mystery death
-
జమ్ము మిస్టరీ మరణాలపై కేంద్రం ప్రకటన
మిస్టరీగా మారిన జమ్ము కశ్మీర్ వరుస మరణాల(Mysterious Deaths)పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. అంతుచిక్కని అంటువ్యాధితో మరణిస్తున్నారనే వాదనను కేంద్రం తోసిపుచ్చింది. అయితే విషపూరిత పదార్థాల వల్లే వరుస మరణాలు సంభవించాయని, ఈ వ్యవహారంపై కుట్ర కోణం సహా అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని గురువారం ప్రకటించింది.రాజౌరీ(Rajouri) జిల్లాలోని ఓ గ్రామంలో నెలవ్యవధిలో 17 మంది వరుసగా ఒకే తరహా లక్షణాలతో జబ్బుపడి మరీ చనిపోయారు. చనిపోయిన వాళ్లలో చిన్నపిల్లలే(13) ఎక్కువగా ఉన్నారు. వాళ్ల మరణాలకు విషపూరిత పదార్థాలే కారణమని కేంద్రం నిర్ధారించింది. అయితే ఆ టాక్సిన్ ఏంటన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర సైన్స్&టెక్నాలజీ మంత్రి(స్వతంత్ర) డాక్టర్ జితేంద్ర సింగ్ గురువారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు.‘‘లక్నోలోని సీఎస్ఐఆర్(CSIR) ల్యాబ్ నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో.. ఇది వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షనో కాదని తేలింది. మృతదేహాల నుంచి సేకరించిన నమునాల్లో విషపదార్థాలు ఉన్నట్లు తేలింది. అయితే ఆ విషపదార్థాలు ఏంటన్న దానిని నిర్ధారించుకునే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు. వారం, పదిరోజుల్లో దీనిపై స్పష్టమైన ప్రకటన రానుంది’’ అని ఆయన తెలిపారు. ఇక అన్నికోణాల్లో ఈ అంశంపై దర్యాప్తు జరుగుతోంది. ఇందులో ఏదైనాకుట్ర ఉందని తేలితే.. బాధ్యులెవరైనా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. ఐటీఆర్ (టాక్సికాలజీ రీసెర్చ్) నిర్వహించిన విశ్లేషణలోనూ ఇంతకు ముందు విషపూరిత పదార్థాలు ఉన్నట్లు గుర్తించింది.డిసెంబర్ 7 నుంచి జనవరి 19వ తేదీల మధ్యలో రాజౌరీలోని బధాల్ అనే కుగ్రామంలో ఈ వరుస మరణాలు(Serial Deaths) సంభవించాయి. జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసట, విపరీతంగా చెమటలు పోయడం, స్పృహ కోల్పోవడం తదితర లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. పైగా మూడు కుటుంబాలకే చెందిన వ్యక్తులు వరుసగా జబ్బు చేసి మరణించడం గమనార్హం. పైగా ఆ కుటుంబాలకు చెందిన బంధువులు చుట్టుపక్కల నాలుగు గ్రామాల్లో విస్తరించి ఉన్నారు. అయితే అనూహ్యంగా వాళ్లలో కూడా కొందరు ఇదే రీతిలో జబ్బు పడ్డట్లు సమాచారం. అందులోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.దీంతో బుధవారం అక్కడి అధికారులు బధాల్ గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. సుమారు 40 మందిని ఐసోలేషన్‌కు తరలించారు. ఇక ప్రజల్లో ఆందోళన నెలకొన్న దృష్ట్యా.. బహిరంగా జనం గుమిగూడటంపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. వరుస మరణాలతో జమ్ము కశ్మీర్లో హెల్త్ ఎమర్జెన్సీ(Health Emergency) ప్రకటిస్తారనే వదంతులు చక్కర్లు కొట్టాయి. అయితే వైద్య ఆరోగ్య అధికారులు మాత్రం వాటిని కొట్టిపారేశారు. ఆ అవసరం లేదని స్పష్టత ఇచ్చారు. నమునాల్లో న్యూరోటాక్సిన్స్ ఉన్నట్లు తేలడంతో.. కుట్ర కోణం తెర మీదకు వచ్చింది. నిజాలు నిగ్గుతేల్చేందుకు కశ్మీర్ పోలీస్ శాఖ సిట్‌ను ఏర్పాటుచేసింది. మంగళవారం బధాల్కు వెళ్లిన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని ప్రకటించారు. మరోవైపు.. వరుస మరణాల నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేందుకు 11 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని కశ్మీర్‌కు పంపింది. -
ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, నిఖిల్ మృతి.. చెరువు వద్ద ఏం జరిగింది?
కామారెడ్డి క్రైం: భిక్కనూరులో పనిచేస్తున్న ఎస్ఐ సాయికుమార్, బీబీపేటలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతితో పాటు బీబీపేటకు చెందిన యువకుడు నిఖిల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. వీరంతా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా ఎస్ఐ మృతదేహాన్ని వెలికితీశారు. వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు సమీపంలో ఎస్ఐ కారు లభ్యం కావడం, చెరువు వద్ద చెప్పులు ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసు అధికారులు భావించారు. బుధవారం సాయంత్రం నుంచి శవాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది చెరువులో దిగి మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు. అర్ధరాత్రి 12.30 గంటలకు కానిస్టేబుల్ శృతి, యువకుడు నిఖిల్ మృతదేహాలు దొరికాయి. గురువారం ఉదయం ఎస్ఐ మృతేదేహాన్ని వెలికితీశారు. ఇక, ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్‌తో పాటు యువకుడు కలిసి చెరువు వద్దకు చేరుకున్నారా? వారి మధ్యన ఉన్న గొడవలేంటి? ఎందుకు ఆత్మహత్య చేసుకుని ఉంటారు? అన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఎస్ఐ సాయికుమార్ గతంలో బీబీపేట పోలీసు స్టేషన్లో విధులు నిర్వహించారు. అక్కడ కానిస్టేబుల్‌గా శృతి పనిచేసేది. ఇప్పుడు కూడా అక్కడే విధులు నిర్వహిస్తోంది. బీబీపేటకు చెందిన నిఖిల్ సొసైటీలో ఆపరేటర్‌గా పనిచేస్తూనే, కంప్యూటర్లు మరమ్మతులు చేస్తుంటాడని తెలుస్తోంది. పోలీసు స్టేషన్‌లోని కంప్యూటర్లకు ఏదైనా సమస్య వస్తే నిఖిల్ వచ్చి సరి చేసి వెళతాడని చెబుతున్నారు. అయితే ఈ ముగ్గురి మధ్యన ఉన్న గొడవలేంటి అన్నది బయటకు వెళ్లడి కావడం లేదు. -
క్రిస్టల్ స్పెన్సర్ మర్డర్ మిస్టరీ?
‘టిన్సెల్ టౌన్’.. హాలీవుడ్ ప్లాట్‌ఫామ్‌కి అదో అద్భుతమైన వార ధి. అది చూపించే గ్లామర్, స్టార్డమ్ వంటి అబ్బురాలను తన కలగా మార్చుకుని, అడుగులు వేసిన క్రిస్టల్ స్పెన్సర్ అనే అమ్మాయి కథే ఈ వారం మిస్టరీ.అమెరికా, కాలిఫోర్నియాలోని యూకియా నగరంలో క్రిస్టల్ పుట్టి పెరిగింది. తన ఎనిమిదేళ్ల వయసులోనే తండ్రి చనిపోయాడు. క్రిస్టల్కు ఇద్దరు సోదరులు. పదిహేనేళ్లు వచ్చేసరికి తల్లి కష్టం చూడలేక, చదువు మానేసి ఉద్యోగంలో చేరి, సంపాదన మొదలుపెట్టింది.యుక్తవయసు వచ్చేసరికి తన అందాన్ని మెచ్చేవాళ్లు, నటిగా ప్రయత్నించమని సలహా ఇచ్చేవాళ్లు ఎక్కువయ్యారు. దాంతో టిన్సెల్ టౌన్ ఆహ్వానాలను నమ్మి, తన ప్రతిభను నిరూపించుకోవడానికి లాస్ ఏంజెలెస్ చేరింది.అక్కడ చిన్న ఉద్యోగం చేసుకుంటూ, సుమారు మూడేళ్లపాటు నటిగా మారేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇంతలో ఉద్యోగం పోయింది. ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో, అయిష్టంగానే విమానాశ్రయంలోని వైల్డ్ గూస్ నైట్‌క్లబ్‌లో డాన్సర్‌గా చేరింది. ‘ఎంతో ఎదగాలని వచ్చి, సమాజమే తప్పుగా చూసే క్లబ్ డాన్సర్‌గా మారి, దిగజారిపోయా’ అని తన స్నేహితురాలు జూలీతో చెప్పుకుని బాధపడేది.నటి కావాలనే ప్రయత్నంలో ఆమెకు ఆంటన్ క్లెయిన్ అనే స్క్రీన్ రైటర్ పరిచయమయ్యాడు. క్రిస్టల్ అందానికి, ప్రతిభకు ప్రత్యేక గుర్తింపునిచ్చిన ఆంటన్.. ఆమె ఎప్పటికైనా మంచి నటి అవుతుందని నమ్మాడు. నాటినుంచి ఆమె అడుగులకు అతడు బాటలు వేయడం మొదలుపెట్టాడు. ఆర్ట్ గ్యాలరీలు, మ్యూజియమ్లు ఇలా ప్రతిచోటికీ వెంట తీసుకెళ్లేవాడు. కచేరీల్లో తనకున్న పరిచయాలను ఆమెకు అవకాశాలుగా మార్చడానికి ప్రయత్నించాడు. క్రమంగా వారి బంధం ప్రేమ, పెళ్లి అనే రెక్కలు తొడిగింది. ‘నేనొక క్లబ్ డాన్సర్‌ని అనే నిజం అతడికి చెప్పలేకపోతున్నా. చెబితే నన్ను చిన్నచూపు చూస్తాడేమో!’ అని జూలీ ముందు క్రిస్టల్ ఏడ్చేంది.అయితే ఒక రాత్రి ఆంటన్ స్నేహితుడు.. ఆమెను క్లబ్లో చూసి, ఆ నిజాన్ని ఆంటన్‌కి చెప్పాడు. ముందే చెప్పనందుకు కలత చెందిన ఆంటన్.. క్రిస్టల్‌ని దూరం పెట్టేశాడు. కానీ ఆమె ప్రేమ ముందు అతడి కోపం చిన్నబోయింది. తిరిగి కలిశారు. క్రిస్టల్‌ని యాక్టింగ్ క్లాసులో చేర్పించాడు. నిజానికి క్రిస్టల్లో అతడికి నచ్చని ఒకే ఒక్క విషయం.. ఆమెకు డ్రగ్స్, ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉండటం. వాటికి దూరంగా ఉండమని చాలాసార్లు గొడవపడేవాడు.