Pregnant killed
-
Gachibowli: గచ్చిబౌలిలో దారుణం..
సాక్షి, గచ్చిబౌలి: ఓ నిండు గర్భిణి దారుణ హత్యకు గురైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ గోనె సురేష్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వాసుశెట్టి వెంకట రామకృష్ణ, భార్య స్రవంతి(32)తో కలిసి కొండాపూర్‌లోని జేవీజీహిల్స్ డీఆర్ టవర్స్‌లో నివాసం ఉంటున్నాడు. వీరికి ఒక కుమార్తె కాగా, ప్రస్తుతం స్రవంతి 8 నెలల గర్భవతి. అతడి చిన్నమ్మ కూతురు లక్ష్మీప్రసన్న కూడా సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఆమెకు రెండేళ్ల క్రితం పశ్చిమగోదావరి జిల్లా, పేరుపాలెం గ్రామానికి చెందిన కావూరు శ్రీరామ కృష్ణతో వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజుల నుంచే భార్య ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమెను వేధించేవాడు. దీంతో పెళ్లికి మధ్యవర్తిగా వ్యవహరించిన వెంకట రామకృష్ణ బంధువులతో కలిసి అతడి స్వగ్రామానికి వెళ్లి పంచాయితీ చేశాడు. దీంతో అప్పటి నుంచి వెంకట రామకృష్ణపై శ్రీరామకృష్ణ కోపం పెంచుకున్నాడు. దీనికితోడు అతడి భార్య లక్ష్మీ ప్రసన్న చందానగర్‌కు మకాం మార్చి వేరుగా ఉంటోంది. నెల రోజుల క్రితం తన భర్త వేధింపులకు పాల్పడుతున్నాడని చందానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీరామ కృష్ణను పీఎస్‌కు పిలిపించి నోటీసు ఇచ్చారు. అప్పటి నుంచి బామ్మర్ది వెంకట రామకృష్ణను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న సాయంత్రం ఎర్రగడ్డలో వేట కొడవలి కొనుగోలు చేసి వెంకట రామకృష్ణ ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టడంతో స్రవంతి తలుపు తీసింది. అతను మాట్లాడే విధానం చూసి భయపడిన ఆమె పక్కింటి వారిని పిలిచేందుకు కేకలు వేస్తూ బయటికి వెళ్లగా వెనక నుంచి వచ్చిన శ్రీ రామకృష్ణ వేట కొడవలితో ఆమెపై దాడి చేయడంతో కుప్పకూలింది. స్థానికులు ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందింది. -
ఎనిమిది నెలల గర్భిణిని కాల్చి చంపిన భర్త
న్యూఢిల్లీ: ఓ ఎనిమిది నెలల గర్భిణిని ఎటువంటి కనికరం లేకుండా పట్టపగలే ఆమెను తన నాలుగో భర్త దారుణంగా కాల్చి చంపాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతంలో ఏప్రిల్ 27 ఉదయం 10:30 గంటలకు జరిగింది. నేరం జరిగిన వెంటనే ఆ ప్రదేశానికి పోలీసులు చేరుకున్నారు, కానీ అప్పటికే సైనా చనిపోయింది. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కామెరాలో రికార్డు అయ్యాయి. చనిపోయిన 29 ఏళ్ల మహిళా పేరు సైనా, ఆమె దేశ రాజధానిలో మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తుంది. వివరాలలోకి వెళ్తే.. డ్రగ్ క్వీన్‌గా పేరున్న సైనా అనే మహిళ ఢిల్లీలోని హజ్రాత్ నిజమాముద్దీన్ ప్రాంతంలో నివాసం ఉంటుంది. సైనా సంవత్సరం క్రితం వసీమ్ అనే వ్యక్తిని నాలుగో వివాహం చేసుకుంది. పెళ్లైనా కొద్ది రోజులకే మాదకద్రవ్యాల వ్యవహారంలో పాల్గొన్నందుకు ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ఎనిమిది నెలల గర్భవతిగా ఉండటంతో కొద్ది రోజుల క్రితం బెయిల్‌పై విడుదలైంది. ఆమె మొదటి ఇద్దరు భర్తలు ఆమెను విడిచిపెట్టి బంగ్లాదేశ్ కు వెళ్లారు. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో 'డ్రగ్ లార్డ్' అని పిలువబడే షరాఫత్ షేక్ అనే మాదకద్రవ్యాల వ్యాపారితో ఆమె మూడవ వివాహం చేసుకుంది. షేక్ ఒక గ్యాంగ్ స్టర్, మాదకద్రవ్యాల వ్యాపారి కావడంతో అతన్ని ఎన్పీడీఎస్ చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వసీమ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లైన అయిన కొద్దీ రోజులకు సైనాను అరెస్టు చేయడంతో వసీమ్ ఆమె సోదరి రెహానాతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. సైనా జైలు నుంచి విడుదలైన తర్వాత రెహానాతో ఉన్న అక్రమ సంబంధం బయటపడింది. ఈ విషయంలో తరచుగా సైనాతో వసీమ్ గొడవ పడేవాడు. ఆమె సోదరితో కలిసి ఉండటానికి సైనాను చంపాలని వసీమ్ నిర్ణయించుకున్నాడు. అతను సైనాను హత్య చేయడానికి వేసుకున్న ప్లాన్ లో భాగంగా అతని వెంట రెండు పిస్టల్స్ తెచ్చుకకున్నాడు. సైనా ఇంటికి చేరుకున్న వెంటనే వసీమ్ పలుసార్లు ఆమెపై కాల్చడంతో ఆమె అక్కడే చనిపోయింది. ఆమెను రక్షించడానికి ప్రయత్నించిన సర్వెంట్ పై కూడా కాల్పులు జరిపాడు. ఆమె సర్వెంట్‌ను పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. హత్య తరువాత, వసీమ్ తన వద్ద ఉన్న రెండు పిస్టల్స్‌తో సహ నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసుల ముందు లొంగిపోయాడు. అయితే వసీమ్‌కు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేకపోవడంతో.. ఈ ప్లాన్‌ను సైనా సోదరి రెహానా రూపొందించి ఉంటుందా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సైనా డ్రగ్స్ వ్యాపారంలో కీలక సభ్యురాలు కావడంతో.. ఈ హత్య వెనక ఏమైనా కుట్ర ఉందా అనే యాంగిల్లో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: విషాదం: ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య -
రైల్లో పొగతాగొద్దన్నందుకు గర్భిణీని చంపేశాడు!
షాజహాన్‌పూర్: రైలులో తోటి ప్రయాణికుడు పొగతాగడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఓ గర్భిణీ ప్రాణాలు పోగొట్టుకుంది. పంజాబ్– బిహార్ జలియన్ వాలా ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం రాత్రి ఈ దారుణం జరిగింది. బిహార్‌కు చెందిన చినత్ దేవి(45) అనే గర్భిణీ తన కుటుంబంతో కలిసి ఛత్ పూజల్లో పాల్గొనేందుకు సొంతూరుకు వెళ్తున్నారు. వారితోపాటు జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న సోనూ యాదవ్ పొగతాగుతుండటంతో చినత్ దేవి అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఉన్న సోనూ చినత్ దేవి గొంతు నులిమాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను షాజహాన్పూర్లో రైలు ఆపి ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయింది. నిందితుడిని అరెస్టు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
గర్భిణి హత్య కేసులో అమర్, వికాస్ అరెస్ట్
హైదరాబాద్: గర్భిణి హత్య కేసులో నిందితుడు అమర్‌కాంత్‌ను బిహార్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ కోర్టులో హాజరు పరిచిన అనంతరం ట్రాన్సిస్ట్ వారెంట్ పై ఇక్కడి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మంగళవారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఇదే హత్య కేసులో ప్రధాన నిందితుడు వికాస్‌ను కూడా మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. మాదాపూర్‌లో తలదాచుకున్న వికాస్‌ను ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. గర్భిణి బింగీ అలియాస్ పింకీ హత్యపై వివిధ కోణాల్లో వీరిని విచారిస్తున్నారు. గర్భిణిని హతమార్చిన అనంతరం శరీర భాగాలను కోసేందుకు స్టోన్ కటింగ్ మిషన్‌ను అమర్‌కాంత్ కొనుగోలు చేశాడు. మమత ఝా బాల్కనీలో కాపలా ఉండగా బాత్రూమ్లో అమర్‌కాంత్, వికాస్ మిషన్‌తో గర్భిణి తల, కాళ్లు, చేతులు వేరు చేసి బస్తాల్లో మూట కట్టినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో మమత ఝా, అనిల్ ఝాను రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. వికాస్, అమర్‌కాంత్‌ను గురువారం రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. -
గొడవ చేసి.. గోడకేసి కొట్టి
సాక్షి, హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన 8 నెలల గర్భిణి బింగి హత్య ఆర్థిక పరిస్థితులు.. వివాహేతర సంబంధానికి అడ్డువస్తోందనే కోణంలోనే జరిగిందని సైబరాబాద్ పోలీసులు తేల్చారు. ఈ కేసులో నిందితులు మమతాఝా(37), ఆమె భర్త అనిల్‌ఝా(75), కుమారుడు అమర్‌కాంత్‌ఝా(21)ను అరెస్టు చేశామని, బింగి గర్భానికి కారకుడైన వికాస్ కాశ్యప్(35) పరారీలో ఉన్నాడని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యా వెల్లడించారు. నిందితుల నుంచి ఎలక్ట్రానిక్ కట్టింగ్ మెషీన్, కాషాయ రంగు పైజమా, చున్నీ, స్కా ర్ఫ్, ఫాస్ట్‌ట్రాక్ హ్యాండ్‌బ్యాగ్, ప్లాస్టిక్ హ్యాండ్ గ్లవ్స్, పాలిథీన్ బ్యాగ్, రెండు సెల్ఫోన్లు, ధ్వంసమైన ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో మంగళవారం ఆయన మీడియాకు పూర్తి వివరాలు తెలిపారు. వివాహేతర సంబంధాలే కారణం.. బిహార్‌లోని బాంకా జిల్లా మోహన్ మల్టీ గ్రామానికి చెందిన బింగి అలియాస్ పింకి (32)ది నిరుపేద కుటుంబం. రాజస్తాన్ లోని ఓ ఇటుకల తయారీ పరిశ్రమలో పనిచేసే ఆమె తండ్రి దబ్బోలెయ్యా ఏడాదికోసారి సొంతూరు వచ్చి వెళతాడు. మృతురాలికి తల్లి, ఇద్దరు అక్కాచెల్లెళ్లు, ఒక సోదరుడు ఉన్నాడు. 13 ఏళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని సన్బల్ జిల్లాలోని చాందూసి టౌన్‌కు చెందిన దినేశ్‌ను బింగి వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు దేవ్(10), జతిన్(8), కుమార్తె నందిని(5) ఉన్నారు. వీరి దాంపత్యంలో విబేధాలు తలెత్తాయి. అదే సమయంలో చాందూసికే చెందిన వికాస్‌తో బింగికి వివాహేతర సంబంధం ఏర్పడింది. వికాస్, కుమారుడు జతిన్‌తో కలసి 2017 జనవరిలో బింగి సొంతూరు మోహనమల్టీకి వెళ్లింది. అక్కడ వికాస్‌కు మమతాఝాతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆర్థిక ఇబ్బందులతో మమతా ఝా కుటుంబానికి ఉన్న 3 ఎకరాలు తనఖా పెట్టి.. అప్పులను తీర్చాలని హైదరాబాద్ వచ్చారు. నెలన్నర క్రితం బింగి రాక.. మమతాఝా కుమారుడు అమర్‌కాంత్ అప్పటికే హైదరాబాద్‌లోని దలాల్ స్ట్రీట్ బార్లో వెయిటర్‌గా చేస్తుండటంతో వికాస్‌ను గతేడాది జూన్‌లో అతడితో పంపింది. తర్వాత మమత, అనిల్‌ఝా హైదరాబాద్ వచ్చారు. వారు సిద్ధిఖీనగర్‌లోని ప్లాట్ నంబర్ 895 ఇంట్లో నివాసముంటున్నారు. వికాస్, మమత సిద్ధిఖీనగర్‌లోనే చాట్‌బండార్ నిర్వహిస్తూ రోజుకు రూ.500 నుంచి రూ.1,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో వికాస్ చిరునామా తెలుసుకున్న బింగి నెలన్నర క్రితం కుమారుడు జతిన్‌తో హైదరాబాద్ వచ్చింది. అప్పటి నుంచి వికాస్, మమత మధ్య గొడవలు మొదలయ్యాయి. బింగి 8నెలల గర్భిణి కావడంతో ఆస్పత్రికి తీసుకెళితే ఫీజులు, ఆ తర్వాత శిశువు పుడితే వికాస్ డబ్బులన్నీ ఆమెకే పెట్టాలని భావించిన మమత.. బింగి హత్యకు ప్రణాళిక రచించింది. నిందితులతో మాట్లాడినా ఈ నెల 11న తెల్లవారుజామున సిద్ధిఖీనగర్ లో ఇంటింటికీ వెళ్లి పోలీసులు సోదాలు చేసినా ఆధారాలు లభించలేదు. నిందితులు మమతాఝా, అనిల్ఝాతో పోలీసులు మాట్లాడినా వివరాలు రాబట్టలేక పోయారు. హత్య చేశాక కూడా పదో తేదీ వరకు చాట్‌బండార్ నిర్వహించిన వికాస్ పోలీసు నిఘా ఎక్కువై పారిపోయాడు. ఈ నెల 3నే అమర్‌కాంత్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బిహార్ వెళ్లినట్టు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. కాగా, మోహనా మల్టీ గ్రామానికి వెళ్లిన పోలీసులు బింగి కుటుంబ స్థితి దారుణంగా ఉన్నాయని గుర్తించారు. బింగి ఫొటో కూడా దొరకలేదు. ఆమె తమ్ముడు పింటూ సోదరి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో దహనసంస్కారాలు చేసేందుకు సిద్ధమవుతున్నామని అధికారులు చెబుతున్నారు. జతిన్(8)ను పిల్లల పునరావాస కేంద్రానికి తరలించి.. తండ్రి దినేశ్‌కు సమాచారం అందించారు. గొడవ చేసి.. గోడకేసి కొట్టి జనవరి 27 రాత్రి 12 గంటల ప్రాంతంలో మమత, వికాస్.. బింగితో గొడవపడ్డారు. ఈ క్రమంలో మమత.. బింగి మెడ పట్టుకుని బలంగా గోడవైపు తోసేసింది. దీంతో బింగి కుప్పకూలిపోగా మమత, వికాస్ ఆమె నోరు, కాళ్లు, చేతులు గట్టిగా పట్టుకున్నారు. మిగతా ఇద్దరూ ఆమె శరీరంపై ఇష్టమొచ్చినట్టు పిడిగుద్దులు కురిపించడంతో ఆమె చనిపోయింది. ఆమె మృతదేహాన్ని ఒకరోజు బాత్రూమ్లోనే ఉంచారు. సాక్ష్యాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో మరుసటి రోజు అమర్‌కాంత్ బయటకు వెళ్లి ఎలక్ట్రికల్ కటింగ్ మెషీన్, రెండు గోనె సంచులు తీసుకొచ్చాడు. మెషీన్‌తో బింగి తల, మొండెం, కాళ్లు, చేతులు ముక్కలుగా చేసి ప్లాస్టిక్ పాలిథిన్ కవర్లో చుట్టి రెండు గోనె సంచుల్లో ప్యాక్ చేశారు. అమర్‌కాంత్ తాను పనిచేస్తున్న బార్ ఫ్లోర్ మేనేజర్, ఒడిశా వాసి సిద్ధార్థ బర్దన్ యమహా బైక్(ఏపీ10ఏఎల్9947) తీసుకుని గోనె సంచులను తీసుకెళ్లి బొటానికల్ గార్డెన్ సమీపంలో పడేసి వెళ్లిపోయారు. సీసీ కెమెరా దృశ్యాలే కీలకం.. తొలుత సీసీ కెమెరాలకు చిక్కిన కార్ల యజమానులను ప్రశ్నించిన పోలీసులకు ఎటువంటి సమాచారం లభించలేదు. దీంతో బైక్‌లపై దృష్టిపెట్టగా.. బైక్‌పై నీలిరంగు చొక్కా ధరించి.. ముఖానికి కళ్లద్దాలు పెట్టుకున్న వ్యక్తి, మరో మహిళ వెనక కూర్చున్న దృశ్యాలు కనబడ్డాయి. హైడ్రైన్ కెమెరాల ద్వారా వారి వద్ద బ్యాగులు గుర్తించారు. అయితే నిందితుల ముఖాలు సరిగా లేక విచారణ ఆలస్యమైంది. ఆ బైక్ బౌద్ధనగర్‌కు చెందిన విజయ్‌కుమార్ బాద్రే పేరు మీద ఉందని గుర్తించి విచారించారు. 2009లో ఆ బైక్‌ను విజయ్ శశికుమార్గౌడ్కు విక్రయించగా.. అది పలువురి చేతులు మారి సిద్ధార్థ బర్దన్ చేతికి వచ్చింది. మూడేళ్ల క్రితం ఈ బైక్ కొనుగోలు చేసిన బర్దన్.. హాఫీజ్నగర్లో రాంగ్రూట్లో వస్తుంటే పోలీసులు విధించిన ‘స్పాట్ పేమెంట్ చలాన్’ద్వారా కేసును ఛేదించగలిగారు. -
నిందితులను పట్టించిన ‘చలాన్’
సాక్షి, హైదరాబాద్/హైదరాబాద్: సైబరాబాద్ పోలీసులకు సవాల్‌గా మారిన గర్భిణి దారుణ హత్య కేసులో నిందితులను ‘స్పాట్ పేమెంట్ చలాన్’పట్టించింది. నిందితులు మృతురాలిని ముక్కలుగా చేసి బ్యాగుల్లో పెట్టి బైక్‌పై తరలించడం సీసీ టీవీల ద్వారా బయటపడింది. ఆ బైక్ గురించి పోలీసులు విచారణ జరపడంతో చలాన్ విషయం బయటపడటమే కాకుండా నిందితుల వివరాలూ వెలికి వచ్చాయి. హఫీజ్‌పేటలో రాంగ్ రూట్లో వచ్చిన ఆ బైక్ నడిపిన యజమానికి చలాన్ విధించే సమయంలో నమోదు చేసుకున్న ఫోన్ నంబర్ ఈ కేసును కొలిక్కి తీసుకొచ్చింది. ఆ నంబర్ ద్వారా బైక్ గచ్చిబౌలిలోని ద లాల్‌స్ట్రీట్ పబ్ మేనేజర్, ఒడిశా వాసి సిద్ధార్థ బర్ధన్ది అని పోలీసులు తెలుసుకున్నారు. సిద్ధార్థకు సీసీటీవీ ఫుటేజీలకు చిక్కిన బైక్, నిందితుడి ఫొటోలు చూపించారు. అతను తన పబ్‌లో వెయిటర్ అమర్‌కాంత్ ఝా అని, తన బైక్ తీసుకెళ్లాడని సిద్ధార్థ చెప్పారు. ఝా ఫోన్ నంబర్‌తో పాటు సిద్ధిఖీనగర్‌లోని ఇంటి చిరునామా తెలపడంతో పోలీసులు ఈ కేసులో కీలక పురోగతి సాధించారు. వెంటనే సిద్ధిఖీనగర్‌లో అమర్‌కాంత్ ఝా తల్లిదండ్రులు మమతా ఝా, అనిల్ ఝాలతో పాటు ఆరేళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిద్ధిఖీనగర్‌లోనే హత్య... బిహార్‌కు చెందిన అమర్‌కాంత్ ఝా, అతడి తల్లిదండ్రులు, మరో వ్యక్తి వికాస్‌తో కలసి కొన్ని నెలల నుంచి సిద్ధిఖీనగర్‌లోని ప్లాట్‌నంబర్ 895 యజమాని మాణిక్‌చంద్ ఇంట్లో నివాసముంటున్నారు. అమర్‌కాంత్(28) గచ్చిబౌలిలోని ద లాల్‌స్ట్రీట్ పబ్‌లో వెయిటర్‌గా పని చేస్తుండగా, వికాస్ సిద్ధిఖీనగర్‌లో ఛాట్ బండార్ నిర్వహిస్తున్నాడు. 20 రోజుల క్రితం బిహార్ నుంచి ఓ వృద్ధుడు తాను తీసుకొచ్చిన ఆరేళ్ల బాలుడిని వీరి వద్దనే వదిలేసి వెళ్లాడు. గర్భిణి అయిన మహిళను పిలిపించుకున్న వికాస్ వచ్చిన రోజు రాత్రే హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అనిల్ ఝా, మమతా ఝా, వికాస్‌లు కలసి బాత్రూమ్లో గర్భిణి ని హతమార్చారు. మరుసటి రోజు ఇంటి పక్కనే ఓ వ్యక్తి బోరు వేయడంతో పెద్ద శబ్దం వచ్చిందని, ఆ సమయంలో స్టోన్ కటింగ్ మెషీన్‌తో శరీర భాగాలను ముక్కలు చేసి ఉంటారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ తరువాత యమహా బైక్‌పై అమర్‌కాంత్, అతని తల్లి కలసి మృతదేహాన్ని శ్రీరాంనగర్‌లో పడేసిన సమయంలో సీసీటీవీ కెమెరాలకు చిక్కారు. మూడు రోజుల క్రితం వరకు చాట్‌బండార్ వ్యాపారం చేసిన వికాస్ పోలీసుల నిఘా పెరగడంతో తప్పించుకుపోయాడని స్థానికంగా చర్చించుకుంటున్నారు. పోలీసులకు దొరికిన ఆరేళ్ల బాలుడు తన తల్లి చనిపోయిందని, తండ్రి వికాస్ అని చెబుతుండటంతో చనిపోయింది వికాస్ భార్య అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ కేసును వివాహేతర సంబంధం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మంగళవారం లోపు స్పష్టత వస్తుందని అంటున్నారు. సీసీ కెమెరాలతో విచారణలో పురోగతి సీసీ కెమెరాల ఫుటేజీతో విచారణలో పురోగతి సాధించినట్టు సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య తెలిపారు. ద లాల్‌స్ట్రీట్ పబ్ మేనేజర్ సిద్ధార్థ బర్ధన్ వద్ద వెయిటర్ అమర్‌కాంత్ జనవరి 28న రాత్రి బైక్ తీసుకొని జనవరి 29న తెల్లవారుజామున తిరిగి ఇచ్చినట్టు తెలిసిందన్నారు. అయితే గర్భిణి హత్యలో అమర్‌కాంత్ ప్రమేయం ఉందా, లేదా మృతదేహం తరలింపులో మాత్రమే పాల్గొన్నాడా అన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. నేరం అంగీకరించారు.. చాట్‌బండార్ వ్యాపారం చేస్తూ తమ ఇంట్లోనే ఉండే వికాస్, తన భర్త అనిల్ ఝా, తాను ఆ గర్భిణిని చంపామని మమతా ఝా అంగీకరించినట్టు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే ఈ నేరంతో తన కుమారుడు అమర్‌కాంత్ ఝాకు ఎలాంటి సంబంధం లేదని ఆమె చెబుతోందన్నారు. ఈ నెల మూడున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అమర్‌కాంత్ ఝా బిహార్ వెళ్లినట్టుగా సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించిన సైబరాబాద్ పోలీసులు అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు అమర్‌కాంత్ ఝాను పట్టుకున్న పోలీసులు.. సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులకు సోమవారం అప్పగించినట్టు తెలిసింది. -
గాంధీలో స్వైన్‌ఫ్లూతో గర్భిణి మృతి
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో 7 నెలల గర్భిణి మృతి చెందింది. ఆస్పత్రి వైద్యుల వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వరంకు చెందిన సిరిపురం భవానీ (23) కొద్దిరోజుల క్రితం తీవ్రమైన జ్వరంతో స్థానికంగా ఓ ప్రైవే టు ఆస్పత్రిలో చేరింది. ఏడు నెలల గర్భిణి అయిన భవా నీకి వెంటిలేటర్‌పై వైద్యసేవలు అందించారు. వైద్యపరీక్ష ల అనంతరం ఆమెకు స్వైన్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో రిఫ రల్పై ఈ నెల 26న సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేరింది. డిజాస్టర్‌వార్డులో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. చివరి క్షణాల్లో వెంటిలేటర్‌పై వచ్చిన భవానీని కాపాడేందుకు తీవ్రంగా కృషి చేసినా ఫలితం లేకపోయిందని వైద్యులు వివరించారు. ఈ ఏడాది గాంధీ ఆస్పత్రిలో 165 మంది స్వైన్‌ఫ్లూ రోగులకు వైద్యచికిత్సలు అందించగా..పూర్తిస్థాయిలో వ్యాధి నయమైన 132 మందిని డిశ్చార్జ్ చేశామని, 31 మంది మృతి చెందారని, మరో ఇద్దరు స్వైన్‌ఫ్లూ రోగులకు డిజాస్టర్‌వార్డులో వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. -
కాన్పు కోసం వస్తే కాటికి పంపారు!
వైద్యుల నిర్వాకం - ఆస్పత్రి ఎదుట మృతదేహంతో ధర్నా - ఆస్పత్రిని సీజ్ చేసిన సబ్‌కలెక్టర్ - పాలమూరు జిల్లాలో ఘటన నారాయణపేట: కాన్పు కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చిన గర్భిణి మృత్యువాత పడింది. ఆమె మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి ఎదుట మృత దేహంతో ధర్నా నిర్వహించారు. దాదాపు 9 గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని అప్పిరెడ్డిపల్లికి చెందిన మల్లమ్మ (26)ను కాన్పు కోసం ఈనెల 17న నారాయణ పేటలోని శ్రీ రాఘవేంద్ర ఆస్పత్రిలో చేర్పించారు. రక్తం తక్కువగా ఉందని రక్తం ఎక్కించాలని వైద్యులు రాత్రి ఏడు గంటలకు ఆపరేషన్ థియేటర్లోకి తీసు కెళ్లారు. 8.10 గంటల సమయంలో బాబు జన్మించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే, 4 గంటలైనా మల్లమ్మను ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి తీసుకురాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి డాక్టర్లను నిలదీశారు. దీంతో కొద్దిసేపటి తర్వాత ఆమెను బయటికి తీసుకువచ్చి బెడ్‌పై పడుకోబెట్టారు. మత్తు ఇంజక్షన్ కారణంగా ఆమె స్పృహలో లేదని చెప్పడంతో మిన్నకుండిపోయారు. ఇంతలోనే ఆపరేషన్ చేస్తుండగా రక్తస్రావం జరిగిందని, ఆమె పరిస్థితి బాగా లేదని వెంటనే మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లాలని వైద్యులు ఉచిత సలహా ఇచ్చారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. బాలింతకు పసిరికలు ఉన్నాయని అందుకే రక్తం నిలవడం లేదన్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందన్నారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలిస్తుండగా మల్లమ్మ మార్గమధ్యలోనే కన్ను మూసింది. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు.. మృతదేహాన్ని నేరుగా నారాయణపేట రాఘవేంద్ర ఆస్పత్రికి తీసుకువచ్చి ధర్నాకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మల్లమ్మ మృతి చెందిందంటూ ఆరోపిం చారు. కుటుంబానికి తగిన న్యాయం చేయాలని, నిర్లక్ష్యంగా వైద్యం అందించిన వైద్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మల్లమ్మ మృతిపై సబ్‌కలెక్టర్ కృష్ణాదిత్య, డీఎంహెచ్ఓ శ్రీనివాసులు స్పందించి ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిని సీజ్ చేశారు. -
వైద్యుల నిర్లక్ష్యం వల్ల గర్భిణి మృతి
సంగారెడ్డి: వైద్యుల నిర్లక్ష్యం వల్లే గర్భిణి మృతి చెందిందంటూ ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనలకు దిగారు. పట్టణంలోని శ్రీ సత్య నర్సింగ్ హోంలో చికిత్స కోసం వచ్చిన ఆకారపు స్వప్న అనే గర్భిణి గురువారం మృతిచెందింది. ఆమె మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటు కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. -
అనుమానాస్పద స్థితిలో గర్భిణి మృతి
