
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం బన్నీని నాంపల్లి కోర్టులో హాజరు పరచనున్నారు. అల్లు అర్జున్‌తో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్ అక్కడికి చేరుకున్నారు.
క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా..
కాగా.. అల్లు అర్జున్ ఇప్పటికే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను క్వాష్ చేయాలంటూ ఆయన తరఫున న్యాయవాదులు పిటిషన్ వేశారు. అంతేకాకుండా సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణను సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేశారు.
అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment