జూ జీన్స్..
పులులు.. ఎలుగుబంట్లు.. జీన్స్ ప్యాంట్లను చింపేస్తున్నాయేంటి అనుకుంటున్నారా.. అది చింపటం కాదు.. జీన్స్‌ను డిజైన్ చేయడం. దీని పేరే ‘జూ జీన్స్’. అర్థం కాలేదా.. అయితే మనం జపాన్‌లోని హిటాచీ నగరంలోని కమినే జూకు వెళ్లాల్సిందే. ఇక్కడే ఈ జూ జీన్స్‌ను జంతువులు డిజైన్ చేస్తాయి. ఇప్పుడు జపాన్‌లో జూ జీన్స్ ఓ కొత్త ట్రెండ్. ఇంతకీ జూ జీన్స్ అంటే ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా.. సాధారణంగా జీన్స్ అంటే డిజైనర్ల సృష్టి. కానీ ఈ జూ జిన్స్‌కు జంతువులే డిజైనర్లు. పులులు, సింహాలు, ఎలుగుబంట్లు.. ఈ జీన్స్‌ను డిజైన్ చేస్తాయి. అదెలా అనుకుంటున్నారా సింపుల్.. కొంత డెనీమ్ క్లాత్‌ను తీసుకుని వాటిని జూలో జంతువుల మందు పడేస్తారు. అవి వాటిని తమ పళ్లు, గోర్లతో ఇష్టానుసారం చింపేస్తాయి. అలా చింపిన క్లాత్‌ను తీసుకుని జీన్స్ ఫ్యాంట్లను డిజైన్ చేస్తారన్నమాట. ఇంతకీ ఈ జీన్స్ ఖరీదు ఎంతనుకుంటున్నారు జస్ట్ 1,200 డాలర్లే. అంటే మన కరెన్సీలో రూ.72 వేలు.