గాంధీలో స్వైన్‌ఫ్లూతో గర్భిణి మృతి
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో 7 నెలల గర్భిణి మృతి చెందింది. ఆస్పత్రి వైద్యుల వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వరంకు చెందిన సిరిపురం భవానీ (23) కొద్దిరోజుల క్రితం తీవ్రమైన జ్వరంతో స్థానికంగా ఓ ప్రైవే టు ఆస్పత్రిలో చేరింది. ఏడు నెలల గర్భిణి అయిన భవా నీకి వెంటిలేటర్‌పై వైద్యసేవలు అందించారు. వైద్యపరీక్ష ల అనంతరం ఆమెకు స్వైన్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో రిఫ రల్‌పై ఈ నెల 26న సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేరింది. డిజాస్టర్‌వార్డులో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.
చివరి క్షణాల్లో వెంటిలేటర్‌పై వచ్చిన భవానీని కాపాడేందుకు తీవ్రంగా కృషి చేసినా ఫలితం లేకపోయిందని వైద్యులు వివరించారు. ఈ ఏడాది గాంధీ ఆస్పత్రిలో 165 మంది స్వైన్‌ఫ్లూ రోగులకు వైద్యచికిత్సలు అందించగా..పూర్తిస్థాయిలో వ్యాధి నయమైన 132 మందిని డిశ్చార్జ్ చేశామని, 31 మంది మృతి చెందారని, మరో ఇద్దరు స్వైన్‌ఫ్లూ రోగులకు డిజాస్టర్‌వార్డులో వైద్యసేవలు అందిస్తున్నామన్నారు.