హైదరాబాద్: ఈ మృగరాజు పేరు నవాబ్ షఫత్ అలీఖాన్. మన హైదరాబాదీయే. దేశంలోనే పేరెన్నికగన్న లెసైన్డ్స్ వేటగాడు. జనావాసాల్లోకి చొరబడి మనుషుల్ని చంపే పెద్దపులులను మట్టుబెట్టడం ఈయన ప్రత్యేకత. ఇలా దేశంలో పలు రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఇప్పటిదాకా తొమ్మిది పులులను హతమార్చాడు. ప్రస్తుతం ఊటీలో ఓ పులి పని పట్టేందుకు వెళ్లాడు.
ఇంతలోనే ఉత్తరప్రదేశ్ నుంచి పిలుపు వచ్చింది. మురాదాబాద్, సంభాల్ జిల్లాల్లో సంచరిస్తున్న ఓ పులి నెలరోజుల్లోనే ఆరుగురిని దారుణంగా చంపింది. దీంతో యూపీ సర్కారు ఈయనను సంప్రదించింది. ఊటీ పులి సంగతి చూసి ఉత్తరప్రదేశ్ వెళ్తానని చెబుతున్నాడు అలీఖాన్!