durgabhavani
-
దుర్గాభవాని కేసులో మిస్టరీ వీడేనా?
సమగ్ర దర్యాప్తు కోసం క్రీడాకారుల డిమాండ్ విజయవాడ సిటీ : కెరీర్ పీక్ దశలో ఉన్నప్పుడు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పింది. లైంగిక ఆరోపణలు చేసి సంచల నం సృష్టించింది. ఆ తర్వాత పెట్టిన కేసు ఉపసంహరించుకొని ఆరోపణలు ఎదుర్కొంది. ఆఖరికి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది క్రీడా లోకాన్ని దిగ్భ్రమకు గురి చేసింది. కెరీర్ ప్రారంభం మొదలు ఆత్మహత్య వరకు జూపల్లి ఉరఫ్ మద్దినేని దుర్గాభవానీ(30) జీవి తంలో వీడని మిస్టరీలు అనేకం. ఆర్థికంగాను, సామాజికంగాను దిగువ స్థాయికి చెందిన ఆమె మృతి వెనుకున్న మిస్టరీ ఛేదించడం పోలీసులకు సవాల్‌గా చెప్పొచ్చు. ఒత్తిళ్లను అధిగమించి నిష్పక్షపాత దర్యాప్తు చేస్తే తప్ప వాస్తవాలు వెలుగులోకి రావనేది క్రీడాకారుల అభిప్రాయం. తొలిదశలోనే ఆమెను కొందరు ట్రాక్ తప్పించినట్టు చెపుతున్నారు. ఎవరో ప్రయోజనాల కోసం ఆమె తన కెరీర్‌ను ఫణంగా పెట్టిందని, ఈ క్రమంలోనే తనకు కోచ్‌గా వ్యవహరించిన మద్దినేని సత్యప్రసాద్‌ను రెండో వివాహం చేసుకుందని పోలీసు వర్గాల సమాచారం. ఆ తర్వాత ఆమె క్రీడలకు దూరంగా గృహిణి జీవితం గడుపుతోంది. హఠాత్తుగా పైగా ఆమె రాసినట్టుగా చెపుతున్న లేఖపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులా? ఆమె మృతి విషయం తెలిసి వచ్చిన బంధువులు ఇటీవల ఆర్థిక ఇబ్బం దులు పడుతున్నట్టు చెప్పడంపై క్రీడాకారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లైంగిక ఆరోపణల కేసు ఉపసంహరణ వెనుక భారీగా డబ్బులు చేతులు మారాయనేది పలువురు క్రీడాకారుల ఆరోపణ. ఆ తర్వాత జరిగిన పరిణామాలతోనే ఆమె కేసును ఉపసంహరించుకున్నట్టు చెపుతున్నారు. దుర్గాభవానీ గుణదలలోని ఓ అద్దె ఇంట్లో ఉండటంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మృతి విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే ఆర్థిక ఇబ్బందులు అనే కొత్త నాటకానికి తెరలేపారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు నిశితంగా దర్యాప్తు చేస్తే మతలబు కూడా వెలుగులోకి వస్తుందని పలువురు భావిస్తున్నారు. లేఖపై అనుమానాలు పోలీ సులు స్వాధీనం చేసుకున్నట్టుగా చెపుతున్న లేఖపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేఖలో పేర్కొన్న అంశాలు, దస్తూరిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకే లేఖలో తల్లి, భర్తను ఉద్దేశించి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొనడం, భర్తకు పక్కన ‘గారు’ అని పేర్కొనడంపై సందేహాలు నెలకొన్నాయి. ఇదే లేఖలో తాను పూర్తిగా స్పృహలో ఉండి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు పేర్కొంది. వాస్తవానికి ఈ పదాన్ని ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లలోను, న్యాయస్థానాల్లో మాత్రమే ఉపయోగిస్తుంటారు. ఈ రెండింటిపై ఏమాత్రం పరిజ్ఞానం లేని దుర్గాభవానీ ఉపయోగించడం పలువురిని ఆశ్చర్యానికి లోనుచేస్తుంది. లేఖలోని పలు అంశాలు అనుమానాస్పదంగా ఉన్న నేపథ్యంలో ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపుతున్నట్టు మాచవరం ఇన్స్పెక్టర్ కె.ఉమామహేశ్వరరావు సాక్షితో చెప్పారు. ఇదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితంతో పాటు ఇటీవల చోటు చేసుకున్నట్టుగా చెపుతున్న అన్ని అంశాలపైనా సమగ్రంగా విచారణ జరపనున్నట్టు ఆయన పేర్కొన్నారు. -
మహిళా క్రికెటర్ ఆత్మహత్య
విజయవాడ: విజయవాడలో ఆదివారం మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్ దుర్గా భవాని ఆత్మహత్యకు పాల్పడింది. సౌత్ జోన్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న దుర్గాభవాని ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, కొద్దిరోజులుగా దుర్గా భవాని, ఆమె భర్త మధ్య గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. గతంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ చాముండేశ్వరినాథ్ తనను లైంగికంగా వేధిస్తున్నారని దుర్గాభవాని ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత దానిని ఉపసంహరించుకున్నారు. దుర్గాభవానికి మూడేళ్ల కూతురు కూడా ఉంది. ఐతే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమికుడి కోసం యువతి చోరీలు
విజయవాడ సిటీ : ప్రేమికుడితో కలిసి జల్సాల కోసం చోరీలను వృత్తిగా ఎంచుకున్న యువతిని సెంట్రల్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఆమె చోరీ చేసి తెచ్చిన సొత్తును విక్రయించిన యువకుడిని కూడా అరెస్టు చేసి రూ.4లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు డీసీపీ(క్రైమ్స్) జి.రామకోటేశ్వరరావు ఈ వివరాలు తెలియజేశారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం.. పాయకాపురం శాంతినగర్‌కు చెందిన నూకల దుర్గాభవాని డిగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపివేసింది. మూడేళ్ల కిందట ఇబ్రహీంపట్నానికి చెందిన నిరుద్యోగి దాసరి కృష్ణంరాజు పరిచయమయ్యాడు. వీరి పరిచయం ప్రేమగా మారింది. కృష్ణంరాజు అవసరాల కోసం దుర్గాభవాని సిటీబస్సుల్లో చోరీలు చేయడం ప్రారంభించింది. తద్వారా వచ్చిన సొమ్ముతో ఇద్దరూ జల్సా చేసేవారు. గత రెండేళ్లుగా నగరంలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో ఆమె 16 చోరీలకు పాల్పడింది. వీటిలో కొందరు బాధితుల ఫిర్యాదు మేరకు ఏడు కేసులు నమోదయ్యాయి. ఇలా చిక్కారు గత కొంత కాలంగా సిటీ బస్సుల్లో జరుగుతున్న చోరీలపై సీసీఎస్ పోలీసులు దృష్టి సారించారు. ఎస్ఐ బి.కృష్ణకుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృం దాన్ని ఏర్పాటు చేసి నిఘా ఉంచారు. మంగళవారం ఈ బృందం గవర్నరుపేటలోని ఓ థియేటర్ వద్ద ఉండగా కృష్ణంరాజు అనుమానాస్పద స్థితిలో తారసపడ్డాడు. చోరీ సొత్తును విక్రయించేందుకు వచ్చిన ఇతనిని పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ జరపగా విషయం వెలుగు చూసిం ది. ఈ మేరకు ఇద్దరినీ అరెస్టు చేసి చోరీసొత్తు స్వాధీ నం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో క్రైం ఏసీపీలు వర్మ, గుణ్ణం రామకృష్ణ, పి.సుందరరాజు, సీసీఎస్ సీఐ కృష్ణంరాజు పాల్గొన్నారు. దోపిడీ దొంగల అరెస్టు సొమ్ము కోసం దోపిడీలు చేస్తున్న నలుగురు యువకులను బుధవారం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు బైక్‌లు, రూ.1,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.అదనపు డిసీపీ(క్రైమ్స్) జి.రామకోటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన గాదె సాయికృష్ణ అలియాస్ పిల్ల సాయి, బండారు సాయి కళ్యాణ్, తాడేపల్లి నవీన్, మర్రి సాయికిరణ్ స్నేహితులు. వీరు మద్యం మత్తులో వంటరిగా వెళ్లే వారిపై దాడులు చేసి మోటారు సైకిళ్లు, నగదు, మొబైల్ ఫోన్లు దోచుకుంటారు. ఈ తరహా నేరాలపై సీసీఎస్ ఇన్స్పెక్టర్ కృష్ణంరాజు నేతృత్వంలో ప్రత్యేక బృందం నిఘా పెట్టి ఈ నలుగురినీ నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. వీరి నుంచి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. కారు దొంగ అరెస్టు ఇంటి ముందు నిలిపి ఉంచిన కారు దొంగిలించిన పాత నేరస్తుణ్ణి బుధవారం సీసీఎస్ పోలీసులు అరె స్టు చేశారు. అదనపు డీసీపీ(క్రైమ్స్) జి.రామకోటేశ్వరరావు కథనం ప్రకారం.. నగరంలోని ఓ మల్టీప్లెక్స్ థియేటర్లో పనిచేసే దారెల్లి అనిల్‌కుమార్ ఈ నెల 12న తన కారును అజిత్‌సింగ్‌నగర్ బాలభవన్ సమీపంలోని తన ఇంటి ముందు నిలిపి ఉంచాడు. మరుసటి రోజు చూసుకుంటే కారు కనిపించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా మంగళగిరి ఎన్ఆర్ఐ కాలేజీ సమీపంలో వదిలేసిన కారును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో లభ్యమైన వేలి ముద్రల ఆధారంగా బుడమేరు మధ్య కట్ట ప్రాంతానికి చెందిన పాత నేరస్తుడైన ముద్రబోయిన ప్రభుకుమార్‌ను అరెస్టు చేశారు. అందులో నుంచి దొంగిలించిన మ్యూజిక్ప్లేయర్ను స్వాధీనం చేసుకున్నారు. జల్సారాయుళ్ల అరెస్టు వ్యసనాలు తీర్చుకునేందుకు అవసరమైన సొమ్ము కోసం చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులు సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలో సభ్యుడైన బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.30వేల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అదనపు డిసీపీ(క్రైమ్స్) జి.రామకోటేశ్వరరావు వెల్లడించిన వివరాల ప్రకారం..అజిత్‌సింగ్‌నగర్ ప్రాంతానికి చెందిన బలిసాని తిరుపతిరావు, వడియార్ గణేష్, మరో 16 ఏళ్ల బాలుడు స్నేహితులు. తిరుపతిరావు చిన్నప్పుడే వ్యసనాలకు బానిసై చోరీలకు అలవాటు పడ్డాడు. స్నేహితులను కలుపుకుని ఇళ్లలో దొంగతనాలు చేస్తున్నాడు. ఈ నెల 17న ప్రసాదంపాడులో ఇదే తరహా చోరీ చేశారు. వరుస చోరీలపై సీసీఎస్ ఎస్ఐ కృష్ణకుమార్ బృందం నిఘా పెట్టగా ఏలూరు లాకుల సమీపంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నేరం అంగీకరించడంతో అరెస్టు చేసి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
భర్త హత్య కేసులో భార్య అరెస్టు
రాజోలు, న్యూస్‌లైన్ : భర్తను హతమార్చిన కేసులో ములికిపల్లి గ్రామానికి చెందిన నిందితురాలు దుర్గాభవానిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం సీఐ పెద్దిరాజు విలేకరులకు వివరాలు వెల్లడించారు. అనుమానంతో వేధిస్తున్న భర్త బత్తుల సత్యనారాయణ(60)ను భార్య దుర్గాభవాని ఈ నెల 25వ తేదీ రాత్రి హతమార్చింది. గ్రామంలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకలు చూసేందుకు వెళ్లిన భార్యాభర్తలు మద్యం తాగి ఇంటికి చేరుకున్నారు. అనంతరం ఇద్దరు గొడవ పడ్డారు. ఈ క్రమంలో దుర్గాభవాని ఇంట్లో బియ్యం డబ్బా పక్కనే ఉన్న కత్తి తీసుకుని భర్తపై విరుచుకుపడింది. తీవ్రంగా గాయపడ్డ భర్త చనిపోయాడనుకుని ఇంటి ఎదురుగా ఉన్న పంట కాలువలో పడేసింది. కాలువలో కొనఊపిరితో ఉన్న భర్తను గమనించి పైకి తీసింది. ఇటుకతో అతడి తలపై బలంగా మోది హతమార్చింది. అతడి మృతదేహాన్ని సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న కడలి డ్రెయిన్‌లో పడేసింది. ఇంట్లో ఉన్న రక్తపు మరకలు, వాకిట్లో ఉన్న రక్తపు మరకలను తొలగించేందుకు పేడతో అలికివేసింది. ఆదివారం రాజోలు బస్టాండ్ ఆవరణలో ఉన్న దుర్గాభవానిని పోలీసులు అరెస్టు చేసి, మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. అమలాపురం డీఎస్పీ వీరారెడ్డి ఆధ్వర్యంలో ట్రైనీ డీఎస్పీ దిలిప్‌కిరణ్, సీఐ పెద్దిరాజు కేసు దర్యాప్తు చేశారు.