ఒకరోజు ఆమెకు జపాన్ లోని ఒక నైట్‌క్లబ్‌లో ‘హోస్టెస్ గర్ల్’గా 3 నెలల పాటు పనిచేయాలంటూ పెద్ద ఆఫర్ వచ్చింది. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే దానికి వెళ్లడమే మేలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. మరునాడు తీవ్రమైన జ్వరంతో క్లబ్‌కి వెళ్లకుండా క్రిస్టల్ ఆమె అపార్ట్మెంట్లోనే ఉండిపోయింది. ఆ సాయంత్రం తన ల్యాండ్ ఫోన్ నుంచి ఆంటన్‌కి కాల్ చేసి, ‘జపాన్ నుంచి తిరిగి వచ్చాక పెళ్లి చేసుకుందాం’ అని చెప్పింది. అయితే మరునాటి నుంచి ఆమె ఫోన్ చేయలేదు. తిరిగి చేస్తుంటే కలవలేదు. సుమారు 2 రోజులు గడిచిపోయాయి. క్రిస్టల్ వర్క్ చేసే క్లబ్‌కి వెళ్లిన ఆంటన్..గత ఐదు రోజులుగా ఆమె క్లబ్‌కు కూడా రాలేదని తెలుసుకున్నాడు. జపాన్ ఆఫర్‌ను ఓకే చేసి, అక్కడికి వెళ్లి ఉంటుందిలే అనుకున్నాడు. రోజులు గడిచాయి. ఒకరోజు అతడికి పోలీసుల నుంచి కాల్ వచ్చింది. ‘క్రిస్టల్‌ని చివరిగా ఎప్పుడు కలిశారు? ఏం మాట్లాడావ్?’ అంటూ చాలా ప్రశ్నలకు ఆంటన్ నుంచి సమాధానాలు రాబట్టారు. తర్వాత ‘వారం క్రితం క్రిస్టల్ తన అపార్ట్మెంట్లోనే చనిపోయింది, దుర్వాసన వస్తోందని పొరుగువారు కంప్లైంట్ చేస్తే తలుపు పగలగొట్టి చూశాం. మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్‌కు పంపించాం’ అని చెప్పారు. ఆ వార్త విని ఆంటన్ హతాశుడయ్యాడు.‘వారం క్రితం చనిపోయిందంటే క్రిస్టల్‌కి జ్వరం వచ్చాక కూడా ఆల్కహాల్, డ్రగ్స్ వంటివి తీసుకుని ఆరోగ్యాన్ని మరింత పాడు చేసుకుంది కాబోలు’ అనుకున్నాడు ఆంటన్. అయితే, క్రిస్టల్ అపార్ట్మెంట్లో ఉండే కొందరు అతడికి మరో షాకింగ్ విషయం చెప్పారు. ‘క్రిస్టల్ మృతదేహం ఇంట్లో ఒక మూలన పడుంది, ఆమె నడుముకు టెలిఫోన్ వైర్‌తో కట్టి, అర్ధనగ్నంగా ఉంది’ అని చెప్పడంతో ఆంటన్ తెల్లబోయాడు. వెంటనే పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ చూశాడు. అది మరింత షాక్‌కు గురి చేసింది. ఎందుకంటే హైట్, వెయిట్ దగ్గర నుంచి చాలావిషయాలు క్రిస్టల్‌ని పోలిలేవు. బాడీ బాగా కుళ్లిపోవడంతో మరణానికి కారణం తెలియలేదని డాక్టర్స్ తేల్చేశారు. క్రిస్టల్ పక్క అపార్ట్మెంట్లో ఉండే ఒక జంట.. మరో నిజం చెప్పింది. సుమారు వారం క్రితం, ఒకరాత్రి క్రిస్టల్ అపార్ట్మెంట్ నుంచి భీకరమైన ఏడుపులు, అరుపులు వినిపించాయని, ఎవరో ఎవరినో తీవ్రంగా హింసిస్తున్నట్లనిపించిందని, కానీ పోలీసులకు చెప్పాలంటే భయమేసి ఆగిపోయామని చెప్పారు. అంటే ఆ రోజు దాడి జరిగింది క్రిస్టల్ పైనేనా? లేదంటే క్రిస్టల్‌ను ఎత్తుకెళ్లి.. మరో అమ్మాయి మృతదేహాన్ని అక్కడ పెట్టారా? అనేది ఆంటన్‌కు అర్థం కాలేదు. కనీసం క్రిస్టల్ మృతదేహాన్ని అప్పగించాలని అధికారుల చుట్టూ్ట ఎంత తిరిగినా.. ఏవేవో కారణాలు చెప్పి, మృతదేహాన్ని అప్పగించలేదు. అసలు జపాన్ ఆఫర్ కూడా ఆమెను కిడ్నాప్ చేసే కుట్రలో భాగమా? అనే అనుమానం ఆంటన్‌కి వచ్చింది.1988 మే 4న క్రిస్టల్ జ్వరం వచ్చి, ఆంటన్ను కలవకుండా, క్లబ్‌కి వెళ్లకుండా అపార్ట్మెంట్లోనే ఉండిపోయింది. మే 13న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసుపై ఆంటన్ ప్రయత్నాలు తీవ్రం కావడంతో ఒకరోజు అతడికి ఒక బెదిరింపు కాల్ వచ్చింది. ‘కొన్నిసార్లు చెడిపోయిన అమ్మాయిలకు చెడు జరుగుతుంటుంది, అలాంటి వాటిని పట్టించుకుంటే, మనం ప్రమాదంలో పడతాం’ అనే సారాంశంతో ఫోన్ కట్ అయ్యింది. ఆ మాటలే ఆంటన్ అనుమానాలకు బలాన్నిచ్చాయి. అప్పుడే ఆంటన్ దృష్టి మాజీ కాలిఫోర్నియా హైవే పెట్రోలింగ్ అధికారి హోరేస్పై పడింది. నిజానికి క్రిస్టల్ పని చేసిన క్లబ్‌కి రహస్య యజమాని అతడేనని అప్పటికే పుకార్లున్నాయి. అతడు చాలా క్లబ్స్, బార్స్‌ను బినామీ పేర్లతో నడుపుతుంటాడని ఆంటన్ విచారణలో తేలింది. పైగా తన స్నేహితులను, వ్యాపార భాగస్వాములను అలరించడానికి తన క్లబ్స్‌లో పనిచేసే డాన్సర్స్‌ని నియమించేవాడని.. వారిలో క్రిస్టల్ కూడా ఉండొచ్చని కొందరు ఆంటన్‌కి చెప్పారు. మరోవైపు మెక్కెన్నాకి ఇంగ్లీవుడ్‌లోని ఒక గిడ్డంగిలో రహస్యంగా కసీనో కూడా ఉందని, డ్యూటీలో భాగంలో క్రిస్టల్ ఒకసారి అక్కడికి వెళ్లిందని.. ఆ తర్వాత ఆ అనధికారిక స్థావరం గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్లే క్రిస్టల్‌ని మెక్కెన్నా చంపించి ఉంటాడని మరికొందరు చెప్పారు. అయితే వేటికీ సాక్ష్యాలు లేక.. పోలీసుల సహకారం లేక ఈ కేసు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.∙సంహిత నిమ్మన -
రష్యాలో మిస్టరీ డెత్స్.. ఎక్కువ మరణాలు వారివే
మాస్కో: ఉక్రెయిన్‌తో 2022లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యాలో వరుసగా సంభవిస్తున్న ప్రముఖుల మరణాలు సంచనం కలిగిస్తున్నాయి. ఇటీవల దేశంలో వరుసగా జర్నలిస్టులు మృతి చెందుతుండడంపైనా చర్చ జరుగుతోంది. తాజాగా రష్యా అధికారిక టీవీ చానల్‌కు చెందిన ఇంటర్నెట్ గ్రూపు హెడ్ కుబాన్ జోయా(48) అనుమానాస్పద స్థితిలో ఇంట్లో మృతి చెందారు. ఆమె ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని ఆమెపై విష ప్రయోగం జరిగి ఉండవచ్చని రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే న్యూస్ ఏజెన్సీ ఆర్ఐఏ నొవోస్తీ వెల్లడించింది. ఇటీవలే మరో రష్యా జర్నలిస్టు అలెగ్జాండర్ రైబిన్ కూడా ఓ హైవేపై అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అలెగ్జాండర్ మరణానికి కారణాలు తెలియవని అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు చెబుతున్నారు. గత నెలలో ఓ న్యూస్ పేపర్ డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్‌గా పనిచేస్తున్న అన్యా సరేవా రాజధాని మాస్కో నగరంలోని తన అపార్ట్మెంట్లో మృతి చెందడం సంచలనం కలిగించింది. ఇదీచదవండి..ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం భారత్ కీలక వ్యాఖ్యలు -
మిస్టరీ: అందమైన ఇంటిని శ్మశానంగా మార్చాడు, 34 ఏళ్ల తర్వాత..
నిస్సహాయతను, నిర్వేదాన్ని నింపుకున్న గుండెలో.. ఓ వెర్రి నవ్వు నిస్తేజంగా తొణికిసలాడుతుంది. ఆ నవ్వులో.. సమాజాన్ని నిలువునా కాల్చి బూడిద చేయగలిగేంత ఆవేశం ఉంటుంది. 43 ఏళ్ల వెనెస్సా బెన్నెట్‌ని కదిలిస్తే అచ్చం అలాంటి నవ్వే నవ్వుతుంది. ఎందుకంటే.. తనకు ఊహ తెలియక మునుపే.. క్రూరమైన చావు పరిచయం అయ్యింది. ఊహ తెలిసేసరికి.. ఆ చావే శరణమనిపించింది. చెల్లాచెదురైన తన బతుకుని చక్కదిద్దుకోవడానికి కొన్నేళ్లు పట్టింది. బతుకుపోరాటంలో ఇప్పటికీ తన మనసుతో తాను యుద్ధం చేస్తూనే ఉంది. ఇంతకీ ఎవరీ వెనెస్సా? అసలు తన జీవితంలో ఏం జరిగింది? వెనెస్సా గురించి ఒక మాటలో చెప్పాలంటే.. దురదృష్టానికి, అదృష్టానికి మధ్య నలిగిన ఒక జీవితం. తనకు అసలేం జరిగిందో తెలియని వయసులోనే.. తోటివాళ్ల రూపంలో.. వెకిలినవ్వులు, ఎగతాళి చూపులు తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాయి. ఆ పరిస్థితికి కారణం ఎవరో తెలియక, తను ఎందుకలా ఉందో తెలియక తల్లడిల్లింది. ఊహ తెలిశాక తన కథ తనకే కన్నీళ్లు తెప్పించింది.1984 జనవరి 16 అర్ధరాత్రి ఓ రాక్షసుడు సుత్తి చేత పట్టుకుని.. అమెరికా, కొలరాడోలోని అరోరాలో.. వెనెస్సా ఇంట్లో అడుగుపెట్టాడు. ఆమెకప్పుడు మూడేళ్ల వయసు. వాడు లోపలికి అడుగుపెట్టగానే.. వెనెస్సా తండ్రి బ్రూస్ బెన్నెట్(27)ని అత్యంత క్రూరంగా సుత్తితో కొట్టి చంపేశాడు. మూడేళ్ల చిన్నారిపై లైంగికంగా.. తర్వాత తల్లి డెబ్రా(26), అక్క మెలిస్సా(7)లపై లైంగికంగా దాడి చేసి.. అదే సుత్తితో వాళ్లనూ హత్య చేశాడు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆ ఇంటిని శ్మశానంగా మార్చాడు. అసలేం జరుగుతోందో తెలియని స్థితిలో వెనెస్సా ఒంటరిగా ఆ కిల్లర్ చేతికి చిక్కింది. కనికరంలేని ఆ క్రూరుడు మూడేళ్ల వెనెస్సాపై కూడా లైంగికదాడి చేసి.. సుత్తితో తీవ్రంగా కొట్టాడు. అందరిలానే ఆ పాపా చనిపోయిందనుకుని తెల్లారేసరికి పారిపోయాడు. ఉదయం పది దాటేసరికి వెనెస్సా నాన్నమ్మ కొన్నే బెన్నెట్.. ఆ ఘోరాన్ని చూసి గుండెలవిసేలా ఏడ్చింది. కాసేపటికే పోలీసులు, వైద్యులు అంతా అక్కడికి చేరుకున్నారు. రక్తపుమడుగులో పడి ఉన్న వెనెస్సా కొన ఊపిరితో ఉందని గుర్తించి.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. 16ఏళ్లకే డ్రగ్స్‌కు అలవాడుపడి.. కిల్లర్ దాడికి.. వెనెస్సా దవడ, పుర్రె పగిలిపోయాయి. కాళ్లు, చేతులు విరిగిపోయాయి. శరీరం మొత్తం ఛిద్రమై.. ప్రాణం మాత్రమే మిగిలింది. రెండేళ్లకు కోలుకున్న వెనెస్సా.. తీవ్రమైన ఒత్తిడి, కోపం, అసహనం లాంటి ఎన్నో మానసిక రుగ్మతలతో బాధపడుతూ నాన్నమ్మ దగ్గరే పెరిగింది. అయితే ఇంతటి ఘోరం చేసిన కిల్లర్ ఎవరో.. ఎవరికీ తెలియలేదు. దర్యాప్తు జరుగుతున్నా.. సరైన సాక్ష్యాధారాల్లేక.. కోల్డ్ కేసుల సరసన చేరిపోయింది. కాలక్రమేణా తన కథను తెలుసుకున్న వెనెస్సా.. సమాజంపై ద్వేషాన్ని పెంచుకుంది. చెడుదారుల్లో నడిచింది. 16 ఏళ్లకే డ్రగ్స్‌కు అలవాటుపడింది. 17 ఏళ్ల వయసులో.. జీవితం మీద విరక్తి పుట్టి.. చనిపోవాలని మణికట్టుని కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. జీవితం విలువ తెలిసొచ్చింది ఏళ్లుగా కిల్లర్ కోసం.. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగినా.. ఆ అగంతుకుడు ఎవరో తేలలేదు.18 ఏళ్ల వయసులో తన ఇష్టపూర్వకంగానే గర్భవతి అయిన వెనెస్సా.. కొడుకు పుట్టిన 3 నెలలకు ‘తల్లిగా ఎలా ఉండాలో తెలియట్లేదు’ అంటూ చిల్డ్రన్స్ వెల్ఫేర్ అధికారులకు బాబుని అప్పగించేసింది. రోజురోజుకీ మానసిక ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. తను, తన బాయ్‌ఫ్రెండ్ కలసి వంతెన కింద జీవించడం మొదలుపెట్టారు. తలస్నానం చెయ్యాలన్నా.. దగ్గరల్లోని ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితుల్ని ఎదుర్కొంది. దొంగతనాలు, మాదకద్రవ్యాల కేసుల్లో జైలుకి కూడా వెళ్లింది. 30 ఏళ్లు వచ్చేసరికి.. ఆమెలో మార్పు మొదలైంది. జీవితం అంటే ఇది కాదు అనే ఆలోచన వచ్చింది. మనిషిగా బతకడానికి.. గతంతో సంబంధం లేదనిపించింది. దాంతో మాట, తీరు అన్నీ మార్చింది. ఫ్రాంకీ విల్లార్డ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. మోటివేషనల్ స్పీకర్‌గా పని చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సాటి మనిషికి సాయం చెయ్యాలనే ఆలోచనతో తన కథను ప్రపంచానికి చెప్పడం మొదలుపెట్టింది. డ్రగ్ కౌన్సెలర్ అయేందుకు డిగ్రీ కళాశాలలో చేరింది. 2018లో సుమారు 20 ఏళ్ల వయసున్న తన కొడుకుని కూడా కలుసుకుంది. ఆ రోజు వెనెస్సా మనస్పూర్తిగా నవ్వింది. ‘నేను ఒకరికి ప్రాణం పోశాననే ఆనందం.. నేనో తల్లిననే అనుభూతి చాలా గొప్పగా ఉంది’ అంటూ పొంగిపోయింది. 2018 వరకూ ఈ కేసు మిస్టరీగానే ఉంది. సరిగ్గా 34 ఏళ్ల తర్వాత.. డీఎన్ఏ ఆధారంగా కిల్లర్ ఎవరనేదానిపై ఓ స్పష్టత వచ్చింది. డీఎన్ఏతో హంతకుడు ఎవరో తేలింది షాకింగ్ విషయం ఏంటంటే.. ఆ కిల్లర్.. పరారీలో ఉన్న నిందితుడు కాదని.. 1984 ఆగస్ట్ 9 నుంచి జైలు జీవితాన్ని అనుభవిస్తున్న నేరగాడని తేలింది. అతడు సీరియల్ కిల్లర్ అలెక్స్ క్రిస్టోఫర్ ఎవింగ్ అని అందరితో పాటు వెనెస్సా అప్పుడే తెలుసుకుంది. 1984లో అతడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అందులో బెన్నెట్ ఫ్యామిలీ విషాదగాథ కూడా ఒకటని.. ముందు నుంచి అనుమానాలున్నా.. డీఎన్ఏతో 2018లో క్లారిటీ వచ్చింది. 1984 జనవరి 10న లేక్‌వుడ్‌లో ప్యాట్రీషియా స్మిత్ అనే మహిళపై హింసాత్మకంగా లైంగిక దాడి చేసి, హత్య చేశాడు. అదే ఏడాది ఆగస్టు 9న నెవాడా, హేండర్సన్లో గొడ్డలితో నాన్సీ, క్రిస్ బ్యారీలపై దాడిచేసి పారిపోయాడు. ఆ కేసులోనే అతడు అరెస్ట్ అయ్యాడు. అప్పటి నుంచి నిర్బంధంలోనే ఉన్నాడు. అతడికి హ్యామర్ కిల్లర్ అనే పేరు కూడా పెట్టాయి అప్పటి వార్తా పత్రికలు. మూడు వేర్వేరు రాష్ట్రాల్లో ప్రజలపై దాడి చేసినట్లు ఆధారాలు ఉండటంతో అతడికి పెరోల్ కూడా లభించలేదు. 2021 నాటికి అతడు బెన్నెట్ కేసులో దోషిగా రుజువు కావడంతో కోర్టు.. మూడు జీవితకాలాల కారాగార శిక్షను విధించింది. దాంతో అతడు జీవితంలో బయటికి వచ్చే అవకాశాన్నే కోల్పోయాడు. ఈ కథ తెలిసిన వాళ్లంతా న్యాయం జరిగింది అన్నారు. కానీ వెనెస్సా మాత్రం.. తనకు జరిగిన అన్యాయం పూడ్చలేనిదని, అతడిలో నేను పశ్చాత్తాపం చూడలేదని చెప్పింది. సమాజంపై గౌరవం కోల్పోయింది ‘అతడి కారణంగా నేను నా వాళ్లని మాత్రమే కాదు.. సమాజంపై నమ్మకాన్నీ, గౌరవాన్నీ కోల్పోయాను. నా వ్యక్తిత్వాన్నీ కోల్పోయాను. ఇప్పటికీ నేను ప్రతిరోజూ అద్దంలో చూసుకుని.. తట్టుకోలేని వేదనను అనుభవిస్తున్నాను. తెలియని కోపం, ద్వేషం, మానసిక వేదన ఇలా అన్నీ నన్ను కుంగదీస్తూనే ఉన్నాయి. నా జీవితం నాశనమైపోయింది. దానికి ఏ పరిష్కారం లేదు’ అంటూ ఎందరో మనసుల్ని మెలిపెట్టింది. సరైన సాక్షులు లేని ఈ కథలో కిల్లర్ కేవలం డీఎన్ఏ ఆధారంగానే దొరికాడు. లేదంటే ఇప్పటికీ ఈ కథ మిస్టరీగానే ఉండిపోయేది. ∙సంహిత నిమ్మన -
Hyderabad: మిస్టరీగా మారిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి.. అదే కారణమా!
సాక్షి, మేడ్చల్, మహబూబ్‌నగర్: మేడ్చల్ జిల్లా బాచుపల్లి మండలం ప్రగతినగర్‌లోని మధురానగర్ కాలనీకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మణికంఠవర్మ (29) మృతి మిస్టరీగా మారింది. తన పెంపుడు కుక్కకు మందులు కొనేందుకు బుధవారం ఉదయం కారులో ఇంటి నుంచి బయలుదేరిన ఆయన వనపర్తి జిల్లా శ్రీరంగాపుర్ మండలం జానంపేట శివారులోని రామసముద్రం చెరువులో గురువారం శవమై తేలడం పలు అనుమానాలకు తావిస్తోంది. మృతుడి తల్లి విష్ణుప్రియ, అక్క అన్నపూర్ణదేవి కథనం ప్రకారం.. బుధవారం ఉదయం కుక్కపిల్లకు మందులు తీసుకువస్తానని మణికంఠవర్మ కారులో ఇంటి నుంచి బయలుదేరాడు. అతను ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు అతడికి కాల్ చేయగా మొబైల్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో వారు అతడి స్నేహితులు, తమ బంధువులకు ఫోన్ చేసినా ప్రయోజనం లేకపోవడంతో సాయంత్రం జేఎన్టీయూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. వారు ప్రగతినగర్ బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధికి వస్తుందని చెప్పడంతో బాచుపల్లి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రామసముద్రం చెరువులో శవమై.. వనపర్తి జిల్లా, శ్రీరంగాపుర్ మండలం, జానంపేట శివారులోని రామసముద్రం చెరువులో తూము వద్ద శవం ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించి సర్పంచ్ వెంకటేశ్వర్‌రెడ్డికి తెలియజేయగా.. ఆయన పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చెరువులో నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడికి షర్టు లేదు.. ట్రాక్ ప్యాంట్‌కు కారు తాళం చెవి కట్టి ఉంది. పోలీసులు తాళం చెవి తీసుకుని కారును ఓపెన్ చేసి చూడగా.. అందులో స్విచ్ ఆఫ్ అయిన సెల్‌ఫోన్ లభించింది. ఆన్‌చేసి ఓపెన్ చేసేందుకు ప్రయత్నం చేయగా లాక్‌వేసి ఉంది. పోలీసులు అందులోని సిమ్‌కార్డును తీసి మరో సెల్లో వేసి ఆన్ చేశారు. దీంతో అతడి మిత్రులు, బంధువులకు ఎస్ఎంఎస్ వచి్చంది. శివాజీ అనే వ్యక్తి వెంటనే కాల్ చేయగా.. కానిస్టేబుల్ విషయం చెప్పి రమ్మన్నారు. ఈ మేరకు కుటుంబసభ్యులు గురువారం సాయంత్రానికి వనపర్తికి చేరుకున్నారు. శుక్రవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఆస్తి వివాదమే కారణమా ? కొన్నేళ్ల క్రితం గండిమైసమ్మ ప్రాంతంలో మృతుడి తండ్రి ఓ వెంచర్లో 340 గజాల ప్లాటు కొనుగోలు చేశాడు. దీని పక్కనే మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ భవన్‌ను నిరి్మంచారు. దాని పార్కింగ్ కోసం ఆ పార్టీ నేతలు వెంచర్‌లోని ప్లాట్లను చదును చేసేందుకు యత్నించారు. దీంతో మణికంఠవర్మ, తనతో పాటు కొనుగోలు చేసిన వారితో కలిసి కోర్టులో కేసు వేశారు. కోర్టు స్టే ఇవ్వగా.. తహసీల్దార్ స్వయంగా వచ్చి చదును చేసే పనులను నిలిపివేయించారు. ఈ క్రమంలో మణికంఠవర్మ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఆస్తి వివాదమే ప్రాణం తీసిందని.. ఈ వివాదం తప్ప తమకు ఎలాంటి సమస్యలు లేవని మృతుడి తల్లి, అక్క రోదిస్తూ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాత పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు. -
గంగాధర మిస్టరీ మరణాల్లో కొత్తకోణం.. మమత శరీరంలో ఆర్సెనిక్!
సాక్షి, కరీంనగర్: సంచలనం సృష్టించిన కరీంనగర్ జిల్లాలోని గంగాధర మిస్టరీ కేసు మరో మలుపు తిరగనుంది. పోలీసులు అనుమానిస్తున్నట్లు ఇంటి పెద్ద వేముల శ్రీకాంత్ తన భార్యాపిల్లలపై విషప్రయోగం చేశాడని నిర్ధారణ అయితే.. పిల్లల మృతదేహాలకూ పోస్టుమార్టం తప్పేలా లేదు. డిసెంబరు 30న అర్ధరాత్రి వేముల శ్రీకాంత్ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఇదే విషయాన్ని చికిత్స సమయంలో వైద్యులకు చెప్పాడు. ఈ పరిణామంతో పోలీసుల దర్యాప్తు అకస్మాత్తుగా శ్రీకాంత్ వైపు తిరిగింది. శ్రీకాంత్ బయోటెక్నాలజీలో పీజీ చేయడం.. ఫుడ్ సైన్స్ లెక్చరర్ కావడం.. రోజూ ప్రయోగాల కోసం ల్యాబ్‌లో రసాయనాలు వినియోగించడం.. వెరసీ అతనికి కెమికల్స్‌పై పూర్తిస్థాయి అవగాహన ఉందని పోలీసులు నిర్ధా రణకు వచ్చారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల తరహాలోనే తానూ రక్తపువాంతులు, విరోచనాలు చేసుకుని మరణించడంతో వారి శరీరంలోనూ సోడియం హైడ్రాక్సైడ్ చేరిందా..? అనే సందేహాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఫోరెన్సిక్ అధికారులు మమత శరీరంలో ఆర్సెనిక్ ఆనవాళ్లు ఉన్నాయని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు వారు మరింత లోతుగా రసాయన విశ్లేషణ జరుపుతున్నారు. త్వరలోనే ఈ విషయంపై ఎఫ్ఎస్ఎల్ తుది నివేదిక పంపితే.. మమత మరణానికి స్పష్టమైన కారణం తెలియనుంది. 45 రోజుల్లో నలుగురు ఈ ఘటనల్లో తొలుత శ్రీకాంత్ కొడుకు అద్వైత్ (20నెలలు)వాంతులు, విరోచనాలతో అనారోగ్యానికి గురై నవంబరు 16న కన్నుమూశాడు. అవే లక్షణాలతో కూతురు అమూల్య (6) డిసెంబర్ ఒకటిన ప్రాణాలు విడిచింది. ఈ రెండు మరణాలకు వైద్యులు కారణాలు చెప్పలేకపోయారు. అంతుచిక్కని వ్యాధి, కలుషిత తాగునీరు కారణమనుకుని సమీపంలోని బావిలోని తాగునీటిని, బాధితుల బంధువుల రక్తాన్ని పరీక్షించారు. అయినా వారికి ఏమీ చిక్కలేదు. దీంతో మిస్టరీ మరణాలు చేతబడి, మంత్రాల కారణంగా జరుగుతున్నాయన్న ప్రచారం కూడా జరిగింది. శ్రీకాంత్ భార్య మమత (26) కూడా అనారోగ్యానికి గురై డిసెంబరు 18న మరణించింది. డిసెంబరు 30న శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. 45 రోజుల వ్యవధిలో మొత్తం కుటుంబం అనుమానాస్పద స్థితిలో తుడిచిపెట్టుకుపోయింది. మమత శరీరంలో ఆర్సెనిక్..! మరి పిల్లల్లో..? పోలీసుల వినతి మేరకు మమత పోస్టుమార్టం సమయంలో వైద్యులు విస్రా (శరీరంలోని కీలక అంతర్భాగాలు)ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మమత శరీర భాగాల్లో ఆర్సెనిక్ ఆనవాళ్లను గుర్తించారు. దీన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే.. ఆమె శరీరంలోకి ఎలా చేరింది..? పిల్లల మరణాలకు కారణం ఆర్సెనికా..? లేదా సోడియం హైడ్రాక్సైడా..? అనే విషయాన్ని పోలీసులు ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. పిల్లలిద్దరూ అనారోగ్య లక్షణాలతో మరణించారని వారికి పోస్టుమార్టం నిర్వహించలేదు. ఇపుడు వారి మరణంపై అనేక సందేహాలు వెలుగులోకి రావడంతో వారి శవాలకు పోస్టుమార్టం తప్పనిసరి కానుంది. అందుకే పిల్లల శరీర భాగాల నుంచి విస్రా (అంతర్భాగాల నుంచి నమూనాలు)ను తీసుకోవాల్సి ఉంటుంది. చదవండి: వాడు నీ కొడుకే.. కిడ్నాప్ కేసులో సినిమా రేంజ్ ట్విస్ట్! రెండు నెలల అనంతరం.. నవంబరు 16న 20 నెలల అద్వైత్ అనుమానాస్పదంగా మరణించాడు. అతడిని గంగాధర శివారులోని వంతెన సమీపంలో ఖననం చేశారు. డిసెంబరు ఒకటిన అమూల్య (6) కూడా కన్నుమూసింది. దీంతో తమ్ముడి సమాధి పక్కనే అక్కనూ ఖననం చేశారు. వీరిలో అద్వైత్ మరణించి 50 రోజులు, అమూల్య చనిపోయి 35 రోజులు దాటింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు రావడానికి వారం పట్టవచ్చని పోలీసులు అంటున్నారు. ఒకవేళ మమత శరీరంలో విష ఆనవాళ్లు ఉంటే పిల్లల మరణాలకు కారణం తెలుసుకోవాల్సి ఉంటుంది. అదే నిజమైతే.. పిల్లలు మరణించిన దాదాపు రెండు నెలల అనంతరం పోస్టుమార్టం చేయాల్సి వస్తుందని పలువురు సీనియర్ పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
ఆత్మహత్యలేనా?
రష్యాకు చెందిన ప్రముఖులు అనుమానాస్పద రీతిలో మరణించడం సంచలనం రేపుతోంది. ఒకరో, ఇద్దరో మరణించారనుకుంటే ఏమో అనుకోవచ్చు. గత ఏడాది కాలంలో ఏకంగా 24 మంది మృత్యువాత పడడం చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించడానికి కాస్త ముందు నుంచే ఈ మిస్టరీ మరణాలు సంభవించడం గమనార్హం. ఇలా మరణించిన ప్రముఖుల్లో కొందరు పుతిన్ యుద్ధోన్మాదాన్ని బహిరంగంగా వ్యతిరేకించినవారు ఉన్నారు. దీంతో పుతిన్‌ను ఎదిరిస్తే ప్రాణాలు కోల్పోవాల్సిందేనా అన్న చర్చ కూడా జరుగుతోంది. భారత్‌లో 15 రోజుల్లో ముగ్గురు మన దేశంలోని ఒడిశా రాష్ట్రంలో గత పదిహేను రోజుల్లో ముగ్గురు రష్యన్లు ప్రాణాలు కోల్పోయారు. పారాదీప్ ఓడరేవులో ప్రయాణిస్తున్న నౌక సిబ్బందిలో ఒకరైన సెర్జీ మిల్యాకోవ్ (50) మంగళవారం తెల్లవారుజామున నౌకలో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు విడిచారు. బంగ్లాదేశ్‌లో చిట్టగాంగ్ పోర్టు నుంచి పారాదీప్ మీదుగా ముంబై వెళుతున్న ఆ నౌకకి సెర్జీ చీఫ్ ఇంజనీర్. తెల్లవారుజామున 4.30 గంటలకు ఆయన శవమై కనిపించారు. సెర్జీ గుండెపోటుతో మరణించారని నౌకా సిబ్బంది భావిస్తున్నారు. ఒడిశాలోని రాయగడ సాయి ఇంటర్నేషనల్ హోటల్లో ఇద్దరు రష్యన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై విచారణ కొనసాగుతుండగానే మరో మరణం సంభవించింది. రష్యా వ్యాపారి, ఎంపీ పావెల్ ఆంటోవ్ (65)డిసెంబర్ 24న హోటల్ గది కిటికీలో నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయారు. అంతకు రెండు రోజుల ముందే డిసెంబర్ 22న ఆయన స్నేహితుడు వ్లాదిమర్ బెడెనోవ్ (61) హోటల్ గదిలో అపస్మారక స్థితిలో కనిపించి ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగా ప్రాణాలు విడిచారు. ప్రాణాలు కోల్పోతున్న ప్రముఖులెవరు ? ప్రాణాలు కోల్పోతున్న రష్యన్లలో బిలయనీర్లు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, చమురు సంస్థల అధిపతులు, పెద్ద పెద్ద పదువుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు, మిలటరీ నాయకులు ఉన్నారు. వీరిలో అత్యంత పిన్న వయస్కుడు 37 ఏళ్లు కాగా 73 ఏళ్ల వయసు వరకు అన్ని వయసుల వారు ఉన్నారు. రష్యా యుద్ధం మొదలైన రెండో రోజే గ్యాజ్‌ఫ్రామ్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ అలెగ్జాండర్ ట్యూల్కోవ్ అనుమానాస్పదరీతిలో మరణించారు. యుద్ధాన్ని వ్యతిరేకించిన డాన్ రాపో పోర్ట్ గత ఆగస్టులో అనుమానాస్పద స్థితిలో మరణించారు. మన దేశంలో రాయగడలో మరణించిన ఎంపీ పావెల్ కూడా యుద్ధాన్ని వ్యతిరేకించినవారే. ఆయన మరణించిన రోజే రష్యా నావికాదళానికి చెందిన అలెగ్జాండర్ బుజెకోవ్ కూడా అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. మార్చిలో వాసిలీ మెల్నికోవ్ తన భార్యా ఇద్దరు పిల్లలతో కలిసి శవమై కనిపించారు. జులైలో ప్రభుత్వ కాంట్రాక్టర్ యూరీ వోరోనోవ్ తన ఇంట్లో స్విమ్నింగ్‌పూల్‌లో రక్తపు మడుగులో శవమై తేలారు. – సాక్షి, నేషనల్ డెస్క్ ఎలా మరణిస్తున్నారు ? రష్యా ప్రముఖులు మరణాల్లో ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నట్టు ప్రచారంలో ఉంది. ఎత్తయిన భవనాల మీద నుంచి, గదుల్లోని కిటికీల నుంచి, నౌకల నుంచి దూకడం, తమని తాము కాల్చుకోవడం, గుండె పోట్లు వంటి ఘటనలతో మరణించడం ఎక్కువగా వెలుగులోకి వస్తోంది..లుక్ ఆయిల్ చైర్మన్ రావిల్ మాగ్నోవ్ గత సెప్టెంబర్‌లో అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి తన గది కిటికీ నుంచి కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఇలా మరణిస్తున్న వారిలో సంపన్నులే ఎక్కువ. వారి చుట్టూ అంగరక్షకులు ఉంటారు. కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. చిన్న అనారోగ్యం వచ్చినా అత్యుత్తమ వైద్య సేవలు తీసుకునే సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే వారి మరణాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ‘‘మరణిస్తున్న వారిలో అత్యధికులు కోట్లకు పడగలెత్తి రాజకీయ ప్రాబల్యం ఉన్నవారే. వారు అసహజంగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదం. పుతిన్ హయాంలో గత దశాబ్దకాలంగా విషప్రయోగాలతో చంపేయడం, హత్యాయత్నాలు విరివిగా జరుగుతూనే ఉన్నాయి. 2020లో ప్రతిపక్ష నేత అలెక్సీ నావెల్నీపై విష ప్రయోగం జరిగిన విషయం తెలిసిందే’’ అని రష్యాలో పొలిటికల్ సైంటిస్ట్ ప్రొఫెసర్ జెఫ్రీ వింటర్స్ చెప్పారు. ఆర్థిక ఒత్తిళ్లు కారణమా ? ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలతో వ్యాపారాలు బాగా దెబ్బతిని బిలయనీర్లందరూ ఆర్థిక కష్టాల్లో మునిగిపోయారు. గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన వారంతా తమ వ్యాపారాలు మళ్లీ పుంజుకుంటాయన్న నమ్మకం లేని తీవ్రమైన నిరాశ నిస్పృహల్లోకి వెళ్లిపోతున్నారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడడం, ఆరోగ్యం క్షీణించి గుండెపోట్లు రావడం జరుగుతోందన్న అభిప్రాయాలు ఉన్నాయి. గత ఏడాది కాలంలో చమురు సంస్థలకు చెందిన ఆరుగురు అనుమానాస్పద స్థితిలో మరణించారు. -
ప్రేయసి కాదు.. ఆమె రాక్షసి!!
ప్రేమ మత్తులో మునిగిన యువకుడు.. అందులోంచి బయట పడలేకపోయాడు. ఆమె కోసం పరితపించిపోయి పిచ్చి ప్రేమను ప్రదర్శించాడు. చివరికి.. ప్రేమ పేరిట ఆమె ఆడిన నాటకంలో ఆ భగ్న ప్రేమికుడు కాస్త.. బలి పశువు అయ్యాడు. ప్రాణాల కోసం ఆస్పత్రిలో రోజుల తరబడి పోరాడి.. చివరకు కన్నుమూశాడు. కేరళ తిరువనంతపురంలో ఓ యువకుడి మరణం కేసు.. మిస్టరీగా మారింది. అతనెలా మరణించాడన్నది ఎటూ తేల్చలేకపోతున్నారు పోలీసులు. అయితే బాధిత కుటుంబం మాత్రం మూఢనమ్మకంతో.. ప్రియురాలే తమ బిడ్డ ప్రాణం తీసిందని అంటోంది. పరసాలాకు చెందిన షరోన్ రాజ్(23) గత కొంతకాలంగా ఉష అనే ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. వృత్తి రిత్యా వేరే ఊర్లో ఉంటున్న షరోన్కి.. ఈమధ్య ఆమెకు మరో వ్యక్తితో ఎంగేజ్ మెంట్ అయ్యిందని విషయం తెలిసి షాకయ్యాడు. ఈలోపే ఉష అతనికి కాల్ చేసింది. తనకు ఇష్టం లేకుండా ఇంట్లో వాళ్ల బలవంతం మేరకు ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని చెప్పింది. దీంతో అప్పటి నుంచి అతను ఆమెకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే.. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు షరోన్ దగ్గర ఉన్నాయి. వాటి వల్ల ఎప్పటికైనా ప్రమాదం అనుకుందో ఏమో.. అతనితో వాట్సాప్ ఛాటింగ్ ద్వారా దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో.. అక్టోబర్ 10న షరోన్ పరసాలాకు వచ్చాడు. అక్టోబర్ 14న ఉదయం షరోన్‌కు ఉష ఫోన్ చేసింది. కలవాలని ఉందని.. బయటకు వెళ్దామని చెప్పింది. అయితే బైక్ సర్వీసింగ్‌కు ఇచ్చానని చెప్పడంతో ఫోన్ పెట్టేసింది. కాసేపు ఆగి మళ్లీ ఫోన్ చేసి ఇంట్లో ఎవరూ లేరు.. రమ్మని ఆహ్వానించింది. స్నేహితుడితో కలిసి రామవర్మంచిరై(కన్యాకుమారి, తమిళనాడు)లో ఉష ఇంటికి వెళ్లాడు షరోన్. స్నేహితుడు బయట ఎదురుచూస్తుండగా.. ఒక్కడే ఇంట్లోకి వెళ్లాడు. అయితే.. పావు గంటకు పొట్టచేత పట్టుకుని వాంతులు చేసుకుంటూ బయటకు వచ్చాడు షరోన్. ఆ తర్వాత కూడా ఇద్దరూ చాట్ చేసుకున్నారు. కషాయం, జ్యూస్‌ల్లో ఏం కలిపావని షరోన్ ఉషను నిలదీశాడు. అయితే తానేం కలపలేదని.. బహుశా పండ్ల రసం వికటించిందేమో అని సమాధానం ఇచ్చింది ఆమె. అక్కడితో వాళ్లిద్దరి ఛాటింగ్ ఆగిపోయింది. దారి పొడవునా నీలి రంగులో వాంతులు కావడంతో.. షరోన్‌ను పరసాలా ప్రభుత్వాసుపత్రిలో చేర్చాడు ఆ స్నేహితుడు. ఆపై తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. అక్కడ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు నార్మల్ రావడంతో.. ఇంటికి పంపించేశారు. ఆ తర్వాత రెండు రోజులకు షరోన్ పరిస్థితి విషమించడంతో.. తిరిగి తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ ఆస్పత్రికి తరలించారు అతని పేరెంట్స్. 11 రోజుల పాటు చికిత్స పొందిన షరోన్‌కు లంగ్స్, కిడ్నీ ఒక్కొక్కటిగా దెబ్బ తింటూ వచ్చాయి. ఈలోపు షరోన్ నుంచి మెజిస్ట్రేట్ సమక్షంలో వాంగ్మూలం సేకరించారు పోలీసులు. మరోవైపు వైద్యులు.. అతను తాగిన డ్రింక్‌లో యాసిడ్లాంటిది కలిసిందని నిర్ధారించారు. అయితే ఏం కలిపారనే దానిపై మాత్రం స్పష్టత రాలేదింకా. ఇక ఈ కేసులో పోలీసుల తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల దర్యాప్తు పూర్తిగా నిందితుల కుటుంబానికి అనుకూలంగా ఉందని ఆరోపిస్తోంది బాధిత కుటుంబం. అంతేకాదు.. పరారీలో ఉన్న ఉష కుటుంబాన్ని పోలీసులు ఇంతదాకా ట్రేస్ చేయలేకపోయారు. ఆ గండం గట్టెక్కేందుకే.. ఉష కుటుంబానికి షరోన్ రాజ్ నచ్చలేదు. అందుకే మరో వ్యక్తితో ఉషకు పెళ్లి ఫిక్స్ చేసి.. ఎంగేజ్మెంట్ కూడా కానిచ్చేశారు. పెళ్లి సెప్టెంబర్‌లోనే జరగాల్సి ఉండగా.. ఆఖరి నిమిషంలో ఎందుకనో ఫిబ్రవరికి వాయిదా వేశారు. దీంతో.. తమ బిడ్డ మరణం వెనుక మూఢనమ్మక కోణం కూడా ఉందని షరోన్ కుటుంబం ఆరోపిస్తోంది. ఉషకు పెళ్లైన వెంటనే భర్త మరణించే గండం ఉందని, ఆ దోషం పొగొట్టేందుకు తమ బిడ్డతో బలవంతంగా ఆమె నుదుట కుంకుమ పెట్టించారని షరోన్ కుటుంబం అంటోంది. ఉష ఇంటి నుంచి బయటకు వచ్చిన షరోన్ నుదుటిపై కూడా కుంకుమ ఉందని, ఆ విషయాన్ని కూడాఉన్న స్నేహితుడు సైతం నిర్ధారించాడని అంటోంది. ఇంటికి పిలిపించి మరీ పక్కా ప్లాన్‌తో ఉషతో బలవంతపు వివాహం జరిపించి.. ఆపై ఏదో తాగించి షరోన్ మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తోంది. ఇలాంటిదే మరో ఘటన.. షరోన్ రాజ్‌తో పాటు మరో చిన్నారి మృతి కేసు కూడా కేరళలో మిస్టరీగా మారింది. సెప్టెంబర్ 24వ తేదీన అథెన్కోడ్కు చెందిన ఓ స్కూల్ విద్యార్థి.. మరో విద్యార్థి ఇచ్చిన డ్రింక్ తాగి ఆస్పత్రి పాలయ్యాడు. ఆ డ్రింకులోనూ యాసిడ్ తరహా ఆనవాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మూడు వారాలపాటు చికిత్స పొందిన 11 ఏళ్ల ఆ బాలుడు.. చివరికి ఆర్గాన్ ఫెయిల్యూర్‌తోనే కన్నుమూశాడు. సుచింద్రమ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేపట్టగా.. షరోన్ రాజ్ మృతి కూడా అదే తరహాలో చోటు చేసుకోవడం గమనార్హం. -
సోనాలి ఫోగట్ దారుణ హత్య.. ఎందుకు చంపారు?
బీజేపీ నేత, హిందీ బిగ్‌బాస్ షో మాజీ కంటెస్టెంట్ సోనాలి ఫోగట్(43) హఠాన్మరణం కాస్త హత్యగా నిర్ధారణ కావడం సంచలనం సృష్టిస్తోంది. కుటుంబ సభ్యుల ఆరోపణలకు బలం చేకూరేలా.. ఆమె అనుచరులే ఆమె మరణానికి కారణమన్న కోణంలోనే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినా కారణాలేంటన్నది మాత్రం పోలీసులు ఇంకా ప్రకటించకపోవడం విశేషం. తొలుత గుండెపోటు మరణంగా ప్రకటించిన వైద్యులు.. శవపరీక్షలో ఒంటిపై గాయాలున్నాయని నిర్ధారించారు. దీంతో సోనాలి ఫోగట్ మరణాన్ని అనుమానాస్పద మృతి కేసు నుంచి హత్య కేసుగా మార్చేశారు గోవా పోలీసులు. ఆపై ఆమె అనుచరులు సుధీర్ సంగ్వాన్, సుఖ్విందర్ వాసీలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణలో.. ఈ ఇద్దరూ ఆమెకు ఇచ్చిన డ్రింకులో 1.5 గ్రాముల ఎండీఎంఏ కలిపినట్లు అంగీకరించారు. అంతేకాదు.. తన అనుచరుల సాయంతో తూలుతూ నడుస్తున్న సోనాలి ఫోగట్ వీడియోలు(సీసీటీవీ ఫుటేజీ)సైతం బయటకు రిలీజ్ చేశారు పోలీసులు. అతికష్టం మీద సుధీర్ సాయంతో ఆమె రెస్టారెంట్లో నడుస్తూ కనిపించారు. ఆ ఆధారాలతో పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ టీం వీళ్లిద్దరినీ పలు ప్రాంతాల్లోకి తీసుకెళ్లి.. కేసు దర్యాప్తు కొనసాగిస్తోంది. అలాగే త్వరలో వీళ్లిద్దరినీ కోర్టులో ప్రవేశపెడతామని గోవా పోలీసులు చెప్తున్నారు. ఆ రెండున్నర గంటలు! ఆధారాలు నాశనం చేయడంతో పాటు సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉండడంతో ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు గోవా డీజీపీ జస్పాల్ సింగ్ తెలిపారు. కర్లీస్ రెస్టారెంట్ సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. ఉదయం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఆమెను సుధీర్ తన భుజం మీద మోసుకుంటూ టాయిలెట్‌కు తీసుకెళ్లాడు. వెనకాలే సుఖ్విందర్ కూడా ఉన్నారు. రెండున్నర గంటల తర్వాత.. అంజువా ఏరియాలోని సెయింట్ ఆంటోనీ ఆస్పత్రికి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే ఉదయం ఏడు గంటలకు వైద్యులు ఆమె గుండెపోటుతో చనిపోయిందని ప్రకటించారు. అయితే ఆ రెండు గంటల్లో ఏం జరిగిందో మాత్రం నిందితులు ఇంకా వెల్లడించలేదు. This is CCTV footage allegedly of Sonali Phogat with Sudhir Sangwan of August 22. She can barely walk. Drunk or God knows what they drugs they gave her 😑 #SonaliDeathMystery#SonaliPhogat pic.twitter.com/gj5JDCW4bL — Rosy (@rose_k01) August 26, 2022 సంచలనం సృష్టించిన సోనాలి ఫోగట్ మృతి కేసు.. మర్డర్‌గా నిర్ధారణ కావడం ఆమె అభిమానుల్ని విస్మయానికి గురి చేస్తోంది. ఆమె అత్యాచారానికి గురయ్యారని, బ్లాక్‌మెయిలింగ్‌తో సుధీర్, సుఖ్విందర్లపై ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. అయితే ఆమెను ఎందుకు చంపారనే కారణాన్ని మాత్రం నిందితులు ఇంకా వెల్లడించలేదని గోవా పోలీసులు చెప్తుండడం గమనార్హం. అయితే ఆర్థిక కారణాలే కారణం అయ్యి ఉంటాయని భావిస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే.. సోనాలి ఫోగట్ హత్యకు కారణమైన గోవా కర్లీస్ రెస్టారెంట్ గతంలోనూ ఓ ఫారిన్ అమ్మాయి దారుణ హత్యాచారానికి కారణమైంది కూడా. ఆ సమయంలోనూ ‘డ్రగ్స్’ కోణంలోనే ఈ పబ్‌పై ఆరోపణలు వెల్లువెత్తగా.. కాలక్రమంలో ఆ విషయాన్ని అంతా మరిచిపోయారు. గోవా మెడికల్ కాలేజీలో ఆమె మృతదేహానికి పరీక్షలు పూర్తి కావడంతో కుటుంబ సభ్యులకు అప్పగించారు. శుక్రవారం ఉదయం బంధువులు, అభిమానుల నడుమ ఆమె అంత్యక్రియలు జరిగాయి. సోనాలి కూతురు సైతం పాడె మోసి కన్నీటి పర్యంతం అయ్యింది. అంతకు ముందు తన తల్లికి న్యాయం చేయాలంటూ ఆమె ఓ వీడియోను విడుదల చేసింది. #SonaliPhogat's 15yrs old daughter demands justice; She said, "My mother should get justice. Proper investigation should be done. Culprit should get punished."pic.twitter.com/EzCbJVQ9KW — #BiggBoss_Tak👁 (@BiggBoss_Tak) August 26, 2022 ఇదీ చదవండి: తోక ఊపోద్దు, నాలుక కోస్తాం.. -
ప్రేమ పెళ్లి.. పుట్టింటి నుంచి భర్తతో కలిసి వెళ్లి..
మైసూరు(బెంగళూరు): ఓ వివాహిత మృతదేహం చెరువులో అనుమానాస్పద స్థితిలో బయటపడిన ఘటన మైసూరు నగరంలోని కలకలం రేగింది. వివరాలు...నగరంలోని విజయనగర్‌కు చెందిన అశ్వినీ (23), మైదనహళ్లికి చెందిన ప్రమోద్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అశ్వినీ ఏడు నెలల గర్భిణి. కొన్ని రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో అశ్వినీ పుట్టింటికి వచ్చింది. ఆదివారం ప్రమోద్ అత్తింటికి వచ్చి అశ్వినీని తీసుకుని బైక్‌పై వెళ్లాడు. సాయంత్రమైనా వారు రాకపోవడంతో అశ్వినీ తండ్రి కుమార్తెకు, అల్లుడికి ఫోన్ చేశాడు. వారు స్పందించలేదు. ఇదిలా ఉంటే సోమవారం ఉదయం బిళికెరె చెరువులో అశ్వినీ మృతదేహం బయటపడింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మరో ఘటనలో.. దోపిడీ దొంగల అరెస్ట్ శివాజీనగర: ఆటోలో తిరుగుతూ దోపీడీలకు పాల్పడుతున్న ఇద్దరిని సంపిగెహళ్లి పోలీసులు అరెస్ట్ చేసి రూ.2.15 లక్షలు విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. దోపిడీ దొంగలను శివాజీనగరకు చెందిన మహమ్మద్ ఆర్బాజ్, థణిసంద్రకు చెందిన సయ్యద్ ఆర్బాజ్గా గుర్తించారు. ఈనెల 5న రాత్రి ఆటోలో అమరజ్యోతి లేఔట్‌కు ఆటోల వచ్చిన వీరు ఓ వ్యక్తి మెడలో గొలుసు లాక్కొని ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేయగా వీరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తేలింది. వాహన దొంగలు అరెస్ట్: ఇళ్ల ముందు, పార్కింగ్ స్థలాల్లో ఆపి ఉంచిన బైక్‌లను ఎత్తుకెళ్తున్న షేక్ ముదాసీర్ అహమ్మద్, సయ్యద్ నాజీమ్లను సంపిగెహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి మూడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. -
అర్ధరాత్రి ప్రేయసిని కలిసేందుకు వెళ్లి చీకట్లో..
క్రిష్ణగిరి(బెంగళూరు): క్రిష్ణగిరి సమీపంలో యువకుడు అర్ధరాత్రి సమయంలో ప్రేయసిని కలిసేందుకెళ్లిన యువకుడు తీవ్ర గాయాలతో మృతి చెందాడు. సింగారపేట సమీపంలోని నాయకనూరుకి చెందిన మురుగన్ కొడుకు వెంకటేష్ (20) కూలీ పనులు చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన ఇతర వర్గానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తూ వచ్చాడు. (చదవండి: Bengaluru Traffic Police: ట్రాఫిక్ పోలీసుల తీరు.. ఏపీ వాహనం ఆపాల్సిందే ) ఆదివారం అర్ధరాత్రి సమయంలో కుటుంబసభ్యులకు తెలియక ప్రేయసిని కలిసేందుకెళ్లిన వెంకటేష్ సోమవారం ఉదయం తీవ్ర గాయాలతో శవమై కనిపించాడు. వెంకటేష్ బంధువులు సింగారపేట–అత్తిపాడి మార్గంలో ఆందోళన నిర్వహించారు. ఎస్పీ సాయ్‌చరణ్ తేజస్వి, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో చర్చించారు. ఒక పొలానికి ఉన్న కంచెలో ఇరుక్కుని మరణించాడని పోలీసులు చెప్పారు. పొలం యజమానిని అరెస్టు చేశారు. -
రెండేళ్లుగా కుళ్లిన వాసన.. తలుపు బద్ధలు కొట్టి చూస్తే షాక్
ఏమైందో ఏమోగానీ.. పాపం ఆ ఒంటరి పెద్దావిడ అస్థిపంజరంగా కనిపించి చుట్టుపక్కల వాళ్లకు షాక్ ఇచ్చింది. పైగా రెండున్నరేళ్లుగా ఆమె ఉండే పోర్షన్ నుంచి కంపు వాసన వస్తున్నా.. ఎవరూ పట్టించుకోలేదు. వాసనకు ఆ తలుపు బద్ధలు కొట్టే ప్రయత్నం చేయలేదు ఎవరు!. ఎందుకంటే.. లండన్‌లోని పెచ్‌కమ్‌లోని సెయింట్ మేరీస్ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మూడంతస్థుల భవనంలో సదరు మహిళ ఒంటరి(60 ఏళ్ల పైనే వయసు ఉంటుంది)గా ఉంటోంది. అయితే రెండేళ్లుగా ఆమె ఉంటున్న పోర్షన్ తలుపు మూతపడే ఉంది. పైగా ఆమె ఇంటి డోర్‌కి అడ్డంగా ఓ సైకిల్ పెట్టి ఉంది. దీంతో ఆమె ఇంట్లో లేదని అంతా అనుకున్నారు. అదే టైంలో దాదాపు రెండేళ్లుగా ఆ ఇంటి నుంచి దుర్వాసన వస్తూనే ఉంది. ఈ విషయాన్ని హౌజింగ్ అసోషియేషన్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా.. ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ముక్కు మూసుకుని అడ్జస్ట్ అవుతూ వస్తున్నారు. అయితే ఆ వాసన భరించడం వల్లకానీ ఓ యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఫిబ్రవరి 18వ తేదీన బలవంతంగా పోలీసులు డోర్లు బద్ధలు కొట్టి చూశారు. కుర్చీలో ఆ పెద్దావిడ అస్థిపంజరం కూర్చున్న పొజిషన్లో కనిపించడంతో అంతా షాక్ తిన్నారు. కుప్పలుగా లెటర్లు.. ఆవిడ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చి అక్కడ ఉంటుంది? అనే వివరాలు ఎవరికీ తెలియదు. కానీ, పొరుగింట్లో ఉండే ఓ యువతి మాత్రం తాను లేని టైంలో పార్శిల్స్‌ను రిసీవ్ చేసుకోమని ఆ పెద్దావిడ సాయం తీసుకునేదట!. అక్టోబర్ 2019లో చివరిసారి ఆమెను చూశానని ఆ యువతి చెప్తోంది. అప్పటి నుంచి ఆమె బయట ఎవరికీ కనిపించలేదట. కరోనా కావడంతో లండన్‌లోని చాలామంది తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. దీంతో ఆమె కూడా తన సొంతూరికి వెళ్లిపోయి ఉంటుందని అంతా భావించారు. కానీ, కొన్నాళ్లకు ఆమె ఇంటి నుంచి దుర్వాసన రావడం మొదలైంది. దీంతో ఇంటి డోర్‌కు గుడ్డలు అడ్డుపెట్టారట చుట్టుపక్కల వాళ్లు. అయితే ఆమె ఇంటి బయట కుప్పలుగా లెటర్లు, ఇంటి అద్దె బాకీ ఉన్నట్లు నోటీసులు పేరుకుపోయి ఉన్నాయి. చివరికి గ్యాస్ చెకింగ్‌కు వచ్చిన వాళ్లు సైతం డోర్‌కు నోటీసులు అంటించడంతో ఆమె జాడ గురించి చుట్టుపక్కల వాళ్లలో అనుమానాలు మొదలయ్యాయి. హౌజింగ్ అసోషియేషన్ ఎంతకీ విషయం పట్టించుకోకపోవడంతో.. ఓ యువతి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. పూర్తిగా కుళ్లిపోయి అస్థిపంజరం స్థితిలో ఆ పెద్దావిడ కనిపించింది. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె ఎవరు? ఏం జరిగి ఉంటుందనే విషయాలపై దృష్టి పెట్టారు. ఈ ఘటన లండన్‌లో హాట్ టాపిక్‌గా మారింది ఇప్పుడు. ఇదిలా ఉండగా.. ఇటలీలోనూ ఈ మధ్య ఇలాంటి ఘటనే ఒకటి జరగడం విశేషం. చదవండి: కామంతో స్నేహితుడి భార్యపై కన్నేశాడు! ఆపై పక్కా స్కెచ్ వేసినా.. -
ఆ ముగ్గురు ఎక్కడ..?
సాక్షి, సూర్యాపేట క్రైం: సూర్యాపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తూ.. విరామం సమయంలో కొత్త బస్టాండ్ వద్దకు వెళ్తున్న కానిస్టేబుల్ సుధాకర్‌గౌడ్ ప్రయాణిస్తున్న బైక్‌ను ముగ్గురు యువకులు బుల్లెట్‌పై వచ్చి ఢీకొట్టిన ఘటనలో సుధాకర్ మృతిచెందిన విషయం విధితమే. అయితే సుధాకర్ మృతికి కారణమైన ఆ ముగ్గురు యువకులు ఎక్కడ ఉన్నారు..? ఎలా ఉన్నారు..? అన్న అంశంపై ఎన్నో ప్రశ్నలు.. అనుమానాలు తలెత్తుతున్నాయి. సుధాకర్‌గౌడ్ మృతికి కారకులైన ఎరుకల దిలీప్, నరేందర్, ప్రవీణ్ పరిస్థితి ఏంటని ఆరా తీస్తే.. ఏ ఒక్కరికి కూడా బలమైన గాయాలు కాలేదని.. ఆ యువకులు మద్యంమత్తులో ఉండడంతోనే ఈ ఘటన జరిగినట్లుగా ప్రాథమికంగా గుర్తించామని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. ఎందుకు అదుపులోకి తీసుకోలేదని అడిగితే.. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. మిగతా ఇద్దరి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తే విచారణ కొనసాగుతుందని సమాధానం చెబుతున్నారు. ఖాకీవనంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ ప్రమాదంలో మృతిచెందినా.. న్యాయం చేసేందుకు అధికారులు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారోనని ఆ శాఖ సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. కానిస్టేబుల్ కుటుంబానికి న్యాయం చేయాల్సిందిపోయి.. మృతికి కారకులైన వారిని రక్షించే పనిలో నిమగ్నమైపోయినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బైక్ ఎవరు నడిపారన్నదానిపై విచారణ.. సుధాకర్‌గౌడ్ బైక్‌ను ఢీకొట్టిన బుల్లెట్‌ను ఆ ముగ్గురిలో నడిపి ఢీకొట్టిందెవరూ అన్నదానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆ సమయంలో బైక్ ఎవరునడిపారన్న దానిపై ముగ్గురిని ప్రశ్నిస్తున్నారు. రైడింగ్ ఎవరు చేసినా కూడా ముగ్గురిపై కేసు నమోదుచేశారు. ఏదీ ఏమైనా ఒకటి రెండు రోజుల్లో వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. ఏటీఎంలో డబ్బు డ్రా చేసేందుకు వస్తూ.. మద్యం, గంజాయి మత్తులో ఉన్న యువకులు ఎరుకల దిలీప్, ప్రవీణ్, నరేందర్ సరిగ్గా ఆదివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో బిర్యానీ తినేందుకు వెళ్లారు. అయితే హోటల్లో స్వైపింగ్ పనిచేయడం లేదని హోటల్ నిర్వహకులు తెలపడంతో అక్కడి నుంచి నేరుగా శంకర్ విలాస్ సెంటర్లోని ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసేందుకు బుల్లెట్‌పై వస్తూ కానిస్టేబుల్ సుధాకర్‌గౌడ్ వాహనాన్ని ఢీకొట్టారు. ఆస్పత్రికి తరలించడంలో.. కనికరం చూపని యువకులు ప్రమాదం జరిగిన సమయంలో కానిస్టేబుల్ సుధాకర్‌గౌడ్ పోలీస్ యూనిఫామ్‌లోనే ఉన్నారు. అయితే యువకులు కనీసం సుధాకర్‌ను ఆస్పత్రికి తరలించలేదు. కానిస్టేబుల్ సుధాకర్ బైక్‌పైనే ఈ ముగ్గురూ స్థానిక ఆస్పత్రికి చేరుకొని వైద్యం చేయించుకున్నారు. పోలీసులు అంటేనే భయం లేకుండా పోయే విధంగా యువకులు మద్యం, గంజాయి మత్తులో ఉండిపోతున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనం. పెట్రోలింగ్, గస్తీ పెంచుతాం సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా పెట్రోలింగ్, గస్తీ పెంచుతాం. రహదారులపై ముఖ్యంగా పోలీసులు నిత్యం గస్తీ తిరిగేలా ప్రణాళికలు రూపొందించాం. ప్రజలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. మద్యం సేవించి రహదారులపై వాహనాలు నడిపే వారిపై చట్టరిత్యా చర్యలకు వెనుకాడేదిలేదు. ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు. పోలీసు కానిస్టేబుల్ మృతికి కారణమైన వారిపై కేసు నమోదు చేశాం. – రావిరాల వెంకటేశ్వర్లు, ఎస్పీ, సూర్యాపేట -
ఆ రోజు ఏం జరిగింది?
అలెగ్జాండర్ ది గ్రేట్.. జగజ్జేత.. ప్రపంచాన్ని జయించిన మహావీరుడు.. మరి అంతటి వీరాధివీరుడు ఎలా చనిపోయాడు.. ఏదో ఇన్ఫెక్షన్ సోకి అని కొందరు.. తాగుడు అలవాటు వల్ల అని ఇంకొందరు.. అబ్బే.. ఇదేం కాదు.. విషమిచ్చి చంపారని మరికొందరు.. ఎవరేం చెప్పినా.. మొత్తానికి అదో మిస్టరీ అయి కూర్చుంది.. 2,300 ఏళ్లనాటి ఈ మిస్టరీని తాను ఛేదించానని చెబుతున్నారు న్యూజిలాండ్‌లోని ఒటాగో వర్సిటీకి చెందిన పరిశోధకురాలు కేథరీన్ హాల్. అంతేకాదు.. ఇప్పటివరకూ అందరూ చెబుతున్నట్లుగా క్రీ.పూ. 323 జూన్ 10న లేదా 11న అలెగ్జాండర్ చనిపోలేదట. అతడు చనిపోయినట్లు ప్రకటించిన తేదీకి ఆరు రోజుల అనంతరం మరణించాడట. కానీ.. అప్పటి వైద్యుల తప్పుడు నిర్ధారణ వల్ల బతికుండగానే.. అలెగ్జాండర్ చనిపోయినట్లు ప్రకటించారట. సంచలనం రేకెత్తిస్తున్న ఈ అధ్యయనం తాలూకు వివరాలు ‘ది ఏన్షియెంట్ హిస్టరీ బులెటిన్’లో ప్రచురితమయ్యాయి. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపింపజేసే ఆ అధ్యయనం తాలూకు వివరాలేంటో చూసేద్దామా.. డాక్టర్ కేథరీన్ హాల్.. ఒటాగో వర్సిటీలోని డ్యూన్డిన్ స్కూల్ ఆఫ్ మెడిసన్‌కు చెందిన సీనియర్ లెక్చరర్. ఆమె చెప్పినదాని ప్రకారం.. అలెగ్జాండర్‌కు గులియన్ బారే సిండ్రోమ్ వచ్చింది.. అప్పటికాలంలో కామన్‌గా ఉండే ఒకరకమైన బ్యాక్టీరియా వల్ల ఇది ఆయనకు సోకింది. గులియన్ బారే సిండ్రోమ్ అన్నది నరాలకు సంబంధించిన ఓ అరుదైన రుగ్మత. ప్రతి లక్ష మందిలో ఒకరికి వచ్చే అవకాశముంది. దీని వల్ల నాడీ వ్యవస్థపై రోగ నిరోధక వ్యవస్థ దాడి చేస్తుంది.. దాంతో అలెగ్జాండర్ ఒళ్లంతా పక్షవాతం వచ్చింది. బుర్ర పనిచేస్తుంది కానీ.. మనిషి మాత్రం చచ్చిన శవంలాగ అయిపోయాడు. దీంతో వైద్యులు అలెగ్జాండర్ చనిపోయినట్లు ప్రకటించారు. వాస్తవానికి అతడు బతికే ఉన్నాడు. చనిపోయాడని ప్రకటించిన తేదీ నుంచి ఆరు రోజుల తర్వాత అతను మరణించాడు. ‘అలెగ్జాండర్ మరణంపై వచ్చిన పాత వాదనలన్నీ ఒట్టి ట్రాష్. ఎందుకంటే.. అవి మొత్తం ఎపిసోడ్‌ను వివరించలేదు. అప్పటికాలంలో వైద్యులు మనిషి బతికున్నాడా లేదా అన్నది నిర్ధారించేందుకు శ్వాస ఆడుతోందా లేదా అన్నదే చూసేవారు. పల్స్‌ను పరీక్షించేవారు కాదు.. గులియన్ బారే సిండ్రోమ్ వల్ల ఒళ్లంతా పక్షవాతం వచ్చింది. దీంతో ఆక్సిజన్ చాలా తక్కువ స్థాయిలో అవసరం పడేది. దీని వల్ల శ్వాస తీసుకున్నా.. తెలిసీ తెలియనట్లు ఉండేది. అదే అప్పటి తప్పుడు నిర్ధరణకు‘ కారణం’ అని కేథరీన్ తెలిపారు. అంతేకాదు.. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అతడి శరీరం కుళ్లకపోవడాన్ని ఆమె గుర్తు చేశారు. ‘దీనికి సంబంధించి చరిత్రలో సరైన వివరణ ఇప్పటికీ లేదు. ఆరు రోజుల వరకూ అతడి శరీరం తాజాగానే ఉంది. దీనికి కారణం అప్పటికీ అలెగ్జాండర్ బతికి ఉండటమే. కాకపోతే.. గ్రీకులు అతడిని దేవుడిగా భావించేవారు. దీంతో ఆ మహిమ వల్లే అలెగ్జాండర్ శరీరం తాజాగా ఉందని నమ్మారు’ అని ఆమె వివరించారు. తన పరిశోధన కొత్త చర్చకు తెరలేపుతుందని.. అవసరమైతే.. చరిత్ర పుస్తకాలను తిరగరాయాల్సి ఉంటుందని కేథరీన్ అంటున్నారు. ఏమోమరి.నిజానిజాలు ఆ అలగ్జాండర్కే ఎరుక. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
శ్రీదేవి చనిపోయాక బోనీ ఫస్ట్ ఫోన్‌కాల్
సాక్షి, న్యూఢిల్లీ : నటి శ్రీదేవి చనిపోయిన రోజు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తేలితే తప్ప ఈ కేసు ఓ కొలిక్కి వచ్చేలా కనిపించటం లేదు. ఈ పరిస్థితుల్లో బోనీ కపూర్‌ను విచారణ చేపట్టాలని దుబాయ్ ప్రాసిక్యూషన్ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే కేవలం ఆయన కాల్ డేటాను పరిశీలించిన అధికారులు.. కాల్ లిస్ట్‌లో ఎక్కువ సార్లు ఎంపీ అమర్ సింగ్ నంబర్ ఉన్నట్లు గుర్తించారు. దీనిపై ఓ జాతీయ మీడియా అమర్ సింగ్‌ను ఆరా తీసేందుకు ప్రయత్నించింది. ‘అర్ధరాత్రి 12గం.40ని. సమయంలో బోనీ కపూర్ నాకు కాల్ చేశారు. సెల్‌ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉండటంతో నేను గుర్తించలేకపోయా. తర్వాత నా ల్యాండ్ నంబర్‌కు ఫోన్ చేశారు. ‘బాబీ ఇక లేదు’ అని గద్గద స్వరంతో ఆయన నాకు చెప్పారు. అయితే అది మాట్లాడే తరుణం కాదనుకుని ఫోన్ పెట్టేశాను. బహుశా ఆ వార్త బోనీ మొదట చెప్పింది నాకే అయి ఉండొచ్చని భావిస్తున్నా’ అని అమర్ సింగ్ పేర్కొన్నారు. ‘శ్రీదేవి-బోనీ కుటుంబంతో నాకు అవినాభావ సంబంధం ఉంది. ఇది నిజంగా ఎవరూ ఊహించని ఘటన. అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఇలా జరిగింది. వారికి ఎలాంటి అప్పులు లేవు. ఆర్థికంగా వారి పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది’ అని అమర్ సింగ్ తెలిపారు. ఇక్కడో ఆసక్తికర విషయం ఏంటంటే... శ్రీదేవి చనిపోయే ముందు రోజు బోనీ కపూర్, అమర్‌సింగ్‌లు లక్నోలో ఇన్వెస్టర్ల సమ్మిట్‌కు హజరు అయ్యారు. అయితే అక్కడ అమర్ సింగ్‌కు అవమానం జరగటంతో ఆయన బహిష్కరించి ఢిల్లీకి వెళ్లిపోగా.. బోనీ శ్రీదేవి సర్ప్రైజ్ డిన్నర్ కోసం దుబాయ్ వెళ్లినట్లు ఆ కథనం ఉటంకించింది. ఇక ఇప్పటిదాకా కేవలం ఆయన కాల్ డేటాను పరిశీలించిన దుబాయ్ పోలీసులు అసలు బోనీ కపూర్‌ను విచారణే చేపట్టలేదని ఖలీజ్ టైమ్స్ కథనం ప్రచురించింది. ఆదివారం మృతదేహానికి పరీక్షలు నిర్వహించే సమయంలో కేవలం ఎలా జరిగింది అన్న వివరణ తీసుకుని బోనీని హోటల్‌కు పంపించేశారంట. కేసు ప్రాసిక్యూషన్ విభాగానికి అప్పజెప్పిన నేపథ్యంలో నేడు ఇంటరాగేషన్ కోసం బూర్ దుబాయ్ పోలీస్ స్టేషన్‌కు రావాల్సిందిగా బోనీని కోరినట్లు సమాచారం. శ్రీదేవికి మద్యం అలవాటు లేదు -
ఢిల్లీలో మిస్టరీ.. ఇన్సులిన్ ఎక్కించి హత్య?