కృష్ణారాయుడుపేట(వేపాడ): మండలంలోని కృష్ణారాయుడుపేటలో గొంప సుజాత(22) అనే గర్భిణి శుక్రవా రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తమ కు మార్తె చావుకు వరకట్న వేధింపులే కారణమని మృతురా లి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు అందించిన వివరాలు... విశాఖ జిల్లా దేవరాపల్లి గ్రామానికి చెందిన కర్రి దేముడు కుమార్తె సుజాతకు, కృష్ణారాయుడుపేటకు చెందిన గొంప అప్పలనాయుడు కుమారుడు రమణకు రెండేళ్ల కిందట పెళ్లయ్యింది. వీరికి ఓ బాబు కిరణ్ కూ డా ఉన్నాడు. పెళ్లికి ముందు కట్నంగా రెండు లక్షలు ఇ స్తామని ఒప్పుకున్నామని, అప్పుడు యాభై వేల రూపాయలు, నాలుగు తులాల బంగారం ఇచ్చామని మృతురాలి తండ్రి దేముడు తెలిపారు. మిగిలిన లక్షన్నర రూ పాయల కోసం సుజాతను అత్తింటి వారు తరచూ వేధి స్తూ ఉండేవారని ఆయన తెలిపారు. అది ఇచ్చేశాక ఇటీవల పండగకు వెళ్లినప్పుడు మరో రూ.50వేలు అడుగుతున్నారని అమ్మాయి చెప్పడంతో ఇస్తానని సర్ది చెప్పానని ఆయన పేర్కొన్నారు. కానీ శుక్రవారం సాయంత్రం సు జాత చనిపోయిందని ఫోన్ రావడంతో వెంటనే అక్కడకు వెళ్లామని, అమ్మాయి మెడపై గాట్లు ఉండడం చూ శామని ఆయన రోదిస్తూ తెలిపారు. ఉరి వేసి చంపేసి ఉంటారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వల్లంపూడి ఎస్ఐ కేసు నమోదు చేశారు. డీఎస్పీ కేవీ రత్నం, వేపాడ తహశీల్దార్ పి.ఆదిలక్ష్మి, ఎస్.కోట సీఐ లక్ష్మణమూర్తి, గ్రామ పెద్దల సమక్షంలో శవ పంచనామా నిర్వహించారు. అనంతరం ఇరు వర్గాల వారి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. తర్వాత మృతదేహాన్ని ఎస్.కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సుజాత ఆరు నెలల గర్భిణి అని కుటుంబ సభ్యులు తెలిపారు. ‘ఇది వారి పనే...’ ‘పెళ్లికి నిర్ణయించుకున్న కట్నం పూర్తిగా చెల్లించాం. అదనంగా అడిగిన రూ.50వేలు ఇవ్వలేదన్న కక్షతో భర్త గొంప రమణ, అత్తమామలు అప్పలనాయుడు, గంగమ్మ, ఆడపడుచు కృష్ణమ్మలు కావాలనే వేధింపులకు గురిచేసి చం పేసి ఉంటారు’ అని మృతురాలు సుజాత తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. మరో మూడు నెలల్లో పం డంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన కూతురు చనిపోవడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. గొడవలు లేవు: మృతురాలి భర్త తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని మృతురాలి భర్త గొంప రమణ అన్నారు. తాను మద్యం సేవిస్తానని, ఈ విషయంలో సుజాత అడ్డు చెప్పేదని, తాగవద్దని ఎప్పు డూ చెబుతుండేదని తెలిపారు. తాను శుక్రవారం ట్రాక్టర్ పనికి వెళ్లి గడ్డి లోడ్ చేసుకుని వచ్చానని, ఇంటికి భోజనానికి వెళ్లే సరికి తలుపులు రెండూ దగ్గరకు వేసి ఉన్నాయని చెప్పారు. తలుపులు తీసే సరికి సుజాత ఉరి వేసుకుని కనిపించిందని తెలిపారు. ఇంటిలోని వారంతా ఉ పాధి పనులకు వెళ్లిపోయారని, సుజాత ఇంటిలో ఉందని అన్నారు.