బీఆర్‌ఎస్ ‘ప్రజారోగ్య కమిటీ’ సభ్యుల మండిపాటు
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గాంధీ ఆస్పత్రిలో మాతాశిశు మరణాలు జరిగాయని ఆరోపణ
గాంధీ ఆస్పత్రిలో పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన బీఆర్‌ఎస్ నేతలు
వారిని అడ్డుకున్న పోలీసులు.. ఆందోళనకు దిగిన కార్యకర్తలు
ఎమ్మెల్యేలు సంజయ్, గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే ఆనంద్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్/ గాంధీ ఆస్పత్రి: రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని.. మాతాశిశు మరణాలు, విషజ్వరాలు పెరిగిపోతు న్నాయని బీఆర్‌ఎస్ ‘ప్రజారోగ్య కమిటీ’ మండిప డింది. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదని, ఎమర్జెన్సీ పాలన అని ఆరోపించింది. గాంధీ ఆస్ప త్రిలో పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్తే పోలీ సులు అడ్డుకోవడం దారుణమని మండిపడింది.
గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.. నేతల అరెస్టులు..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితుల అధ్యయనం కోసం బీఆర్‌ఎస్ పార్టీ డాక్టర్ టి.రాజయ్య నేతృత్వంలో.. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌లతో కమిటీని వేసింది. సోమవారం ఉదయం తెలంగాణ భవన్ నుంచి గాంధీ ఆస్పత్రికి వెళ్లి పరిస్థితులను పరిశీలించాలని.. మాతాశిశు మరణాలపై నిజనిర్ధారణ చేయాలని ఈ కమిటీ నిర్ణయించింది. అయితే కమి టీకి నేతృత్వం వహిస్తున్న టి.రాజయ్యను పోలీ సులు ఉదయమే ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో గృహ నిర్బంధం చేశారు. మిగతా ఇద్దరు సభ్యులు డాక్టర్ సంజయ్, డాక్టర్ మెతుకు ఆనంద్ పోలీసుల కళ్లు గప్పి తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.
అక్కడి నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మరికొందరు పార్టీ నేతలతో కలసి గాంధీ ఆస్పత్రికి వెళ్లారు. పోలీసులు వారిని ఆస్పత్రి ప్రధాన గేటు వద్దే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేత లు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరగ డంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు మాగంటి గోపీనాథ్, సంజయ్, మెతుకు ఆనంద్ లను అరెస్టు చేసి నారాయణగూడ ఠాణాకు.. ఇతర నేతలు, కార్యకర్తలను ఈడ్చుకెళ్లి వ్యాన్లలోకి ఎక్కించి బొల్లారం ఠాణాకు తరలించారు. మధ్యాహ్నం తర్వాత నేతలు, కార్యకర్తలను వదిలేశారు.
రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి
గాంధీ ఆస్పత్రి ఘటన తర్వాత తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ప్రజారోగ్య కమిటీ సభ్యులు రాజయ్య, సంజయ్, మెతుకు ఆనంద్ మీడియాతో మాట్లా డారు. సీఎం, మంత్రుల సమీక్ష లేకపోవడంతో.. రాష్ట్రంలో ప్రజారోగ్యం కుంటుపడిందని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు తగ్గిపోయాయని రాజయ్య ఆరోపించారు. నిజనిర్ధారణ కోసం గాంధీ ఆస్పత్రికి వెళ్లిన కమిటీ సభ్యులను పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు.
రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్నా ప్రభుత్వం నిద్రపోతోందని డాక్టర్ సంజ య్ విమర్శించారు. ఆస్పత్రుల్లో డొల్లతనం బయట పడుతుందనే తమకు అడ్డుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని డాక్టర్ మెతుకు ఆనంద్ మండిపడ్డారు. నిపుణులైన వైద్యులు లేకే, ఆస్పత్రుల్లో మరణాలు సంభవి స్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
మాతాశిశు మరణాలపై దాపరికం ఎందుకు?
ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్న మాతాశిశు మరణాలపై సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దాపరికంగా వ్యవహరి స్తోందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోపించారు. గాంధీ ఆస్పత్రి బయట ఆయన మీడియాతో మాట్లాడారు. తాము నిర్మాణాత్మక అంశాలపైనే పోరాడుతు న్నామని, ప్రతిపక్షంగా ఇది తమ బాధ్యత అని చెప్పారు. సీఎం కార్యాలయం నుంచి వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు సరైన సహ కారం లేదని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment