మనుషుల్లోనూ పులి చారలు!
మెడి క్షనరీ
పులుల్లోనే ఒంటినిండా చారలుంటాయని అనుకుంటున్నారా? చాలామంది మనుషుల చర్మం కింద కూడా పులిచారల్లాంటివే ఉంటాయి. ఈ లైన్స్ అన్నీ జీబ్రాల్లాగే ప్రతి మనిషిలోనూ వేర్వేరుగా ఉంటాయట. జర్మన్ డర్మటాలజిస్ట్ అల్ఫ్రెడ్ బ్లాష్కో అనే చర్మవ్యాధి నిపుణుడి పేరిట ఈ చారలను ‘బ్లాష్కోస్ లైన్స్’ (Blaschko's lines) అని అంటారు. కొందరిలో చర్మ వ్యాధి సోకినప్పుడు ఈ చారలు కనిపించేవి. ఇప్పుడు వీటి రహస్యం తెలిసింది.
పిండదశలోని ఒకే ఒక కణం నుంచి అనేక కణాలుగా విభజితమయ్యేప్పుడు వాటిలోని కొన్ని కండరాలుగా, మరి కొన్ని ఎముకలుగా ఇంకొన్ని చర్మంగా రూపొందే సమయంలో ఇంగ్లిష్ అక్షరాల్లోని ‘వి’, ‘ఎస్’ లాంటి రకరకాల పాట్రన్స్‌లో ఇలా పులి చారల్లా ఏర్పడతాయని గుర్తించారు.