారు. ఆయన మృతదేహాన్ని తన తల్లికి అప్పగించాలని కోరిన మీ అందరికీ చాలా ధన్యవాదాలు’ అని నవల్నీ ప్రతినిధి కిరా యార్మిష్ తెలిపారు. Alexey's body was handed over to his mother. Many thanks to all those who demanded this with us. Lyudmila Ivanovna is still in Salekhard. The funeral is still pending. We do not know if the authorities will interfere to carry it out as the family wants and as Alexey deserves. We… — Кира Ярмыш (@Kira_Yarmysh) February 24, 2024 ఇటీవల.. నావల్ని మృతదేహాన్ని రహస్యంగా ఖననం చేయాలని, ఎలాంటి అంతిమయాత్ర నిర్వహించడానికి వీలు లేదని తమపై రష్యా ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చిందని నావల్ని తల్లి లియుడ్మిలా ఆవేదన వ్యక్తం చేశారు. పుతిన్‌ను తీవ్రంగా విమర్శించే ప్రతిపక్ష నేతగా పేరున్న జైలులో ఉన్న రష్యా ప్రతిపక్ష పార్టీ నేత అలెక్సీ నావల్నీ(47) జైలులోనే మృతి చెందారు. ఈ విషయాన్ని యమాలో నెనెట్స్ ప్రాంత జైలు సర్వీసు డిపార్ట్మెంట్ వెల్లడించింది. నావల్నీ పలు రాజకీయ ప్రేరేపిత కేసుల్లో దోషిగా తేలడంతో 2021 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. చదవండి: నవాల్నీ మృతదేహం అప్పగింత కోసం తల్లి ఆవేదన -
కనీసం చివరిచూపు చూసుకోనివ్వండి
మాస్కో: రష్యా మారుమూల జైలులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విపక్ష నేత, హక్కుల ఉద్యమకారుడు అలెక్సీ నవాల్నీ పార్థివదేహాన్ని వెంటనే అప్పగించాలని ఆయన తల్లి ఆవేదనతో ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. చనిపోయాక మృతదేహాన్ని వేరే చోటుకు తరలించామంటూ తల్లి, నవాల్నీ న్యాయవాదులను అటూ ఇటూ తిప్పుతూ అధికారులు తిప్పలు పెడుతున్నారు. మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని ల్యాబ్ పరీక్షలు చేయిస్తేగానీ విషప్రయోగం జరిగిందా లేదా అనేది తెలియని పరిస్థితి. అందుకే కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించట్లేరనే వాదన వినిపిస్తోంది. మాస్కోకు 1,900 కిలోమీటర్ల దూరంలోని ఆర్కిటిక్ ధృవ సమీపంలో మంచుమయ మారుమూల కారాగారంలో శుక్రవారం నవాల్నీ మరణించిన విషయం తెల్సిందే. విషయం తెల్సి నవాల్నీ తల్లితో కలిసి న్యాయవాది కిరా యామిష్క్ ఆ జైలుకెళ్లారు. అక్కడ మృతదేహం లేదు. దర్యాప్తులో భాగంగా సలేఖర్డ్ సిటీకి తరలించామని అధికారులు చెప్పారు. తీరా అక్కడి సిటీ మార్చురీకి వెళ్తే మూసేసి ఉంది. ఇక్కడికి తీసుకురాలేదని అక్కడి అధికారులు చెప్పారు. ‘మరణానికి కారణాన్ని రష్యా ప్రభుత్వం ఇంతవరకు వెల్లడించలేదు. మృతదేహాన్ని అయినా అప్పగించాలి’ అని లాయర్ డిమాండ్‌చేశారు. -
అనుమానాస్పద స్థితిలో రెండు పులుల మృతి
అన్నానగర్: అనుమానాస్పద స్థితిలో రెండు పులులు మృతిచెందినట్టు ముదుమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కన్జర్వేటర్, ఫీల్డ్ డైరెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. దాని ప్రకారం అవలాంజీ డ్యామ్ మిగులు నీటి కాలువ సమీపంలో ఆదివారం రెండు పులులు చనిపోయాయని ఎమరాల్డ్ రేంజర్లు నివేదించారు. వెంటనే నీలగిరి జిల్లా అటవీశాఖ అధికారి సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. విచారణ సమాచారం ప్రకారం, రెండూ ఆడ పులుల శరీరాలపై ఎలాంటి గాయాలు లేవు. రెండు రోజులకు ముందు చనిపోయి ఉండవచ్చు అని తెలుస్తుంది. దేవరాజ్ నేతృత్వంలో 20 మంది ఉద్యోగులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. సమూహ సంఘటన చుట్టుపక్కల ప్రాంతాలను విచారణ చేస్తున్నారు. ఈ రెండు పులులు విషం తాగి చనిపోయాయేమోనని క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నేడు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం తర్వాతే అసలు కారణం వెల్లడవుతుంది. ఈ విధంగా అందులో పేర్కొన్నారు. -
ఏం జరిగిందో పాపం..! అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం
లక్కవరపుకోట: మండలంలోని గోల్డ్‌స్టార్ జంక్షన్ నుంచి గేదులవానిపాలెం గ్రామం వెళ్లే రహదారిలో జమ్మాదేవిపేట సమీపంలో గల సరస్వతి లేఆవుట్ వద్ద కళ్లేపల్లి గ్రామానికి చెందిన వెలుగులో బుక్ కీపర్ గోకేడ ఉమామహేశ్వరి(29) అనుమానస్పద స్థితిలో మృతిచెందింది. గురువారం వెలుగుచూసిన ఈ విషయం తెలుసుకున్న మండల వాసులు ఒక్కసారిగా ఉల్కిపడ్డారు. స్థానికులు, ఎస్సై ముకుందరావు తెలియజేసిన మేరకు వివరాలిలా ఉన్నాయి. సరస్వతి లేఅవుట్ సమీపంలో చిలకావాని చెరువులో ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్నారు. వారిలో ఒక కూలీ సేద తీరేందుకు పక్కనే గల గట్టువద్దకు వచ్చి నిలబడి సమీపంలో మృతదేహాన్ని గుర్తించి తోటి కూలీలకు తెలిపాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి డీఎస్సీ ఆర్.గోవిందరావు, ఎస్సై ముకుందరావులు సిబ్బందితో చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహం ఫొటోను వాట్సాప్ గ్రూప్‌లో సెండ్ చేయుగా కళ్లేపల్లి గ్రామానికి చెందిన గోకేడ ఉమామహేశ్వరిగా కొంతమంది గుర్తించారు. వెంటనే మృతురాలి కుటుంబసభ్యులకు విషయం చేరవేయగా వారు ఘటనా స్థలానికి చేరుకుని ఉమామహేశ్వరిగా గుర్తించారు. ఇదిలా ఉండగా విజయనగరం జిల్లా కేంద్రంలో వెలుగు ఆధ్వర్యంలో సమావేశం ఉందని ఉమామహేశ్వరి బుధవారం ఉదయం 9 గంటలకే ఇంటి నుంచి బయల్దేరి వెళ్లింది. రాత్రికి ఇంటికి రాకపోవడంతో ఆరా తీయగా ఆమె సమావేశానికి హాజరుకాలేదని అధికారులు తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు వెతకడం ప్రారంభించారు. అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యమైన తరువాత ఆమెను ఎక్కడో చంపేసి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేసి ఉంటారని పోలీసులు భావించారు. క్లూస్ టీమ్, డాగ్స్వాడ్లు వచ్ఛి పరిసర ప్రాంతాల్లో పరిశీలించినప్పటికీ ఎటవంటి ఆధారాలు లభించేలేదు. మృతురాలి భర్త నాయుడు ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. బిక్కుబిక్కుమంటూ ఇద్దరు పిల్లలు కాగా మృతురాలికి నవనీత్ (13),సాద్విక్ (12) ఇద్దరు మగ పిల్లలు కలరు. మా అమ్మ విజయనగరం మీటింగ్‌కు వెళ్లింది తిరిగి వస్తుందని చెప్పడంతో అక్కడ ఉన్న వారు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడూ ఈ తరహా ఘటనలు జరగకపోవడంతో మండలవాసులు భయభ్రాంతులకు లోనయ్యారు. పోలీసులు శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. విజయనగరం ఫోర్ట్: విద్యుత్ షాక్‌తో ఓ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. నగరంలోని కేఎల్‌పురంలో ఓ ఇంటికి విద్యుత్ సరఫరా వచ్చి పోతుండడంతో యాజమాని పక్క వీధిలో ఉన్న ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ టెక్కలి అప్పలరాజు (40)ను తీసుకొచ్చాడు. అక్కడ మూడు విద్యుత్ ట్రాన్సఫార్మర్లు ఉండగా ఆపాల్సిన ట్రాన్సఫార్మర్ కాకుండా వేరే ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ సరఫరా నిలిపివేసి విద్యుత్ పోల్ ఎక్కడంతో ఒక్కసారిగా విద్యుత్ ప్రవహించగా షాక్‌కు గురై కింద పడిపోవడంతో గాయాలయ్యాయి. వెంటనే గృహ యజమాని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం కేజీహెచ్‌కు తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. విద్యుత్ పోల్ ఎక్కిన ఎలక్ట్రీషియన్ విద్యుత్‌శాఖకు సంబంధించిన వ్యక్తి కాదని ఎస్ఈ నాగేశ్వరావు తెలిపారు. అనధికారిగా విద్యుత్ పోల్ ఎక్కితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. విద్యుత్ సమస్యల నివారణ కోసం 1912 ట్రోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. గుర్తు తెలియని యువకుడు.. గజపతినగరం: గజపతినగరం రైల్వే స్టేషన్ యార్డులో గుర్తు తెలియని యువకుడు(23)మృతి చెందాడు. ఈ ఘటనపై విజయనగరం రైల్వే ఎస్సై వి.రవివర్మ మాట్లాడుతూ అనారోగ్యం వల్ల గానీ, వడదెబ్బ వల్ల గాని మృతి చెంది ఉండవచ్చన్నారు. మృతుడి శరీరంపై ఎటువంటి గాయాలు లేవని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి.. బొబ్బిలి: గరుగుబిల్లి మండలం నాగూరుకు చెందిన అక్కేన తవిటినాయుడు(53) ఈనెల 9న తెర్లాం మండలం నందబలగ వెళ్లి వస్తుండగా కారాడ వద్ద కోళ్లవ్యాన్ ఢీకొనడంతో ప్రమాదానికి గురయ్యాడు. ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్టు ఎస్సై చదలవాడ సత్యనారాయణ తెలిపారు. -
మూగబోయిన వాణి
‘తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ’.. ఎంత కమ్మని గొంతు. ఉషోదయం వేళ మనసుని ఉల్లాసంగా తట్టిలేపే మృదు మధురమైన కంఠస్వరం వాణీ జయరామ్ సొంతం.. అలాంటి ఆ కంఠస్వరం మూగబోయింది. ప్రముఖ గాయని వాణీ జయరామ్ (78) కన్నుమూశారు. చెన్నైలోని నుంగంబాక్కమ్లో ఉన్న తన సృగృహంలో అనుమానాస్పద స్థితిలో మరణించారామె. వాణి నుదురు, భుజంపై రక్తపు గాయాలు ఉండడంతో ఆమె మృతిపై అనుమానాలు నెలకొన్నాయి. పోలీసులు ఐపీసీ 174 సెక్షన్ కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఇంటిలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. వాణి మృతదేహానికి ఓమందూరార్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం కేసు విచారణ ముమ్మరం అయ్యే సూచనలున్నాయి. తమిళనాడులోని వెల్లూరులో దురైస్వామి, పద్మావతిలకు 1945 నవంబరు 30న జన్మించారు వాణీ జయరామ్. ఆమె అసలు పేరు కలైవాణి. పదకొండు మంది పిల్లల్లో వాణి ఎనిమిదో సంతానం. ఆమె తల్లి పద్మావతి కర్నూలులో జన్మించడంతో వాణికి తెలుగులో పాడటం అలవాటైంది. రంగరామానుజ అయ్యంగార్ వారి వద్ద పద్మావతి సంగీత శిక్షణ పొందారు. తన కుమార్తె వాణిని కూడా ఆయన వద్దే కర్ణాటక సంగీత శిక్షణ కోసం చేర్పించారామె. వెల్లూరులో వాణి నాలుగో తరగతి పూర్తయ్యాక, ఆమెకు మరింత మంచి సంగీత శిక్షణ ఇప్పించేందుకు వారి కుటుంబం చెన్నైకి తరలి వెళ్లింది. ప్రఖ్యాత సంగీత విద్వాంసులు జీఎన్ బాలసుబ్రహ్మణ్యం శిష్యుడైన టీఆర్ బాలసుబ్రహ్మణ్యం వద్ద సంగీతం నేర్చుకున్నారు వాణి. తన ఎనిమిదవ ఏటనే మద్రాసులో ఆకాశవాణిలో పాడారు. పదేళ్ల నుంచే పూర్తి స్థాయి కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీలు చేశారామె. స్కూలులో 22 వేర్వేరు కళలతో బహుముఖ ప్రజ్ఞ కలిగిన స్టూడెంట్‌గా అవార్డును పొందారు వాణి. బీఏ ఎకనామిక్స్ చదువుతున్న సమయంలో కళాశాలల స్థాయిలో డిబేట్ కార్యక్రమాల్లో బహుమతులు పొందారామె. చదువు పూర్తయ్యాక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెన్నై బ్రాంచిలో ఉద్యోగంలో చేరారు వాణి. 1967లో ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. ఆ తర్వాత 1969లో జయరామ్‌ని వివాహం చేసుకుని, ముంబయ్‌కి వెళ్లారు వాణి. భర్త జయరామ్ ప్రోత్సాహంతో ఉస్తాద్ అబ్దుల్ రెహ్మాన్ ఖాన్ వద్ద హిందుస్తానీ శాస్త్రీయ సంగీత శిక్షణను పొందారామె. ఆ సమయంలోనే బ్యాంకు ఉద్యోగానికి స్వస్తి చెప్పి పూర్తి స్థాయి సంగీత సాధనకు సమయాన్ని వెచ్చించారామె. కర్ణాటిక్, హిందుస్థానీ సంగీతాలను నేర్చుకున్న ఆమె 1969లో ముంబయ్‌లో తొలి కచేరి ఇచ్చారు. సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్‌కి ఆమె గొంతు నచ్చడంతో 1971లో హృషికేశ్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ‘గుడ్డి’ చిత్రంలో తొలిసారి పాట పాడే అవకాశమిచ్చారు. ఆ చిత్రం కోసం వాణీ జయరామ్ పాడిన ‘బోలె రే పపీ హరా..’ పాటకు మంచి స్పందన వచ్చింది. వాణికి ‘తాన్సేన్ సమ్మాన్, బెస్ట్ ప్రామిసింగ్ సింగర్, ఆలిండియా సినీగోయర్స్’ వంటి అవార్డులు దక్కాయి. ఇక ‘అభిమానవంతుడు’ (1973) చిత్రంలో ‘ఎప్పటివలె కాదురా స్వామి’ అనే పాటను వాణీ జయరామ్‌తో పాడించారు దర్శకుడు ఎస్.పి. కోదండపాణి. తెలుగులో ఆమెకు ఇదే తొలి చిత్రం. 1974లో ముంబయ్ నుండి చెన్నైకి వచ్చి స్థిరపడిన ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, భోజ్‌పురి, మరాఠీ, ఒరియా.. ఇలా 14 భాషల్లో పదివేలకుపైగా పాటలు పాడారు. కేవీ మహదేవన్, ఎం.ఎస్. విశ్వనాథన్ , ఇళయరాజా, పెండాల్య, చక్రవర్తి, సాలూరి రాజేశ్వరరావు వంటి సంగీత దర్శకుల సినిమాల్లో ఎక్కువ పాటలు పాడారామె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘అపూర్వ రాగంగళ్’ చిత్రానికి తొలిసారి జాతీయ పురస్కారం అందుకున్నారామె. ఆ తర్వాత ‘శంకరాభరణం’ చిత్రంలోని ‘మానస సంచరరే..’ గీతానికి ఆమెకు రెండోసారి జాతీయ పురస్కారం దక్కింది. ‘స్వాతికిరణం’లోని ‘ఆనతి నీయరా హరా..’ పాటకు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు అందుకున్నారు వాణి. జాతీయ స్థాయిలోనే తెలుగు, గుజరాతీ, ఒడియా, తమిళ భాషల్లో ప్రాంతీయ స్థాయి ఉత్తమ గాయని అవార్డులు పొందారామె. ‘కలైమామణి, సంగీత పీఠ్ సమ్మాన్, ఎంకే త్యాగరాజ భాగవతార్ జీవన సాఫల్య పురస్కారం, ఫిలింఫేర్ జీవన సాఫల్య పురస్కారం, కాముకర అవార్డు, సుబ్రహ్మణ్య భారతి అవార్డు, ఘంటసాల జాతీయ పురస్కారం, దక్షిణ భారత మీరా అవార్డు’ వంటి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు వాణీ జయరామ్. సినిమా పాటలే కాదు.. ఎన్నో భక్తి గీతాలను, లలిత గీతాలను ఆలపించారు వాణి. ‘మొరటోడు’ చిత్రంలోని ‘హే కృష్ణా మళ్లీ నీవే జన్మిస్తే’ పాటతో పాటు ‘ప్రేమలేఖలు’లోని ‘ఈరోజు మంచిరోజు’ అంటూ సుశీలతో కలసి పాడిన పాట తనకెంతో ఇష్టం అని వాణి గతంలో పేర్కొన్నారు. తమకు పిల్లలు లేకున్నా ఆ లోటును సంగీతమే తీర్చిందని చెప్పేవారామె. వాణి భర్త జయరామ్ 2018లో మృతి చెందారు. కాగా సంగీత రంగానికి ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2022కిగాను ఇటీవల ‘పద్మ భూషణ్’ అవార్డు ప్రకటించింది. అయితే ఆ పురస్కారాన్ని స్వీకరించకుండానే వాణి ఈ లోకాన్ని వదిలి వెళ్లడం బాధాకరం. ఆమె మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. నేడు ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. భర్త ప్రోత్సాహంతో... ప్రతి మగాడి విజయం వెనక మహిళ ఉంటుందంటారు. కానీ వాణీ జయరామ్ విజయం వెనక ఆమె భర్త జయరామ్ ఉన్నారు. పెళ్లి తర్వాత కూడా సంగీతంలో ఆమెను ఎంతగానో ప్రోత్సహించారు. ముంబయ్‌లోని ఇండో–బెల్జియం చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా చేసిన జయరామ్ సంగీతప్రియులు. పండిట్ రవిశంకర్ దగ్గర ఆరేళ్లు ఆయన సితార్ నేర్చుకున్నారు. వాణీతో వివాహం తర్వాత తన భార్యలోని సంగీత ప్రావీణ్యతను గుర్తించారు జయరామ్. ఆల్రెడీ కర్ణాటిక్, శాస్త్రియ సంగీతాలను ఔపోసన పట్టిన ఆమెను హిందుస్థానీ సంగీతాన్ని కూడా నేర్చుకోవాలని కోరారు జయరామ్.కేవలం నేర్చుకోమని చెప్పడమే కాకుండా.. ఉస్తాద్ అబ్దుల్ రహమాన్ దగ్గర సంగీత పాఠాలు నేర్పించారు. ఉస్తాద్ అబ్దుల్ రహమాన్ శిష్యరికంలో ఆరు నెలల కఠోర శిక్షణ తర్వాత హిందుస్థానీ సంగీతంలో కూడా వాణి ప్రతిభ చూపారు. 