కొన్ని సంఘటనలు చూస్తే చావు అనేది నిజానికి ముందే రాసిపెట్టి ఉంటుందేమో అని అనిపిస్తుంటుంది. ఒక్కోసారి పెద్ద కారణం లేకుండానే ప్రాణాలు పోవడం మరోసారి ఎంత పెద్ద ప్రమాదం జరిగినా ప్రాణాలు నిలవడంవంటి సంఘటనలు ఈ అనుమానాలకు కారణాలుగా ఉంటాయి. సాధారణంగా పులి ఎదురుపడిందంటేనే ఇక ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవచ్చు. ఒక వేళ కారులాంటి వాహనాల్లో ఉంటే సురక్షితంగా ఉండొచ్చేమోగానీ, ఖర్మకు నడిచి వెళుతున్న సమయంలో బైక్‌పై వెళ్లే సమయంలో ఎదురైతే ఇక అంతే మరి. కానీ, మహారాష్ట్రలో ఓ ఇద్దరు వ్యక్తులు పులులకు ఎదురై ప్రాణాలతో బయటపడ్డారు. ఎదురవడమంటే అదేదో దూరంగా కాదు.. ఆ పులులు గుడిచుట్టూ ప్రదక్షిణ చేసినట్లుగా వారి చుట్టూ తిరిగాయి కూడా.