మధ్యప్రదేశ్‌లో పెరిగిన పులుల సంఖ్య
భోపాల్: మధ్యప్రదేశ్‌లో పులుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 397 పులులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ తాజా గణాంకాలు చెబుతున్నాయి. 2014 గణాంకాలతో పోల్చితే 89 పెద్ద పులులు పెరిగాయని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. వాస్తవానికి 2011లోనే మధ్యప్రదేశ్ ‘టైగర్ స్టేట్’ హోదాను కోల్పోయింది. తాజా గణాంకాల నేపథ్యంలో ఈసారి జాతీయ స్థాయిలో చేపట్టే పులుల లెక్కింపులో మధ్యప్రదేశ్ తిరిగి టైగర్ స్టేట్ హోదాను కైవసం చేసుకుంటుందని రాష్ట్ర అటవీశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.