అనుమానాస్పద స్థితిలో గర్భిణి మృతి | Pregnant killed in suspicious circumstances | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో గర్భిణి మృతి

Published Sun, Feb 1 2015 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 PM

అనుమానాస్పద స్థితిలో గర్భిణి మృతి

అనుమానాస్పద స్థితిలో గర్భిణి మృతి

 కృష్ణారాయుడుపేట(వేపాడ): మండలంలోని కృష్ణారాయుడుపేటలో గొంప సుజాత(22) అనే గర్భిణి శుక్రవా రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తమ కు మార్తె చావుకు వరకట్న వేధింపులే కారణమని మృతురా లి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు అందించిన వివరాలు... విశాఖ జిల్లా దేవరాపల్లి గ్రామానికి చెందిన కర్రి దేముడు కుమార్తె సుజాతకు, కృష్ణారాయుడుపేటకు చెందిన గొంప అప్పలనాయుడు కుమారుడు రమణకు రెండేళ్ల కిందట పెళ్లయ్యింది. వీరికి ఓ బాబు కిరణ్ కూ డా ఉన్నాడు. పెళ్లికి ముందు కట్నంగా రెండు లక్షలు ఇ స్తామని ఒప్పుకున్నామని, అప్పుడు యాభై వేల రూపాయలు, నాలుగు తులాల బంగారం ఇచ్చామని మృతురాలి తండ్రి దేముడు తెలిపారు.
 
 మిగిలిన లక్షన్నర రూ పాయల కోసం సుజాతను అత్తింటి వారు తరచూ వేధి స్తూ ఉండేవారని ఆయన తెలిపారు. అది ఇచ్చేశాక ఇటీవల పండగకు వెళ్లినప్పుడు మరో రూ.50వేలు అడుగుతున్నారని అమ్మాయి చెప్పడంతో ఇస్తానని సర్ది చెప్పానని ఆయన పేర్కొన్నారు. కానీ శుక్రవారం సాయంత్రం సు జాత చనిపోయిందని ఫోన్ రావడంతో వెంటనే అక్కడకు వెళ్లామని, అమ్మాయి మెడపై గాట్లు ఉండడం చూ శామని ఆయన రోదిస్తూ తెలిపారు. ఉరి వేసి చంపేసి ఉంటారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వల్లంపూడి ఎస్‌ఐ కేసు నమోదు చేశారు. డీఎస్పీ కేవీ రత్నం, వేపాడ తహశీల్దార్ పి.ఆదిలక్ష్మి, ఎస్.కోట సీఐ లక్ష్మణమూర్తి, గ్రామ పెద్దల సమక్షంలో శవ పంచనామా నిర్వహించారు. అనంతరం ఇరు వర్గాల వారి స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు. తర్వాత మృతదేహాన్ని ఎస్.కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సుజాత ఆరు నెలల గర్భిణి అని కుటుంబ సభ్యులు తెలిపారు.  
 
 ‘ఇది వారి పనే...’
 ‘పెళ్లికి నిర్ణయించుకున్న కట్నం పూర్తిగా చెల్లించాం. అదనంగా అడిగిన రూ.50వేలు ఇవ్వలేదన్న కక్షతో భర్త గొంప రమణ, అత్తమామలు అప్పలనాయుడు, గంగమ్మ, ఆడపడుచు కృష్ణమ్మలు కావాలనే వేధింపులకు గురిచేసి చం పేసి ఉంటారు’ అని మృతురాలు సుజాత తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. మరో మూడు నెలల్లో పం డంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన కూతురు చనిపోవడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు.
 
 గొడవలు లేవు: మృతురాలి భర్త
 తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని మృతురాలి భర్త గొంప రమణ అన్నారు. తాను మద్యం సేవిస్తానని, ఈ విషయంలో సుజాత అడ్డు చెప్పేదని, తాగవద్దని ఎప్పు డూ చెబుతుండేదని తెలిపారు. తాను శుక్రవారం ట్రాక్టర్ పనికి వెళ్లి గడ్డి లోడ్ చేసుకుని వచ్చానని, ఇంటికి భోజనానికి వెళ్లే సరికి తలుపులు రెండూ దగ్గరకు వేసి ఉన్నాయని చెప్పారు. తలుపులు తీసే సరికి సుజాత ఉరి వేసుకుని కనిపించిందని తెలిపారు. ఇంటిలోని వారంతా ఉ పాధి పనులకు వెళ్లిపోయారని, సుజాత ఇంటిలో ఉందని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement