దేవరకద్ర : ఓ ఆటో డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే... కొన్నేళ్లక్రితం నాగర్‌కర్నూల్ మండలం అవురాల్‌పల్లికి చెందిన డకోట శంకర్ (35) బతుకుదెరువు కోసం భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి మహబూబ్‌నగర్ మండలం దొడ్డలోనిపల్లికి వచ్చాడు. అక్కడే ఓ ఆటోను అద్దెకు తీసుకుని నడిపేవాడు.
ఈ క్రమంలోనే శనివారం ఉదయం దేవరకద్రకు సమీపంలోని మీనుగవానిపల్లి పోయే రహదారి పక్కన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కొద్దిసేపటికి అటువైపు వెళ్లిన బాటసారులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ రాజు పరిశీలించారు.
శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో కుటుంబ సమస్యలతో కొట్లాడి ఆటోలో ఇక్కడి వచ్చి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడి పంట పొలంలో ఆటో, సమీపంలోనే కల్లుసీసా కనిపించాయి. డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా కొట్టి చంపారా? అనే కోణంలో కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
అనుమానాస్పద స్థితిలో.. ఆటో డ్రైవర్ మృతి
Published Sun, Nov 30 2014 4:31 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM
Advertisement
Advertisement