
అస్థిపంజరం ఆధారంగా ఒడిశా పోలీసులు గీసిన మహిళ ఊహా చిత్రం
భువనేశ్వర్: కొన్నాళ్ల క్రితం నగర శివారులోని జాలాం పోలీస్ ఔట్‌పోస్ట్ వద్ద ఆగిఉన్న వాహనంలో ఓ మనిషి అస్థిపంజరాన్ని పోలీసులు గుర్తించారు. ఇప్పుడు ఆ అస్థిపంజరం ఎవరిదై ఉంటుందనే కోణంలో పోలీసులు ఓ ఊహాచిత్రం గీయించి, రాష్ట్రంలోని పలు పోలీస్‌స్టేషన్లకు శుక్రవారం దాని కాపీలను పంపారు. బెంగళూర్‌కి చెందిన కొంతమంది నిపుణులు ఈ అస్థిపంజరం ఆనవాళ్లతో ఈ ఊహాచిత్రం గీయగా ఆ అస్థిపంజరం ఓ మహిళదిగా తేలింది. అయితే స్థానిక ఎయిమ్స్(అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ) వైద్యుల సమాచారం మేరకు అస్థిపంజరం మహిళదని, 45 ఏళ్ల వయసున్న ఆమె ఎత్తు 164 సెంటీమీటర్లు ఉంటుందని తెలిసింది. అలాగే మృతురాలు క్షయ వ్యాధితో బాధపడుతున్నట్లు కూడా నిర్ధారించారు.
గంజాయి అక్రమ రవాణాకి సంబంధించి, 2019 నవంబరులో ఆ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అందులోని అస్థిపంజరాన్ని గుర్తించినట్లు నగర డీసీపీ ఉమాశంకర దాస్ తెలిపారు. ఇదిలా ఉండగా, అప్పట్లో వాహనంలోని అస్థిపంజరాన్ని గుర్తించడంలో అలక్ష్యం వహించిన ఔట్‌పోస్ట్ ఇన్‌చార్జి సత్యబ్రత గ్రహచార్య సస్పెన్షన్‌కు గురైన విషయం విదితమే.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment