సమగ్ర దర్యాప్తు కోసం క్రీడాకారుల డిమాండ్
విజయవాడ సిటీ : కెరీర్ పీక్ దశలో ఉన్నప్పుడు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పింది. లైంగిక ఆరోపణలు చేసి సంచల నం సృష్టించింది. ఆ తర్వాత పెట్టిన కేసు ఉపసంహరించుకొని ఆరోపణలు ఎదుర్కొంది. ఆఖరికి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది క్రీడా లోకాన్ని దిగ్భ్రమకు గురి చేసింది. కెరీర్ ప్రారంభం మొదలు ఆత్మహత్య వరకు జూపల్లి ఉరఫ్ మద్దినేని దుర్గాభవానీ(30) జీవి తంలో వీడని మిస్టరీలు అనేకం. ఆర్థికంగాను, సామాజికంగాను దిగువ స్థాయికి చెందిన ఆమె మృతి వెనుకున్న మిస్టరీ ఛేదించడం పోలీసులకు సవాల్‌గా చెప్పొచ్చు. ఒత్తిళ్లను అధిగమించి నిష్పక్షపాత దర్యాప్తు చేస్తే తప్ప వాస్తవాలు వెలుగులోకి రావనేది క్రీడాకారుల అభిప్రాయం. తొలిదశలోనే ఆమెను కొందరు ట్రాక్ తప్పించినట్టు చెపుతున్నారు. ఎవరో ప్రయోజనాల కోసం ఆమె తన కెరీర్‌ను ఫణంగా పెట్టిందని, ఈ క్రమంలోనే తనకు కోచ్‌గా వ్యవహరించిన మద్దినేని సత్యప్రసాద్‌ను రెండో వివాహం చేసుకుందని పోలీసు వర్గాల సమాచారం. ఆ తర్వాత ఆమె క్రీడలకు దూరంగా గృహిణి జీవితం గడుపుతోంది. హఠాత్తుగా పైగా ఆమె రాసినట్టుగా చెపుతున్న లేఖపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్థిక ఇబ్బందులా?
ఆమె మృతి విషయం తెలిసి వచ్చిన బంధువులు ఇటీవల ఆర్థిక ఇబ్బం దులు పడుతున్నట్టు చెప్పడంపై క్రీడాకారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లైంగిక ఆరోపణల కేసు ఉపసంహరణ వెనుక భారీగా డబ్బులు చేతులు మారాయనేది పలువురు క్రీడాకారుల ఆరోపణ. ఆ తర్వాత జరిగిన పరిణామాలతోనే ఆమె కేసును ఉపసంహరించుకున్నట్టు చెపుతున్నారు. దుర్గాభవానీ గుణదలలోని ఓ అద్దె ఇంట్లో ఉండటంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మృతి విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే ఆర్థిక ఇబ్బందులు అనే కొత్త నాటకానికి తెరలేపారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు నిశితంగా దర్యాప్తు చేస్తే మతలబు కూడా వెలుగులోకి వస్తుందని పలువురు భావిస్తున్నారు.
లేఖపై అనుమానాలు
పోలీ సులు స్వాధీనం చేసుకున్నట్టుగా చెపుతున్న లేఖపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేఖలో పేర్కొన్న అంశాలు, దస్తూరిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకే లేఖలో తల్లి, భర్తను ఉద్దేశించి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొనడం, భర్తకు పక్కన ‘గారు’ అని పేర్కొనడంపై సందేహాలు నెలకొన్నాయి. ఇదే లేఖలో తాను పూర్తిగా స్పృహలో ఉండి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు పేర్కొంది. వాస్తవానికి ఈ పదాన్ని ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లలోను, న్యాయస్థానాల్లో మాత్రమే ఉపయోగిస్తుంటారు. ఈ రెండింటిపై ఏమాత్రం పరిజ్ఞానం లేని దుర్గాభవానీ ఉపయోగించడం పలువురిని ఆశ్చర్యానికి లోనుచేస్తుంది. లేఖలోని పలు అంశాలు అనుమానాస్పదంగా ఉన్న నేపథ్యంలో ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపుతున్నట్టు మాచవరం ఇన్‌స్పెక్టర్ కె.ఉమామహేశ్వరరావు సాక్షితో చెప్పారు. ఇదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితంతో పాటు ఇటీవల చోటు చేసుకున్నట్టుగా చెపుతున్న అన్ని అంశాలపైనా సమగ్రంగా విచారణ జరపనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
దుర్గాభవాని కేసులో మిస్టరీ వీడేనా?
Published Thu, Oct 15 2015 1:31 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM
Advertisement