18 గంటల పాటు ఏకధాటిగా శిక్షణ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇక బ్రహ్మాండంగా కచేరీలు చేసుకోవచ్చని వాణీకి భరోసా ఇచ్చారు రహమాన్. ఆత్మవిశ్వాసం, గురువు రహమాన్ ఇచ్చిన భరోసాతో చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి స్వస్తి పలికారు వాణి. 1969లో తొలిసారిగా ముంబయ్‌లో కచేరి ఇచ్చారామె. ఆ తర్వాత సినీ గాయనిగా ఎంతో బిజీ అయ్యారు. సంగీతమే సంతానం... వాణీ జయరామ్ దంపతులకు సంతానం లేరు. సంగీతాన్నే సంతానంలా భావించారు. ‘‘సంగీతంతో సంతానం లేని లోటు తీరిపోయిందనుకుంటాం’’ అని పలు సందర్భాల్లో వాణి పేర్కొన్నారు. కొత్త నాయికలకు ఆ వాణీయే... ఓ కొత్త హీరోయిన్ వెండితెరకు పరిచయం అవుతుందంటే వెంటనే వాణీ జయరామ్‌కు కబురు వెళ్లేది. అలా పలువురు హీరోయిన్లు నటించిన తొలి సినిమాకు పాటలు పాడారు వాణీ జయరామ్. శ్రీదేవి హీరోయిన్గా పరిచయమైన తొలి తమిళ (‘మూండ్రు ముడుచ్చు – ‘ఆడి వెళ్లి’), హిందీ (సోల్వా సావన్ – గోరియా హో గోరియా) చిత్రాల్లో పాటలు పాడారు వాణీ జయరామ్. అలాగే షబానా ఆజ్మీ, జూహీ చావ్లా, పర్విన్ బాబీ, జయబాధురీ హీరోయిన్లుగా పరిచయం అయిన తొలి చిత్రాలకు వాణీ జయరామ్ పాటలు పాడారు. వాణి తెలుగు హిట్ సాంగ్స్ కొన్ని... ► అభిమానవంతులు – ‘ఎప్పటివలె కాదురా నా సామి...’ ► ‘స్వాతి కిరణం’ – తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ, ఆనతినీయరా హరా.., శివానీ భవానీ.. ► ‘శంకరాభరణం’ – దొరకునా ఇటువంటి సేవ.., ఏ తీరుగ నను.., ► పలుకే బంగారమాయెనా.. ► ‘పూజ’ – పూజలు చేయ పూలు తెచ్చాను... ► ‘సీతామాలక్ష్మి’ – ఏ పాట నే పాడను... ► శ్రుతిలయలు – ఆలోకయే శ్రీ బాలకృష్ణమ్... ► ‘తిరుపతి’ – తప్పెట్లోయి తాళాలోయి ► ‘సీతాకోక చిలుక’ – సాగర సంగమమే..., అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి ► ‘స్వర్ణకమలం’ – అందెల రవమిది పదములదా... ► ‘మంగమ్మగారి మనవడు’ – శ్రీ సూర్యనారాయణ మేలుకో... ► ‘గుప్పెడు మనసు’ – నేనా పాడనా పాట.. మీరా అన్నదీ మాట.. ► ‘ఘర్షణ’– ఒక బృందావనం సోయగం... అది దైవ సంకల్పం 1970 నుంచి 1990 వరకూ బిజీ గాయనిగా సాగిన వాణీ జయరామ్ ఆ తర్వాత కాస్త స్లో అయ్యారు. కాగా పలు భాషల సినిమాలకు పాడుతూనే మరోవైపు ఎన్నో భజన పాటలు కూడా పాడారు వాణి. ‘అది పూర్తిగా దైవ సంకల్పం. ఆ దేవుడికి ధన్యవాదాలు. భజనలు పాడినప్పుడు నా మనసెంతో ఆనందంగా ఉంటుంది’ అని పలు సందర్భాల్లో ఆమె పేర్కొన్నారు. హిందీలో తొలి చిత్రం ‘గుడ్డి’కి తొలుత ఆమె పాడినది భజన పాటే. అయితే సినిమా విడుదల తర్వాత చూస్తే సిల్వర్ స్క్రీన్‌పై ఆ పాట వినబడలేదు. అలా ఎందుకు జరిగిందో ఎప్పటికీ అర్థం కాలేదని ఓ సందర్భంలో వాణి పేర్కొన్నారు. ఈ ఒక్క పాటే కాదు.. వాణి పాడిన పాటల్లో తెరపై వినిపించనవి ఎన్నో ఉన్నాయి. ‘ఇలాంటివాటి గురించి తలచుకుంటే బాధ రెట్టింపు అవుతుందే కానీ, తగ్గదు. అందుకే వాటి గురించి ఆలోచించను’ అని ఓ సందర్భంలో వాణి పేర్కొన్నారు. వాణీ జయరామ్ అంత పాజిటివ్ పర్సన్. ప్రముఖుల నివాళి తన మధురమైన గాత్రంతో సినీ సంగీతానికి విశేష సేవలందించి ఎంతోమంది హృదయాలను గెలిచారు వాణీ జయరామ్‌గారు. పాన్ ఇండియా స్థాయిలో బలమైన శాస్త్రీయ పునాదిని నిర్మించారామె. వాణీగారి మృతి భారత సినీ పరిశ్రమకు, సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలి.. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. – వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాణీ జయరామ్‌గారి మృతి బాధాకరం. 14 భాషల్లో 10 వేలకుపైగా పాటలు పాడిన ఆమె సినీ రంగానికి అందించిన సేవలు మరువలేనివి. ఆమె మృతి భారత సినీ పరిశ్రమకు, సంగీత ప్రపంచానికి తీరని లోటు.. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. – కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి ప్రఖ్యాత భారతీయ సినీ సంగీత గాయనీమణిగా ఖ్యాతి సంపాదించుకున్న ‘కలైమామణి’ వాణీ జయరామ్ మరణ వార్త చాలా బాధించింది. ఆమె లేని లోటును భారతీయ సినిమాలో ఎవరూ భర్తీ చేయలేరు. వాణీ జయరామ్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. – ఎంకే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి పదాలకు పదోన్నతి చేకూరేలా ఒక వినూత్నమైన బాణీతో ప్రపంచానికి ఎన్నో పాటలను బహుమతిగా ఇచ్చిన కోకిలలా జీవించిన వాణీ జయరామ్‌గారు ఇప్పుడు ప్రశాంతించారు. ఆవిడ పాటలు మనతోనే ఉంటాయి. – కమల్‌హాసన్ మీరు (వాణీని) నాకు పాడిన తొలి పాటనే మీకు నివాళిగా అర్పిస్తున్నాను. ‘మేఘమే మేఘమే.. పాల్ నిలా తేయందదే. దేగమే తేయినుమ్ తేనొళీ వీసుదే.. ఎనక్కొరు మలర్ మాలై నీ వాంగ వేండుమ్’ (తమిళ చిత్రం ‘పాలవన్న చోలై’లోని పాట.. ఈ చిత్రం తెలుగులో ‘మంచు పల్లకి’గా రీమేక్ అయింది. తెలుగులో ‘మేఘమా..’ పాటని ఎస్. జానకి పాడారు). పాటలో ‘ఎనక్కొరు మలర్ మాలై నీ వాంగ వేండుమ్’ అంటే నాకోసం నువ్వొక పూలదండ కొనాలని అర్థం. ఈ సాహిత్యాన్ని ‘ఉనక్కొరు మలర్ మాలై నాన్ వాంగ వేండుమ్’.. (నీకోసం నేనో పూలదండ కొనాలని అర్థం) అని మార్చి... ‘ఆ పూలదండ దీనికోసమేనా?’ (వాణి మరణాన్ని ఉద్దేశించి) అంటూ ముగించారు. తమిళ ప్రముఖ రచయిత వైరముత్తు. చాలా షాక్‌కి గురి చేసే వార్త ఇది. నమ్మశక్యంగా లేదు. జస్ట్ రెండు రోజుల క్రితమే వాణీ అమ్మతో మాట్లాడాను. నిజమైన లెజెండ్. బలమైన శాస్త్రీయ పునాదితో బహుముఖ ప్రతిభ గల బహు భాషా గాయనిని కోల్పోయాం. – చిత్ర నిన్న (శుక్రవారం) రాత్రే కె. విశ్వనాథ్ సార్ సినిమాల్లో వాణీగారి పాటలు వింటూ, ‘ఎంత అద్భుతంగా పాడారో వినండీ.. అని మా ఆయన (నటుడు శరత్‌కుమార్)తో అన్నాను. ఆ మర్నాడే ఆమె మరణ వార్త విని షాకయ్యాను. – రాధికా శరత్‌కుమార్ ఎంత గొప్ప గాత్రం. చివరిసారిగా ఆమెను కలిసినప్పుడూ ఆ గాత్రంలో అదే స్పష్టత. ‘ఏళు స్వరంగళ్, మల్లిగై, నానే నానా వంటి పాటలతో పాటు నాకు పాడిన ‘మేఘమే మేఘమే’... ఇలా ఆమె పాడిన ఎన్నో పాటలు హృదయాల్లో నిలిచిపోతాయి. – సుహాసినీ మణిరత్నం ► భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రసంశలు పొందారు వాణీ జయరామ్. ఓ కచేరీలో ఇందిరా గాంధీ తన ప్రతిభను ఎంతగానో మెచ్చుకున్నట్లు పలు సందర్భాల్లో వాణి స్వయంగా చెప్పారు. ► హేమమాలిని, వినోద్ ఖన్నా ప్రధాన తారాగణంగా గుల్జార్ దర్శకత్వంలో 1979లో హిందీలో ‘మీరా’ అనే చిత్రం వచ్చింది. ఈ సినిమాలో ఉన్న 13 పాటల్లో 12 పాటలను వాణీ జయరామ్ పాడటం విశేషం. ► గంగామహోత్సవ్, స్వామి హరిదాస్ ఫెస్టివల్, ఛండీఘడ్‌లోని పంచకుల, ఛిత్తోడ్ఘడ్లో మీరా ఫెస్టివల్స్.. ఇలా పలు పండగలకు ఆమె కచేరిలు చేశారు. బద్రినాథ్‌లో రెండుసార్లు పాడారు. -
సైకోనా.. పాత నేరస్తుడా
కోవూరు ప్రజలకు సైకో భయం వీడటం లేదు. అనుమానాస్పదస్థితిలో ఎవరు కనిపించిన సైకో అంటూ హడలెత్తుతున్నారు. అటు వెళ్లాడు.. ఇటు వెళ్లాడంటూ చర్చించుకుంటున్నారు. ఈ సమాచారం పోలీసులకు అందితే పరుగులు పెడుతున్నారు. కాగా పుకార్లను నమ్మవద్దని పోలీసులు చెబుతున్నారు. బుచ్చిరెడ్డిపాళెం: కోవూరులో సైకో కలకలం వీడలేదు. పగలు, రాత్రి తేడా లేకుండా పోలీసులు గాలిస్తున్నా ప్రజల్లో భయం పోలేదు. ఈ నెల 2వ తేదీ తెల్లవారుజామున జలదంకి విజయమ్మ, ఒంటేరు అంకమ్మపై సైకోగా చెబుతున్న వ్యక్తి దాడి చేసి గాయపరిచిన విషయం విదితమే. అదే రోజు మరో ముగ్గురిపై దాడి చేయపోగా ప్రతిఘటించడంతో పారిపోయాడు. ఇదంతా దాడి చేసిన వ్యక్తిని కళ్లారా చూసిన వ్యక్తులు చెబుతున్న విషయమే. అయితే మరుసటిరోజు 3వ తేదీన రామాలయం వద్ద బిచ్చగాడిపై జరిగిన దాడిలో దాడి చేసిన వ్యక్తులను ఎవరూ చూడలేదు. ఆ రోజు నుంచి అనుమానంగా ఎవరు కనపడినా ప్రజలు భయపడుతున్నారు. సైకో వచ్చాడంటూ అంటున్నారు. దీంతో అందరూ ఉలిక్కిపడి కంగారు పడుతున్నారు. తాజాగా సోమవారం రాత్రి పడుగుపాడు రైల్వేట్రాక్ పక్కన గుడిసెల వద్దకు సైకో వచ్చాడంటూ అక్కడి మహిళలు చెబుతున్నారు. బహిర్భూమికి వచ్చాడని అనుకున్నామని, ఒక్కసారిగా కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించగా భయపడి పరుగులు తీశామని అంటున్నారు. యువకులు స్పందించి పట్టుకునేందుకు ప్రయత్నించగా రాళ్లతో దాడి చేశాడని తెలిపారు. అదే సమయంలో వేగూరులో కూడా సైకో వచ్చాడంటూ కలకలం రేగింది. అయితే పోలీసులు మాత్రం అవన్నీ పుకార్లేనని కొట్టిపారేస్తున్నారు. పుకార్లను నమ్మవద్దని చెబుతున్నారు. సైకోనా.. దొంగా.. సైకోగా చెబుతున్న వ్యక్తి పాత నేరస్తుడిగా పోలీసులు పరిగణిస్తున్నారు. ఈ నెల 2వ తేదీన మహిళలపై దాడి చేసింది వాస్తవమేనని, అయితే అతడు పాతనేరస్తుడని అంటున్నారు. గతంలో నెల్లూరు ఇరుగాళమ్మ దేవాలయం వద్ద ఉన్న ఓ వ్యక్తి అక్కడి నుంచి వెంకటేశ్వరపురానికి మకాం మార్చాడు. మద్యం సేవిస్తే చిర్రెత్తి పోయే వ్యక్తి మహిళలపై అత్యాచారానికి ప్రయత్నిస్తాడని సమాచారం. ఈ క్రమంలో 2వ తేదీ మహిళలపై దాడి చేసి గాయపరిచాడని, పోలీసుల దృష్టి పడడంతో పరారీలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు మాత్రం సదరు వ్యక్తిని పట్టుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఏ నిమిషమైనా ఆ వ్యక్తిని పట్టుకునే అవకాశం ఉంది. అయితే ఈలోగా ప్రజల్లో ఉన్న భయాందోళనతో కలకలం రేగుతోంది. త్వరలోనే పట్టుకుంటాం సైకోగా చెబుతున్న వ్యక్తి పాత నేరస్తుడని అతడ్ని పట్టుకుంటామని సీఐ వెంకటేశ్వర్లురెడ్డి చెబుతున్నారు. గాయపడిన మహిళలను ఇటీవల సన్నపనేని రాజకుమారి పరామర్శించిన విషయం విదితమే. గాయపరచిన వ్యక్తిని త్వరలో పట్టుకోవాలని ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణను ఆమె కోరిన విషయం తెలిసిందే. ఎస్పీ రామకృష్ణ ఇప్పటికే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు విస్తృతం చేశారు. ఈ నేపథ్యంలో త్వరలో గాయపరచిన వ్యక్తిని పట్టుకుంటామని సీఐ చెబుతున్నారు. -
పెళ్లి ఇంట విషాదం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ముత్తుకూరు: అంగరంగ వై భవంగా శనివారం వివాహం చేసుకోవాల్సిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితి లో మృత్యువాత పడ్డాడు. కారులో ఇంటి నుంచి బయలుదేరి కొద్ది గంటలకే సముద్రంలో మునిగి చనిపోయాడు. కన్నవాళ్లకు పుట్టెడు శోకాన్ని మిగిల్చాడు. కృష్ణపట్నం పోర్టు పోలీసుల కథనం ప్రకారం..నెల్లూరు హరనాథపురానికి చెందిన చిల్లర వెంకట శివజయంత్ (27) బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం వివాహం చేసుకోవాల్సిన తరుణంలో నెల్లూరుకు వచ్చాడు. గురువారం మధ్యాహ్నం మిత్రులను కలిసి వస్తానని ఇంట్లో చెప్పి ఒంటరిగా కారులో బయలుదేరాడు. కృష్ణపట్నం సముద్రతీరంలో కారుని వదిలి, దక్షణాన పోర్టు వైపు ఒక కిలోమీటరు దూరం నడుచుకుంటూ వెళ్లాడు. శుక్రవారం ఉదయం జయంత్ మృతదేహం తీరానికి కొట్టుకువచ్చింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కృష్ణపట్నం పోలీసులు రంగంలోకి దిగారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. కారును పోలీసు స్టేషన్ వద్ద ఉంచారు. మృతికి గల కారణాలను విచారిస్తున్నారు. -
నేడు హైదరాబాద్‌కు కృష్ణచైతన్య మృతదేహం
హ్యూస్టన్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో అనుమానాస్పద స్థితిలో ఇటీవల మరణించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెంకన్నగారి కృష్ణ చైతన్య మృతదేహం గురువారం హైదరాబాద్ రానుంది. ఈ విషయాన్ని భారత కాన్సులేట్ కార్యాలయ అధికారి వెల్లడించారు. సిద్దిపేటకు చెందిన చైతన్య మూడేళ్ల కింద అమెరికాకు వెళ్లారు. టెక్సాస్‌లోని డాలస్‌లో ఆర్లింగ్టన్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కాగా, చైతన్య మరణానికి గల కారణాలు ఇప్పటికీ తెలియదని, అమెరికాలో ఆయన మృత దేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారని, అయితే రిపోర్టులు ఇంకా రాలేదని డిప్యూటీ కాన్సుల్ జనరల్ సురేంద్ర పేర్కొన్నారు. ‘భారత్‌లోని చైతన్య కుటుంబసభ్యులను ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. చైతన్య మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు కృషి చేస్తున్నాం’అని పేర్కొన్నారు. -
టీడీపీ కౌన్సిలర్ దాడిచేసిన కొద్ది గంటల్లోనే
కాశీబుగ్గ: స్వీటు దుకాణంలో రేగిన తగాదా ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకునే స్థితికి తీసుకెళ్లింది. నలుగురి మధ్య అవమానానికి గురైన అతడు మనస్తాపం చెందాడు. రైలు పట్టాలపై శవమై కనిపించాడు. ఓ తెలుగు దేశం పార్టీ నాయకుడు చేసిన దౌర్జన్య కాం డకు ఈ యువకుడికి అర్ధంతరంగానే నూరే ళ్లు నిండాయి. తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలింది. పలాసలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. బ్రాహ్మణతర్లా గ్రామానికి చెందిన డోకి హరీష్(25) అనే యువకుడు పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని కేటీరోడ్డులో లక్ష్మి స్వీట్ దుకాణంలో పనిచేస్తున్నాడు. పలాస–కాశీ బుగ్గ మున్సిపాలిటీలోని 14వ వార్డు కౌన్సిలర్, తెలుగుదేశం పార్టీ నాయకుడు పైల చక్రధర్ ఈ స్వీటు దు కాణానికి ఆదివారం వచ్చాడు. చేయిపెట్టి ఓ స్వీటు తీసుకొని తిన్నాడు. రెండోసారి చేయిపెట్టి తినడంతో, సార్ ఎంగిలి అవుతుందని షాపులో పనిచేస్తున్న డోకి హరీష్ చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన అతడు హరీష్‌ను బయటకు ఈడ్చుకొచ్చి చితకబాదాడు. దీనిపై బాధితుడు, షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాశీబుగ్గ సీఐ కె.అశోక్‌కుమార్ ఇరువురిని రాజీ చేసి విడిచిపెట్టారు. ఇది పాఠకులకు తెలిసిందే. అయితే బాధిత యువకుడు తగిలిన దెబ్బలను తట్టుకోలేక ఆ రాత్రి ఇం టికి చేరలేదు. ఎక్కడికో వెళ్లి ఉంటాడని కుటుంబ సభ్యులు ఊరుకున్నారు. శవమై కనిపించిన హరీష్ టీడీపీ నాయకుడి చేతిలో దెబ్బలుతిన్న యువకుడు సోమవారం శవమై కనిపించాడు. వజ్రపుకొత్తూరు మం డలం బెండిగేటు సమీపంలో హారీష్ మృతదేహాన్ని జీఆ ర్పీ పోలీసులు గుర్తించారు. ఫొటోలను మృతుడి కు టుంబ సభ్యులకు చూపడంతో తమ కుమారుడేనని వా రు గుర్తించారు. అయితే ఇతడు ఆత్మహత్య చేసుకున్నాడా, లేక ఎవరైనా హత్య చేసి రైలు పట్టాలపై పడేశారా అనేది తెలియలేదు. ఒక పూట పని.. మరో పూట కోచింగ్ డోకి హరీష్ గ్రామంలో అందరితో కలివిడిగా ఉండేవా డు. స్వీటు దుకాణంలో పని చేసుకుంటూనే చదువుకుంటున్నాడు. ఇటీవల బీకాంలో డిగ్రీ పట్టా పొందాడు. బీద కుటుంబం కావడంతో తండ్రి రైలు బండిపై అప్పడాలు అమ్ముతుంటాడు. తల్లి మరణించగా పినతల్లి వద్ద హరీష్ జీవితం కొనసాగిస్తున్నాడు. చెల్లి డోకి పూజ చ దువుతోంది. కుటుంబంపై భారం పడకూడదని స్వీట్ దు కాణంలో పనిచేస్తున్నాడు. ఒక్కపూట పనిచేస్తు మ రోపూట కోచింగ్‌కు వెళ్లేవాడు. షాపు యజమాని కోపగించుకుంటారని భావించి కొనుగోలుదారునితో గొడవపడి తన ప్రాణాలపైకి తీసుకువచ్చాడు. మద్యం మత్తులో ఉన్న కౌన్సిలర్, మరికొందరు దౌర్జన్యంగా యువకుడిని చితకబాదడంతో తాళలేకపోయాడు. మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే హరీష్ మృతిపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పో లీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన హరీష్‌కు న్యా యం జరగకుండా బలవంతంగా రాజీ చేయించారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు న్యాయం చేస్తారని వెళ్లిన మా అన్నయ్యకు న్యాయం జరగలేదని, పోలీసులు మా అన్నయ్యను కాపాడలేకపోయారని, నాయకులతో జతకూడారని, అన్యాయంగా మా అన్నయ్యను చంపేశారని మృతుడి చెల్లి పూజ ఆరోపిస్తోంది. అయితే స్థానిక వైఎస్సార్ సీపీ నాయకుల ఒత్తిడి మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత డోకి హరీష్ మృతితో కాశీబుగ్గ పోలీసు స్టేషన్ వద్ద సోమవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. హరీష్‌పై దాడి చేసిన కౌన్సిలర్ పైలచక్రధర్‌పై ఆది వారం ఫిర్యాదు చేసినప్పుడే అతనిపై కేసు నమోదు చేసి ఉంటే.. హరీష్ చనిపోయి ఉండేవాడు కాదని అతని తండ్రి వెంకటరావు, చెల్లి పూజలు ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్ చనిపోయిన విషయం తెలుసుకున్న బ్రాహ్మణతర్లా గ్రామస్తులు స్టేషన్ వద్దకు సోమవారం రాత్రి భారీగా చేరుకున్నారు. సర్కిల్ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకోవాలని నినా దాలు చేశారు. వీరికి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలాస సమన్వయకర్త సీదిరి అప్పలరాజు, పార్టీ శ్రేణులు కూడా స్టేష న్కు వచ్చి సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.అశోక్‌కుమార్‌తో మాట్లాడారు. కౌన్సిలర్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. హరీష్ తండ్రి వెంకటరావు కూడా కౌన్సిలర్‌పై ఫిర్యాదు చేశాడు. దీంతో దిగివచ్చిన పోలీసులు కౌన్సిలర్ చక్రధర్‌పై కేసు నమోదు చేశారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
గుంటూరు ఈస్ట్: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన స్థానిక కొత్తపేట పరిధిలోని గణేష్ రావు వీధిలో సోమవారం రాత్రి జరిగింది. వివరాల ప్రకారం గుంటూరు రూరల్ మండలం చిన పలకలూరుకు చెందిన తెలగపల్లి ఉమామహేశ్వరరావు, సుజాత దంపతుల రెండో కుమార్తె గీతాంజలి జేకేసీ కళాశాలలో బీఎస్సీ చదివింది. తల్లిదండ్రులు 2017 ఆగస్టులో కొత్తపేట గణేష్ రావు వీధికి చెందిన చదలవాడ సీత కుమారుడు రవికి ఇచ్చి వివాహం చేశారు. రవి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. వివాహం జరిగినప్పటి నుంచి భార్యతో నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పేవాడు. అత్త సుజాత కట్నకానుకలు సరిపోలేదంటూ కోడలిని నిత్యం వేధించేది. నెల కిందట గీతాంజలికి టైఫాయిడ్ రావడంతో తండ్రి పుట్టింటికి తీసుకువెళ్లి చికిత్స చేయించాడు. ఈ నెల 22న అత్తవారింటికి తిరిగి వచ్చింది. ఈ సమయంలో రవి మామతో గొడవపడ్డాడు. సోమవారం రాత్రి రవి డ్యూటీ నుంచి ఇంటికి వచ్చి చూసేసరికి గదిలో తన భార్య ఉరి వేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న కొత్తపేట ఎస్హెచ్ఓ వంశీధర్, క్లూస్ టీమ్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అల్లుడే తమ కుమార్తెను హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. -
వేటకు వెళ్లి విగతజీవిగా...
శ్రీకాకుళం, వంగర: శ్రీహరిపురం గ్రామానికి చెందిన గుడివాడ ఉగాది దొర(36) అనే మత్స్యకారుడు శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. వంగర పోలీసులు అందించిన వివరాలు ప్రకారం... సహచరులు గుడివాడ చిరంజీవి, కారంగి గణేష్‌తో కలిసి ఉగాది దొర ఉదయం ఐదు గంటల సమయంలో మడ్డువలస రిజర్వాయర్‌లో చేపల వేటకు వెళ్లాడు. పెద్ద దేవకివాడ చేపల రేవు సమీపంలో బోట్లు లంగరు వేసిన ప్రాంతంలో వీరు ముగ్గురు విడిపోయి వేర్వేరు దారుల్లో చేపల వేటకు వెళ్లిపోయారు. ఉదయం 6.30 గంటల సమయంలో సహచర మత్స్యకారులు అటువైపు చూసే సరికి ఉగాదిదొర మృతిచెంది ఉన్నట్టు గమనించారు. మృతుడు తలపై స్వల్ప గాయాలు ఉన్నాయి. మృతదేహాన్ని గ్రామానికి తీసుకురాగా భార్య గుడివాడ పాపమ్మతో పాటు కుటుంబ సభ్యులు బోరున రోదించారు. మృతుడుకు భార్య పాపమ్మతో పాటు ఎనిమిదేళ్ల పావని, ఐదేళ్ల జగదీష్ ఉన్నారు. తన భర్తను ఎవరో చంపి ఉంటారని, తల భాగంలో గాయాలున్నాయని భార్య పాపమ్మ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అనుమానాస్పద స్థితి మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ హెచ్.కాంతారావు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించామని చెప్పారు. శోకసంద్రంలో గ్రామం అందరితో కలిసిమెలసి సరదాగా ఉండే ఉగాది దొర మృతిచెందడంతో శ్రీహరిపురం గ్రామంలో శోకసంద్రం నెలకొంది. కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయామని, తమ కుటుంబం వీధిన పడిందని భార్య పాపమ్మ, బంధువులు రోదనలు అందరినీ కన్నీరు తెప్పించాయి. -
మాజీ జడ్జి ప్రభాకర్‌రావు అనుమానాస్పద మృతి
‘బెయిల్ డీల్’ కేసులో నిందితుడు ఆదివారం మారేడుపల్లిలోని ఇంట్లో మృతిచెందిన ప్రభాకర్‌రావు గుండెపోటుతోనే మృతి చెందారని చెబుతున్న కుటుంబ సభ్యులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు హైదరాబాద్: మూడేళ్ల కింద సంచలనం సృష్టించిన ‘బెయిల్ డీల్’ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ జడ్జి డి.ప్రభాకర్‌రావు అనుమానాస్పద స్థితిలో మరణించారు. హైదరాబాద్‌లోని తుకారామ్‌గేట్ ప్రాంతంలో ఉన్న ప్రభాకర్‌రావు నివాసంలో ఆదివారం ఉదయం ఆయన మృతదేహాన్ని గుర్తించారు. దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు... మృతదేహానికి సోమవారం గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ప్రభాకర్‌రావు గుం డెపోటుతో చనిపోయారని తెలుస్తోందని, ఇంట్లో ఎవరూలేని సమయంలో జరగడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని గోపాలపురం ఏసీపీ కె.శివకుమార్ వెల్లడిం చారు. ప్రభాకర్‌రావు గుండెపోటుతోనే మరణించారని, తమకెలాంటి అనుమానాలు లేవని ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. తుకారామ్‌గేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభాకర్‌రావుకు (62) భార్య మార్లిన్ ప్రభాలత, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి కుటుంబం కొంపల్లిలో ఉంటోంది. ప్రభాకర్‌రావు అప్పుడప్పుడు మారేడ్‌పల్లి ప్రాంతంలో ఉన్న తమ మరో ఇంటికి వచ్చి ఉంటుంటారు. ఈ క్రమంలోనే శనివారం మారేడ్‌పల్లిలోని ఇంటికి వచ్చిన ప్రభాకర్‌రావు రాత్రి అక్కడే ఉండిపోయారు. మరుసటిరోజు ఆదివారం ఉదయం చర్చికి వెళదామంటూ ప్రభాకర్‌రావుకు ఆయన కుమారుడు డేవిడ్ ప్రశాంత్ ఫోన్ చేశారు. ఎన్నిసార్లు కాల్ చేసినా స్పందన లేకపోవడంతో... మారేడుపల్లిలోని ఇంటికి వచ్చారు. ఎంతసేపు పిలిచినా ప్రభాకర్‌రావు తలుపు తీయకపోవడంతో.. కిటికీలోంచి చెయ్యిపెట్టి తలుపు బోల్ట్ తొలగించి, లోపలికి వెళ్లారు. పడకగదిలో మంచంపై ఉన్న ప్రభాకర్‌రావును లేపడానికి ప్రయత్నించినా చలనం లేకపోవడంతో.. తల్లికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా (ఐపీసీ సెక్షన్-174 కింద) కేసు నమోదు చేశారు. ప్రభాకర్‌రావు గుండెపోటుతోనే మరణించారని పోస్టుమార్టం చేసిన ఫోరెన్సిక్ వైద్యులు నిర్ధారించారు. ఆయన మృతదేహానికి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1987లో న్యాయమూర్తిగా నియామకమైన ప్రభాకర్‌రావు.. ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాల్లో పలు హోదాల్లో విధులు నిర్వహించారు. ఎన్నికల సంఘం న్యాయసలహాదారుగానూ పనిచేశారు. ‘బెయిల్ డీల్’ కేసుతో వార్తల్లోకి... ఓఎంసీ కేసులో నిందితుడిగా ఉన్న గాలి జనార్దనరెడ్డిని సీబీఐ అధికారులు 2011 సెప్టెంబర్‌లో అరెస్టు చేశారు. 2012 మే 11న అప్పటి సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పట్టాభి రామారావు జనార్దనరెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. అయితే ఈ బెయిల్ మంజూరు వ్యవహారంలో రూ.10 కోట్లు చేతులు మారాయనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలతో... ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. అప్పటి సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి పట్టాభి రామారావు, శ్రీకాకుళం జిల్లా ఫ్యామిలీ కోర్టు జడ్జి ప్రభాకర్‌రావు, మరో న్యాయమూర్తి లక్ష్మీనరసింహారావు, మాజీ న్యాయమూర్తి చలపతిరావు, గాలి జనార్దనరెడ్డి సోదరుడు సోమశేఖర్‌రెడ్డి, కంప్లి ఎమ్మెల్యే సురేష్‌బాబు, హైదరాబాద్‌కు చెందిన రౌడీషీటర్ యాదగిరిరావు తదితరులపై వేర్వేరుగా రెండు కేసులు నమోదు చేసింది. దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్లు కూడా దాఖలు చేసింది. అప్పట్లోనే హైకోర్టు ఈ ముగ్గురు జడ్జీలను విధుల్లోంచి తొలగించింది కూడా. ప్రస్తుతం ఈ కేసులు తుది విచారణ దశలో ఉన్నాయి. అయితే ఈ బెయిల్ డీల్ వ్యవహారంలో ప్రభాకర్‌రావు కీలకపాత్ర పోషించారనే ఆరోపణలున్నాయి. -
దుర్గాభవాని కేసులో మిస్టరీ వీడేనా?
సమగ్ర దర్యాప్తు కోసం క్రీడాకారుల డిమాండ్ విజయవాడ సిటీ : కెరీర్ పీక్ దశలో ఉన్నప్పుడు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పింది. లైంగిక ఆరోపణలు చేసి సంచల నం సృష్టించింది. ఆ తర్వాత పెట్టిన కేసు ఉపసంహరించుకొని ఆరోపణలు ఎదుర్కొంది. ఆఖరికి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది క్రీడా లోకాన్ని దిగ్భ్రమకు గురి చేసింది. కెరీర్ ప్రారంభం మొదలు ఆత్మహత్య వరకు జూపల్లి ఉరఫ్ మద్దినేని దుర్గాభవానీ(30) జీవి తంలో వీడని మిస్టరీలు అనేకం. ఆర్థికంగాను, సామాజికంగాను దిగువ స్థాయికి చెందిన ఆమె మృతి వెనుకున్న మిస్టరీ ఛేదించడం పోలీసులకు సవాల్‌గా చెప్పొచ్చు. ఒత్తిళ్లను అధిగమించి నిష్పక్షపాత దర్యాప్తు చేస్తే తప్ప వాస్తవాలు వెలుగులోకి రావనేది క్రీడాకారుల అభిప్రాయం. తొలిదశలోనే ఆమెను కొందరు ట్రాక్ తప్పించినట్టు చెపుతున్నారు. ఎవరో ప్రయోజనాల కోసం ఆమె తన కెరీర్‌ను ఫణంగా పెట్టిందని, ఈ క్రమంలోనే తనకు కోచ్‌గా వ్యవహరించిన మద్దినేని సత్యప్రసాద్‌ను రెండో వివాహం చేసుకుందని పోలీసు వర్గాల సమాచారం. ఆ తర్వాత ఆమె క్రీడలకు దూరంగా గృహిణి జీవితం గడుపుతోంది. హఠాత్తుగా పైగా ఆమె రాసినట్టుగా చెపుతున్న లేఖపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులా? ఆమె మృతి విషయం తెలిసి వచ్చిన బంధువులు ఇటీవల ఆర్థిక ఇబ్బం దులు పడుతున్నట్టు చెప్పడంపై క్రీడాకారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లైంగిక ఆరోపణల కేసు ఉపసంహరణ వెనుక భారీగా డబ్బులు చేతులు మారాయనేది పలువురు క్రీడాకారుల ఆరోపణ. ఆ తర్వాత జరిగిన పరిణామాలతోనే ఆమె కేసును ఉపసంహరించుకున్నట్టు చెపుతున్నారు. దుర్గాభవానీ గుణదలలోని ఓ అద్దె ఇంట్లో ఉండటంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మృతి విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే ఆర్థిక ఇబ్బందులు అనే కొత్త నాటకానికి తెరలేపారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు నిశితంగా దర్యాప్తు చేస్తే మతలబు కూడా వెలుగులోకి వస్తుందని పలువురు భావిస్తున్నారు. లేఖపై అనుమానాలు పోలీ సులు స్వాధీనం చేసుకున్నట్టుగా చెపుతున్న లేఖపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేఖలో పేర్కొన్న అంశాలు, దస్తూరిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకే లేఖలో తల్లి, భర్తను ఉద్దేశించి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొనడం, భర్తకు పక్కన ‘గారు’ అని పేర్కొనడంపై సందేహాలు నెలకొన్నాయి. ఇదే లేఖలో తాను పూర్తిగా స్పృహలో ఉండి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు పేర్కొంది. వాస్తవానికి ఈ పదాన్ని ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లలోను, న్యాయస్థానాల్లో మాత్రమే ఉపయోగిస్తుంటారు. ఈ రెండింటిపై ఏమాత్రం పరిజ్ఞానం లేని దుర్గాభవానీ ఉపయోగించడం పలువురిని ఆశ్చర్యానికి లోనుచేస్తుంది. లేఖలోని పలు అంశాలు అనుమానాస్పదంగా ఉన్న నేపథ్యంలో ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపుతున్నట్టు మాచవరం ఇన్స్పెక్టర్ కె.ఉమామహేశ్వరరావు సాక్షితో చెప్పారు. ఇదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితంతో పాటు ఇటీవల చోటు చేసుకున్నట్టుగా చెపుతున్న అన్ని అంశాలపైనా సమగ్రంగా విచారణ జరపనున్నట్టు ఆయన పేర్కొన్నారు. -
ఇద్దరు కానిస్టేబుళ్ల అనుమానాస్పద మృతి
కర్నూలు: ఇద్దరు పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన సోమవారం కర్నూలు నగరంలో చోటుచేసుకుంది. స్థానిక కొత్తపేట ఏఆర్ పోలీసు క్వార్టర్స్ పిండి జిన్ను లైన్‌లోని ఓ గది పైఅంతస్తులో ఈ ఘటన జరిగింది. మృతులను ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాదరెడ్డి గన్‌మెన్ మురళీకృష్ణ, క్రిష్ణగిరి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సివిల్ కానిస్టేబుల్ వీరేశ్‌గా గుర్తించారు. మృతదేహాల పక్కన తుపాకీ ఉండటం తో ఒకరినొకరు కాల్చుకుని ఉండొచ్చని, ఒకరిని కాల్చి.. మరొకరు ఆత్మ హత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బాబుప్రసాద్‌తో పాటు పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరిస్తున్నారు. ప్రేమ వ్యవహారంలో ఇద్దరి మధ్య గొడవ జరిగి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
నార్కట్‌పల్లి : అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన నార్కట్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధి గోపులాయపల్లి శివారు గుట్టపై పొదలలో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోపులాయపల్లి గ్రామానికి చెందిన గొర్లకాపరులు గురువారం సాయంత్రం గుట్ట కింద ద్విచక్ర వాహనం గమనించారు. తిరిగి శుక్రవారం ఉదయం గొర్రెలను మేపడానికి తోలుకెళ్తుండగా ఆ వాహనం అక్కడే దారిలో ఉండడం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ మోతీరామ్, ఏఎస్ఐలు లింగారెడ్డి, గౌస్‌తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి గుట్టపై గాలింపు చర్యలు చేపట్టారు. గుట్టపై రాళ్ల మధ్యతో ఓ యువకుడి మృతదేహం కాలిపోయి ఉండడాన్ని గుర్తించారు. గుట్ట కింద ఉన్న వాహనంలో మృతుడి వివరాలు గుర్తించారు.మృతుడు మండలంలోని తొండలవాయి గ్రామ పంచాయతీ పరిధి వెంకటేశ్వరబాయి గ్రామానికి చెందిన వడ్డెపల్లి నరేష్ (25)గా గుర్తించారు. మృతుడి వివరాలను తల్లి మంగమ్మకు తెలియజేయగా తన కుమారుడేనని గుర్తించింది. తన కుమారుడు నల్లగొండలోని ఎస్పీటీ మార్కెట్లో పనిచేస్తున్నాడని,నార్కట్‌పల్లిలోని ఓపెన్ పరీక్షలకు హాజరయ్యేందుకు వెళ్లి రెండు రోజులుగా ఇంటికి రాలేదని వివరించింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మోతీరామ్ తెలిపారు. -
నవవధువు ఆత్మ‘హత్య’?
భర్తే చంపాడని బంధువుల ఫిర్యాదు .సరూర్‌నగర్: అనుమానాస్పద స్థితిలో నవవధువు మృతి చెందింది. ఆత్మహత్య చేసుకుందని భర్త అంటుండగా... అతడే ఉరేసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తూ బంధువులు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. మీర్‌పేట ఎస్ఐ వెంకటయ్య కథనం ప్రకారం... లెనిన్‌నగర్‌లో నివాసం ఉంటూ బండల పని చేసుకుంటున్న వెంకటేష్‌కు షామీర్పేట మండలం లాల్‌గడీ మలక్‌పేటకు చెందిన మంగ (20)ను ఇచ్చి రెండు నెలల క్రితం పెళ్లి చేశారు. వెంకటేష్‌కు ఇది రెండో వివాహం. కొద్ది రోజులుగా కట్నం విషయంలో దంపతుల మధ్య గొడవ జరుగుతోంది. కాగా, మంగళవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో మంగ ఉరేసుకొని మృతి చెంది కనిపించింది. భర్త వెంకటేష్ ఆమెకు ఉరేసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు.పోలీసులు మంగ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆత్మ‘హత్య’?
చెట్టుకు ఉరేసుకొని బాలుడి మృతి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు యాకుత్‌పురా: అనుమానాస్పద స్థితిలో ఓ బాలుడు మృతి చెందాడు. రైల్వే ట్రాక్ పక్కనున్న చెట్టుకు మృతదేహం వేలాడుతూ ఉండటం బట్టి.. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేసి, మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం భవానీనగర్ ఎస్సై శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం... తలాబ్‌కట్టా రజానగర్ ప్రాంతానికి చెందిన మీర్జా మహ్మద్ బేగ్ కుమారుడు మీర్జా అహ్మద్ బేగ్ (14) ఈదిబజార్ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. బుధవారం రాత్రి 7 గంటలకు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన అహ్మద్ బేగ్ అర్ధరాత్రి అయినా తిరిగి రాలేదు. గురువారం ఉదయం మహమ్మద్‌నగర్ రైల్వే ట్రాక్ పక్కనున్న చెట్టుకు అహ్మద్‌బేగ్ ఉరేసుకొని మృతి చెంది ఉండగా స్థానికులు భవానీనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాలుడి మృతదేహాన్ని చెట్టు పై నుంచి కిందికి దించారు. శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. ఒంటిపై ప్యాంట్ తొలగించబడి చొక్కా మాత్రమే ఉంది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వచ్చి బోరుమన్నారు. పోలీసులు మృతదేహానికి ఉస్మానియాలో పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా మీర్జా మహ్మద్ బేగ్‌కు మృతుడు అహ్మద్ బేగ్‌తో పాటు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. బాలుడు ఇంట్లో నుంచి వెళ్లినప్పుడు ఎవరితో గొడవ పడలేదని... ప్రతి రోజు మాదిరిగానే బయటికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం చెట్టుకు వేలాడుతూ ఉండటం, ఒంటిపై గాయాలు లేకపోవడం, ప్యాంట్ తొలగించబడటం వంటి కారణాల నేపథ్యంలో పోలీసులు అహ్మద్ బేగ్‌ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక హత్యా, ఆత్మహత్య అనేది తెలుస్తుందని ఎస్సై శ్రీశైలం తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో గర్భిణి మృతి
కృష్ణారాయుడుపేట(వేపాడ): మండలంలోని కృష్ణారాయుడుపేటలో గొంప సుజాత(22) అనే గర్భిణి శుక్రవా రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తమ కు మార్తె చావుకు వరకట్న వేధింపులే కారణమని మృతురా లి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు అందించిన వివరాలు... విశాఖ జిల్లా దేవరాపల్లి గ్రామానికి చెందిన కర్రి దేముడు కుమార్తె సుజాతకు, కృష్ణారాయుడుపేటకు చెందిన గొంప అప్పలనాయుడు కుమారుడు రమణకు రెండేళ్ల కిందట పెళ్లయ్యింది. వీరికి ఓ బాబు కిరణ్ కూ డా ఉన్నాడు. పెళ్లికి ముందు కట్నంగా రెండు లక్షలు ఇ స్తామని ఒప్పుకున్నామని, అప్పుడు యాభై వేల రూపాయలు, నాలుగు తులాల బంగారం ఇచ్చామని మృతురాలి తండ్రి దేముడు తెలిపారు. మిగిలిన లక్షన్నర రూ పాయల కోసం సుజాతను అత్తింటి వారు తరచూ వేధి స్తూ ఉండేవారని ఆయన తెలిపారు. అది ఇచ్చేశాక ఇటీవల పండగకు వెళ్లినప్పుడు మరో రూ.50వేలు అడుగుతున్నారని అమ్మాయి చెప్పడంతో ఇస్తానని సర్ది చెప్పానని ఆయన పేర్కొన్నారు. కానీ శుక్రవారం సాయంత్రం సు జాత చనిపోయిందని ఫోన్ రావడంతో వెంటనే అక్కడకు వెళ్లామని, అమ్మాయి మెడపై గాట్లు ఉండడం చూ శామని ఆయన రోదిస్తూ తెలిపారు. ఉరి వేసి చంపేసి ఉంటారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వల్లంపూడి ఎస్ఐ కేసు నమోదు చేశారు. డీఎస్పీ కేవీ రత్నం, వేపాడ తహశీల్దార్ పి.ఆదిలక్ష్మి, ఎస్.కోట సీఐ లక్ష్మణమూర్తి, గ్రామ పెద్దల సమక్షంలో శవ పంచనామా నిర్వహించారు. అనంతరం ఇరు వర్గాల వారి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. తర్వాత మృతదేహాన్ని ఎస్.కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సుజాత ఆరు నెలల గర్భిణి అని కుటుంబ సభ్యులు తెలిపారు. ‘ఇది వారి పనే...’ ‘పెళ్లికి నిర్ణయించుకున్న కట్నం పూర్తిగా చెల్లించాం. అదనంగా అడిగిన రూ.50వేలు ఇవ్వలేదన్న కక్షతో భర్త గొంప రమణ, అత్తమామలు అప్పలనాయుడు, గంగమ్మ, ఆడపడుచు కృష్ణమ్మలు కావాలనే వేధింపులకు గురిచేసి చం పేసి ఉంటారు’ అని మృతురాలు సుజాత తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. మరో మూడు నెలల్లో పం డంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన కూతురు చనిపోవడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. గొడవలు లేవు: మృతురాలి భర్త తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని మృతురాలి భర్త గొంప రమణ అన్నారు. తాను మద్యం సేవిస్తానని, ఈ విషయంలో సుజాత అడ్డు చెప్పేదని, తాగవద్దని ఎప్పు డూ చెబుతుండేదని తెలిపారు. తాను శుక్రవారం ట్రాక్టర్ పనికి వెళ్లి గడ్డి లోడ్ చేసుకుని వచ్చానని, ఇంటికి భోజనానికి వెళ్లే సరికి తలుపులు రెండూ దగ్గరకు వేసి ఉన్నాయని చెప్పారు. తలుపులు తీసే సరికి సుజాత ఉరి వేసుకుని కనిపించిందని తెలిపారు. ఇంటిలోని వారంతా ఉ పాధి పనులకు వెళ్లిపోయారని, సుజాత ఇంటిలో ఉందని అన్నారు. -
అనుమానాస్పద స్థితిలో.. ఆటో డ్రైవర్ మృతి
దేవరకద్ర : ఓ ఆటో డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే... కొన్నేళ్లక్రితం నాగర్‌కర్నూల్ మండలం అవురాల్‌పల్లికి చెందిన డకోట శంకర్ (35) బతుకుదెరువు కోసం భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి మహబూబ్‌నగర్ మండలం దొడ్డలోనిపల్లికి వచ్చాడు. అక్కడే ఓ ఆటోను అద్దెకు తీసుకుని నడిపేవాడు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం దేవరకద్రకు సమీపంలోని మీనుగవానిపల్లి పోయే రహదారి పక్కన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కొద్దిసేపటికి అటువైపు వెళ్లిన బాటసారులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో సంఘటన స్థలాన్ని ఎస్ఐ రాజు పరిశీలించారు. శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో కుటుంబ సమస్యలతో కొట్లాడి ఆటోలో ఇక్కడి వచ్చి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడి పంట పొలంలో ఆటో, సమీపంలోనే కల్లుసీసా కనిపించాయి. డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా కొట్టి చంపారా? అనే కోణంలో కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
