న్యూఢిల్లీ: ఓ ఎనిమిది నెలల గర్భిణిని ఎటువంటి కనికరం లేకుండా పట్టపగలే ఆమెను తన నాలుగో భర్త దారుణంగా కాల్చి చంపాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతంలో ఏప్రిల్ 27 ఉదయం 10:30 గంటలకు జరిగింది. నేరం జరిగిన వెంటనే ఆ ప్రదేశానికి పోలీసులు చేరుకున్నారు, కానీ అప్పటికే సైనా చనిపోయింది. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కామెరాలో రికార్డు అయ్యాయి. చనిపోయిన 29 ఏళ్ల మహిళా పేరు సైనా, ఆమె దేశ రాజధానిలో మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తుంది.
వివరాలలోకి వెళ్తే.. డ్రగ్ క్వీన్‌గా పేరున్న సైనా అనే మహిళ ఢిల్లీలోని హజ్రాత్ నిజమాముద్దీన్ ప్రాంతంలో నివాసం ఉంటుంది. సైనా సంవత్సరం క్రితం వసీమ్ అనే వ్యక్తిని నాలుగో వివాహం చేసుకుంది. పెళ్లైనా కొద్ది రోజులకే మాదకద్రవ్యాల వ్యవహారంలో పాల్గొన్నందుకు ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ఎనిమిది నెలల గర్భవతిగా ఉండటంతో కొద్ది రోజుల క్రితం బెయిల్‌పై విడుదలైంది. ఆమె మొదటి ఇద్దరు భర్తలు ఆమెను విడిచిపెట్టి బంగ్లాదేశ్ కు వెళ్లారు. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో 'డ్రగ్ లార్డ్' అని పిలువబడే షరాఫత్ షేక్ అనే మాదకద్రవ్యాల వ్యాపారితో ఆమె మూడవ వివాహం చేసుకుంది. షేక్ ఒక గ్యాంగ్ స్టర్, మాదకద్రవ్యాల వ్యాపారి కావడంతో అతన్ని ఎన్‌పీడీఎస్ చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వసీమ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
పెళ్లైన అయిన కొద్దీ రోజులకు సైనాను అరెస్టు చేయడంతో వసీమ్ ఆమె సోదరి రెహానాతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. సైనా జైలు నుంచి విడుదలైన తర్వాత రెహానాతో ఉన్న అక్రమ సంబంధం బయటపడింది. ఈ విషయంలో తరచుగా సైనాతో వసీమ్ గొడవ పడేవాడు. ఆమె సోదరితో కలిసి ఉండటానికి సైనాను చంపాలని వసీమ్ నిర్ణయించుకున్నాడు. అతను సైనాను హత్య చేయడానికి వేసుకున్న ప్లాన్ లో భాగంగా అతని వెంట రెండు పిస్టల్స్ తెచ్చుకకున్నాడు. సైనా ఇంటికి చేరుకున్న వెంటనే వసీమ్ పలుసార్లు ఆమెపై కాల్చడంతో ఆమె అక్కడే చనిపోయింది. ఆమెను రక్షించడానికి ప్రయత్నించిన సర్వెంట్ పై కూడా కాల్పులు జరిపాడు. ఆమె సర్వెంట్‌ను పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు.
హత్య తరువాత, వసీమ్ తన వద్ద ఉన్న రెండు పిస్టల్స్‌తో సహ నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసుల ముందు లొంగిపోయాడు. అయితే వసీమ్‌కు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేకపోవడంతో.. ఈ ప్లాన్‌ను సైనా సోదరి రెహానా రూపొందించి ఉంటుందా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సైనా డ్రగ్స్ వ్యాపారంలో కీలక సభ్యురాలు కావడంతో.. ఈ హత్య వెనక ఏమైనా కుట్ర ఉందా అనే యాంగిల్‌లో కూడా పోలీసులు విచారణ చేపట్టారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment