కర్నూరు జిల్లా వెలుగోడు శివారులో శనివారం కలకలం రేగింది.
సాక్షి, కర్నూలు: కర్నూరు జిల్లా వెలుగోడు శివారులో శనివారం కలకలం రేగింది. వెలుగోడు శివారు గ్రామాల్లో పులులు సంచరిస్తున్నాయని గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమీప అడవుల్లో చిరుత పులులను చూసిన కొందరు గ్రామస్తులకు తెలిపారు.
దీంతో గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పులుల కోసం రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టిన అధికారులు రెండు పులులను పట్టుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా మరో పులి కోసం అధికారులు గాలిస్తున్నట్టు తెలుస్తోంది.