ఆత్మకూరు రూరల్: జీవితంపై కోటి ఆశలతో అత్తింట అడుగుపెట్టిన ఆ యువతికి ఐదు నెలలకే నూరేళ్లు నిండాయి. తక్కువ ఎత్తులోని కిటికీ గ్రిల్స్‌కు బిగించిన చున్నీకి వేలాడుతూ అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించింది. ఆత్మహత్య చేసుకుందని అత్తింటి వారు చెబుతుండగా భర్తే చంపేశాడని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ ఘటన ఆత్మకూరు మండలంలోని వాశిలిలో గురువారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. మృతురాలి బంధువులు, పోలీసుల కథనం మేరకు..కలిగిరి మండలం పెదపాడుకు చెందిన మద్దినేని వెంకటేశ్వర్లు, విజయమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె లక్ష్మికి(20) ఈ ఏడాది జూన్‌లో వాశిలికి చెందిన సుంకర హనుమంతరావుతో పెంచలకోనలో పెళ్లి చేశారు. అప్పటికే మేనత్త కూతురిని వివాహం చేసుకున్న హనుమంతరావు ఆమెతో విబేధాలు తలెత్తి విడిపోవడంతో లక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు. అయితే అత్తగారింట అడుగుపెట్టినప్పటి నుంచి లక్ష్మికి వేధింపులు మొదలయ్యాయి. హనుమంతరావు తన తల్లిదండ్రులు పెంచలయ్య, సరోజనమ్మతో కలిసి లక్ష్మిని వేధించేవాడు. భార్యతో సఖ్యతగా మెలిగేవాడు కాదు. బంధువుల ఇళ్లకు వెళ్లకుండా ఆంక్షలు పెట్టేవాడు. ఈ విషయాల్ని లక్ష్మి పలుమార్లు తన సోదరి స్వప్నకు ఫోన్లో తెలిపి బోరుమంది. స్వప్న విషయాలను తన తల్లిదండ్రులు దృష్టికి తీసుకెళ్లడంతో అక్కడకు వెళ్లి మాట్లాడదామని సర్దిచెప్పారు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి లక్ష్మికి బాగలేదంటూ హనుమంతరావు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. వారు గురువారం తెల్లవారుజామున ఇంటికి చేరుకునేసరికి లక్ష్మి తక్కువ ఎత్తులో ఉరికివేలాడుతూ నేలకు ఆనుకుని ఉంది. తమ బిడ్డను అన్యాయంగా చంపేశారని కన్నీరుమున్నీరయ్యారు. హనుమంతరావే లక్ష్మిని హతమార్చాడాని స్వప్న బోరుమంది. సమాచారం అందుకున్న ఎస్సై జి.వేణుగోపాల్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తహశీల్దార్ బీకే వెంకటేశ్వర్లు పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హనుమంతరావు పరారవగా అతడి తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
పెళ్లయిన ఏడు నెలలకే..
సైదాపురం: తల్లిదండ్రులను ఒప్పించి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది. భర్తతో కలిసి ఆనందంగా ఉండాల్సిన ఆ యువతి పెళ్లయిన ఏడు నెలలకే కానరాని లోకాలకు వెళ్లిపోయింది. అనుమానాస్పద స్థితిలో మైకా మైన్ నీటిగుంతలో విగతజీవిగా తేలింది. అత్తింటి వారే చంపి గుంతలో పడేశారని మృతురాలి తండ్రి బోరున విలపిస్తున్నారు. ఈ ఘటన సైదాపురం మండలం ఊటుకూరు దళితవాడలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం మేరకు...ఊటుకూరు చెందిన సాతులూరు ధనుంజయ కూలి పనులకెళ్లి జీవనం సాగిస్తున్నాడు. ఆయన కుమార్తె సురేఖ(21) అదే గ్రామానికి చెందిన బోయిన చిరంజీవి ప్రేమించుకున్నారు. చిరంజీవితో పెళ్లి కుటుంబసభ్యులకు ఇష్టం లేకపోయినా సురేఖ తల్లిదండ్రులను ఒప్పించింది. అనంతరం పెద్దల సమక్షంలో ఈ ఏడాది మార్చిలో సైదాపురంలోని సాయిబాబా మందిరంలో పెళ్లి జరిగింది. కొద్దిరోజుల పాటు వీరికాపురం అన్యోన్యంగా సాగింది. కట్నం తేలేదని భర్తతో పాటు నరసయ్య, అత్త వెంకటమ్మ వేధించేవారు. రోజూ ఆమెను చిత్రహింసలు పెట్టేవారు. కట్నం తేకపోతే మరో పెళ్లి చేసుకుంటానని చిరంజీవి బెదిరించే వాడు. ఈ విషయాన్ని ఆమె పలుమార్లు పుట్టింటి దృష్టికి తెచ్చింది. పెళ్లయిన కొత్తలో సమస్యలే సాధారణమేనని, సర్దుకుంటాయని కుమార్తెకు వారు నచ్చజెప్పేవారు. అత్తింట్లో వేధింపులు మాత్రం కొనసాగుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే సోమవారం ఆమె సిద్దలయ్యకోనకు వెళ్లి దైవదర్శనం చేసుకుని సంతోషంగా గడిపివచ్చింది. ఇంటికి చేరుకున్న తర్వాత ఏమైందో ఏమో రాత్రి 8 గంటల సమయంలో కాలనీకి సమీపంలోని మైకామైన్ గుంటలో విగతజీవిగా కనిపించింది. ఇది గుర్తించిన చిరంజీవి కుటుంబసభ్యులు గ్రామంలోనే ఉన్న ఆమె తల్లిదండ్రులకు తెలియజేయకుండా నెల్లూరులో ఉన్న తమ బంధువులకు సమాచారం ఇచ్చారు. తర్వాత విషయం తెలుసుకున్న సురేఖ తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. భర్త, అత్తమామలతో పాటు తోడికోడలు బోయిన మమత కలిసి తమ కుమార్తెను ఇంట్లోనే హత్య చేసి గుంతలో పడేశారని తండ్రి ధనుంజయ ఆరోపించారు. వీఆర్వో దీనదయాల్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు మంగళవారం ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఏఎస్సై సురేంద్రబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సాయంత్రం డీఎస్పీ శ్రీనివాస్, సీఐ మధుసూదన్ రావు గ్రామంలో విచారణ చేపట్టారు. -
అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి
తిరుపతిక్రైం: విద్యార్థిని అనుమానాస్ప ద స్థితిలో మృతి చెందిన సంఘటన తుమ్మలగుంట సమీపంలోని ఓ ప్రైవే టు కళాశాలలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఎంఆర్‌పల్లె సీఐ మద్దయాచారి, ఎస్ఐ ఆదినారాయణ, బాధితుల కథనం మేరకు... కోడూరుకు చెం దిన మల్లిఖార్జునరెడ్డి, భారతిల కుమార్తె రేఖ (16) తుమ్మలగుంట సమీపంలోని ఓ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్స రం చదువుతోంది. అంతకు ముందు ఆమె వేరొక కళాశాలలో చదువుతుండేది. అయితే ఆ కళాశాల రేఖకు నచ్చకపోవడంతో మూడు నెలల క్రితం తుమ్మలగుంటలోని కళాశాలలో ఆమె తల్లిదండ్రులు చేర్చించారు. ఇక్కడ చేర్చినప్పటికీ తాను హాస్టల్లో ఉండనంటూ తల్లిదండ్రులకు తెలిపేది. ఈ నేపథ్యం లో, సోమవారం కళాశాలకు వెళ్లి మల్లిఖార్జునరెడ్డి తన కుమార్తెను కలిశారు. అప్పుడు కూడా రేఖ తాను ఇక్కడ ఉండనంటూ తండ్రితో గొడవ పడింది. తం డ్రి వెళ్లిపోవడంతో పెదనాన్నకు ఫోన్ చేసి తనను తీసుకెళ్లమంటూ ప్రాధేయపడింది. మనస్తాపానికి గురైన రేఖ ఇదేరోజు రాత్రి స్టడీ అవర్స్‌కు వెళ్లకుండా, రూమ్‌లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసుల కథనం. పోస్టుమార్టం నిమిత్తం రేఖ మృతదేహాన్ని రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతురాలి తల్లిదండ్రుల కథనం మరోలా ఉంది. తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నట్టు చెప్పారు. ఉరి తాలూకు గాయాలు మెడపై లేవని పేర్కొన్నారు. న్యాయం చేయాలని కోరుతూ రుయా ఆస్పత్రి మంగళవారం ధర్నా చేశారు. వారిని కోడూరుకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు పరామర్శిం చారు. రేఖ మృతిపై అనుమానాల నేపథ్యంలో ఈ కేసును సీబీసీఐడీకి అప్పగిం చాలని ఆయన డిమాండ్ చేశారు.