సాక్షి, చెన్నై: ఉన్నత చదువుకు ఢిల్లీ వెళ్తున్న తమిళ విద్యార్థులకు భద్రత కరవు అవుతోంది. ప్రధానంగా వైద్య కోర్సుల్ని అభ్యషించేందుకు వెళ్తున్న విద్యార్థుల మరణాలు ఓ మిస్టరీగా మారుతున్నాయి. ఏడాదిన్నర క్రితం తిరుప్పూర్‌కు చెందిన శరవణన్ మరణం కలకలం రేపగా, ప్రస్తుతం శరత్ ప్రభు మరణం ఆందోళనలో పడేసింది. విషం ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసి ఉండొచ్చన్న అనుమానాలకు బలం చేకూరే రీతిలో శరవణన్ మరణ మిస్టరీ విచారణ కొలిక్కి వస్తున్నది. ఈ సమయంలో అదే తిరుప్పూర్‌కు చెందిన మరో విద్యార్థి శరత్ ప్రభు విగతజీవిగా మారడం ఉన్నత చదువు నిమిత్తం ఢిల్లీలో ఉన్న తమిళ విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన తప్పడం లేదు. నిన్న శరవణన్.. నేడు శరత్.. దేశ రాజధాని నగరం ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆస్పత్రుల్లో ఒకటి. ఇందులో ఢిల్లీ విద్యార్థులే కాదు, తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు వైద్య ఉన్నత విద్యను అభ్యషిస్తున్నారు. ఏడాదిన్నర క్రితం తిరుప్పూర్‌కు చెందిన వైద్య పీజీ ఎండీ విద్యను అభ్యషిస్తున్న శరవణన్ అనుమానాస్పద మరణం తమిళనాట కలకలాన్ని రేపింది. ఆ కేసు విచారణ నేటికీ సాగుతోంది. ఇది ముమ్మాటికి హత్యేనని వాదించే వాళ్లు ఎక్కువే. రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలు, సంస్థలు, రాజకీయ పార్టీల పట్టుతో వ్యవహారం కోర్టుకు సైతం చేరింది. కోర్టు రీ పోస్టుమార్టం ఆదేశాలతో వచ్చిన నివేదికలో ఇన్సులిన్ ద్వారా హత్య చేసి ఉండడానికి కారణాలు ఉన్నట్టుగా తేలింది. దీంతో అనుమానాలకు బలం చేకూరే విధంగా కోర్టు విచారణ సాగుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలో బుధవారం అదే తిరుప్పూర్‌కు చెందిన శరత్ ప్రభు(25) మరణం ఢిల్లీలో తమిళ విద్యార్థులకు భద్రత కరువైందన్న విషయాన్ని తేట తెల్లం చేసింది. శరత్ మరణంతో ఆందోళన: తిరుప్పూర్ జిల్లా పారప్పాళయం మంగళం సమీపంలోని ఇడువం పాళయం ప్రాంతానికి చెందిన సెల్వమణి , ధనలక్ష్మి దంపతుల కుమారుడు శరత్ ప్రభు(25) కోయంబత్తూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. తాను చదువుకున్న చదువు, మార్కులు, ప్రతిభకు గాను ఢిల్లీ ఎయిమ్స్ పరిధిలోని యూసీఎంఎస్ వైద్య కళాశాలలో ఎండీ ఉన్నత కోర్సు సీటు దక్కించుకున్నారు. చివరి సంవత్సరం చదువుకుంటున్న శరత్ బాత్ రూమ్‌లో జారి పడ్డట్టు, మరి కాసేట్లో మరణించినట్టు వచ్చిన సమాచారం ఆ కుటుంబంలోనే కాదు ఢిల్లీలో ఉన్నత కోర్సుల్ని అభ్యషిస్తున్న తమిళ విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన బయలు దేరింది. అనుమానాలు.. ప్రతిరోజూ తల్లిదండ్రులతో మాట్లాడే శరత్ ప్రభు మంగళవారం కూడా అదే చేశాడు. రాత్రి పదిన్నర గంటల వరకు తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి నిద్రకు ఉపక్రమించాడు. ఢిల్లీలోని యూసీఎంఎస్ కళాశాల హాస్టల్లో ఉంటున్న సహచర విద్యార్థుల నుంచి ఉదయాన్నే వచ్చిన ఫోన్‌కాల్ సెల్వమణి, ధనలక్ష్మి దంపతుల్ని కలవరంలో పడేశాయి. బుధవారం ఉదయం బస చేసి ఉన్న గదిలోని బాత్రూమ్లో శరత్ కింద పడ్డట్టు, ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్టుగా తొలుత ఓ ఫోన్‌కాల్ రావడం, మరి కాసేపటికి బాత్రూమ్లో పడి మరణించినట్టుగా వచ్చిన సమాచారాలతో ఆ కుటుంబం కన్నీటి సంద్రంలో మునిగింది. సహచర విద్యార్థుల నుంచి వచ్చిన పొంతన లేని సమాచారాలతో శరత్ మరణంలో అనుమానాలు బయలు దేరాయి. అదే సమయంలో శరత్ ప్రభు తండ్రి సెల్వమణి దృష్టికి కళాశాల నిర్వాహకులు తెచ్చిన సమాచారంలోనూ అనుమానాలు కొట్టొచ్చినట్టు కన్పించడంతో ఢిల్లీలో ఏదో జరిగిందన్న ఆందోళన తప్పడం లేదు. తక్షణం విమానం ద్వారా ఢిల్లీకి సెల్వమణి, ఆయన స్నేహితులు బయలు దేరి వెళ్లారు. శరవణన్ మరణ సమాచారం తరహాలోనే శరత్ మరణ సమాచారాలు ఉండడంతో ఇన్సులిన్ వేసి హతమార్చి, నాటకం సాగుతున్నదా అన్న అనుమానాల్ని వ్యక్తం చేసే వాళ్లు అధికమే. ముమ్మాటికి హత్యే.. శరత్ ప్రభు మరణ సమాచారంతో గతంలో తనయుడు శరవణన్‌ను కోల్పోయిన తండ్రి గణేషన్ మీడియా ముందుకు వచ్చారు. తన కుమారుడి వేల శరత్‌ను కూడా హతమార్చి నాటకం సాగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తాను న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నానని, అందులో నిజాలు బయటకు వస్తున్నాయన్నారు. తమిళ విద్యార్థులకు ఢిల్లీలో భద్రత లేనే లేదని గతంలోనూ చెప్పాను అని, ఇప్పుడు కూడా తాను చెబుతున్నానని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ, తమిళ ప్రభుత్వం చోద్యం చూస్తున్నాయని, విద్యార్థులకు భద్రత కల్పించడంలో విఫలం అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా మరో తమిళ విద్యార్థి బలి కాకుండా భద్రత కల్పించాలని, ఇందుకు విద్యార్థిలోకం గళం విప్పాలని పిలుపునిచ్చారు. ఈ మరణాల గురించి సీఎం పళనిస్వామిని మీడియా ప్రశ్నించగా, ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదవుకుంటున్న విద్యార్థులు తమ పేర్లను రాష్ట్ర ప్రభుత్వంలో నమోదు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఎవరు ఎక్కడ చదువుకుంటున్నారో అన్న గందరగోళం తప్పడం లేదన్నారు. ఇకనైనా తమ పేర్లను విద్యార్థులు నమోదు చేసుకోవాలని, విద్యార్థులకు భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
రూమ్ నంబర్ 345.. అవసరం తీరింది
సాక్షి, న్యూఢిల్లీ : లీలా ప్యాలెస్ హెటల్ యాజమాన్యానికి ఎట్టకేలకు ఊరట లభించింది. సునంద పుష్కర్ మృతి కేసులో ఆ హోటల్లోని గదిని దాదాపు నాలుగేళ్లుగా సీల్ చేసి ఉంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు సోమవారం గదిని తెరిచి హోటల్ యాజమాన్యానికి అప్పగించారు. 2014 జనవరి 17న కాంగ్రెస్ సీనియర్ నేత, శశిథరూర్ భార్య సునంద పుష్కర్(51) హోటల్ గది నంబర్ 345లో అనుమానాదాస్పద స్థితిలో మృతి చెందింది. కాగా, ఏడాది దర్యాప్తు అనంతరం ఆమెకు విషమిచ్చి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించసాగారు. ఆమె చనిపోయిన నాటి నుంచే ఆ గదిని సీల్ చేసి తమ ఆధీనంలోఉంచుకున్నారు. విచారణ పేరిట తరచూ హోటల్‌కు వెళ్లి ఆ గదిని పరీశించారు కూడా. అయితే మూడేళ్లుగా ఇలా గదిని మూసేయటం ద్వారా గది పాడైపోయిందని.. పైగా అది వ్యాపారం మీద కూడా ప్రభావం చూపుతోందని హోటల్ యాజమాన్యం ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. అంతేకాదు ఆర్థికంగా కూడా తమకు చాలా నష్టం కలిగిందని పిటిషన్లో పేర్కొంది. ఈ క్రమంలో అక్టోబర్ 10న ఈ పిటిషన్ విచారణకు రాగా.. గదిని తిరిగి హోటల్‌కు అప్పగించేయాలని ఆరు రోజుల గడువు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు దాదాపు పూర్తయి పోవటం.. ఇప్పటికే సాక్ష్యాలు సేకరించటంతోపాటు... ఎలాగూ ఫోరెన్సిక్ తుది నివేదిక త్వరలో రానున్న నేపథ్యంలో ఇంకా హోటల్ యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదని కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో దాదాపు మూడున్నరేళ్ల తర్వాత మూసిన తలుపులను తెరిచారు. -
పట్టాలపై గ్యాంగ్‌స్టర్ కొడుకు శవం
సాక్షి, ముంబై : ప్రముఖ గ్యాంగ్స్టర్లకు, మోస్ట్ వాంటెడ్ నేరస్థులకు ఆశ్రయం కల్పించిన ముఠాకు సంబంధించిన వ్యక్తి మరణం ముంబైలో ఒక్కసారిగా కలకలం రేపింది. బాగా పాపులర్ అయిన గోల్డెన్ గ్యాంగ్‌కు చెందిన 32 ఏళ్ల గితేశ్ ఖోపడే సెవర్రి రైల్వే స్టేషన్ వద్ద పట్టాలపై శవంగా కనిపించాడు. గోల్డెన్ గ్యాంగ్ నాయకుడు చంద్రకాంత్ ఖోపబే అలియాస్ బబ్య ఖోపడే కొడుకే గితేశ్ ఖోపడే. ఓవైపు మిల్ కాంపౌండ్‌ను నిర్వహిస్తూనే తండ్రి ముఠాకి సాయం చేస్తుండేవాడన్న ఆరోపణలు గితేశ్‌పై వినిపించేవి. హాజీ మస్తాన్, వరదరాజన్ ముదలియర్ లాంటి ఫేమస్ డాన్లకు గోల్డెన్ గ్యాంగ్ రక్షణ కల్పించేదని అప్పట్లో చెప్పుకునే వారు. అలాంటి గ్యాంగ్ ప్రధాన నేత తనయుడు సోమవారం ఉదయం పట్టాలపై శవమై తేలాడని స్థానిక పోలీసులు చెబుతున్నారు. అయితే తండ్రికి గితేశ్ ఎలాంటి సాయం చేశాడన్నదానిపై స్పష్టత లేదని పోలీసులు అంటున్నారు. గత కొంతకాలంగా అల్లర్లకు, గొడవలకు దూరంగా ఉంటున్న గితేశ్, లోవర్ పరేల్ ప్రాంతంలోని షాపుల మీద వచ్చే అద్దెతో జీవనాన్ని వెల్లదీస్తున్నాడు. గితేశ్‌ను ఎవరో హత్య చేసి పట్టాలపై పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. -
కన్న తల్లే హంతకురాలు
► కవల పిల్లల అనుమానాస్పద మృతిని ఛేదించిన పోలీసులు ► భర్తకు పక్షవాతం, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం ► తాను చావాలనుకుని ముందు పిల్లలను చంపిన వైనం దోమకొండ (కామారెడ్డి) : బీబీపేట మండల కేంద్రంలో కవల పిల్లల అనుమానాస్పద స్థితిలో మృతిని పోలీసులు ఛేదించారు. కన్నతల్లే పిల్లలను చంపినట్లు ఇన్చార్జి సీఐ శ్రీధర్ కుమార్ బుధవారం దోమకొండలో విలేకరుల సమావేశంలో తెలిపారు. బీబీపేటకు చెందిన దంపతులు కల్పన, యాదగిరికి ఏడాది వయసున్న కవల పిల్లలు జైనిష్, జైనిత్ ఉన్నారు. వీరు గత ఏడాది నవంబర్ 30న అనుమానాస్పద స్థితిలో మృతిచెం దారు. తల్లినే అనుమానించి పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. దీంతో పిల్లలను చంపింది తానేనని కల్పన ఒప్పుకుంది. కల్పన భర్త యాదగిరికి సంవత్సరం క్రితం çపక్షవాతం వచ్చి కాలు, చేయి చచ్చుబడిపోయాయి. కుటుంబ పరిస్థితి భారంగా మారి పూట గడవడం కష్టమైంది. కల్పన జీవితంపై విరక్తి చెంది చనిపోవాలనుకుంది. తాను చనిపోతే తన పిల్లల భవిష్యత్తు ఏమిటని, ముందు పిల్లలను చంపాలనుకుంది. ఉదయం పిల్లలకు పాలు బిస్కట్లు తినిపించి పడుకోబెట్టింది. వారు పడుకున్నాక ఊపిరి ఆడకుండా ముక్కు మూసి చంపేసింది. అనంతరం తాను చనిపోవాలనుకునే సమయానికి ఇంటికి బంధువులు వచ్చారు. ఏం చేయాలో తెలియక కావాలనే ఎవరో తన పిల్లలను చంపారని బుకాయిం చింది. బంధువులు రాకపోతే తాను చనిపొయేదానినని విచారణలో కల్పన వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. కల్పనను అరెస్ట్ చేసి రిమాండ్‌కు çపంపారు. సమావేశంలో దోమకొండ ఎస్సై నరేందర్, బీబీపేట ఎస్సై రవిబాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
మిస్టరీగా మారిన కావ్యశ్రీ మరణం
-
విషమిచ్చే చంపేశారా?
ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ మేన్. అతని పంచ్ పవర్‌కు కొండలు కూడా పిండి పిండి అవుతాయి. అతని ముందుకు రావాలంటే మరణానికి కూడా చచ్చేంత భయం. అందుకేనేమో చావు అతన్ని దొంగదెబ్బ తీసింది. ఆయన ఎవరో కాదు మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ ‘బ్రూస్ లీ’. తక్కువ సమయంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించిన వ్యక్తి బ్రూస్లీ. అతని గురించి తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అలాంటి గ్రేట్ పర్సన్ అర్ధాంతరంగా కన్ను మూశాడు. అతని మరణం వెనుక రహస్యం ఏమిటో ఈరోజు ‘మిస్టరీ’లో తెలుసుకుందాం. అది 1970 జూలై 20...‘గేమ్ ఆఫ్ ది డెత్’ సినిమాపై చర్చలు జరపడానికి డైరెక్టర్ రేమండ్ చో.. బ్రూస్ లీ ఇంటికి వచ్చాడు. సాయంత్రం దాకా చర్చలు జరిగాయి అక్కడి నుండి ఇద్దరూ కలిసి హీరోయిన్ ‘బెట్టి టింగ్’ ఇంటికి వెళ్ళారు. కొద్ది సేపు స్క్రిప్టు గురించి మాట్లాడుకున్నారు. ఆ తరువాత బ్రూస్ లీని బెట్టి ఇంట్లో వదిలేసి రేమండ్ చో.. జేమ్స్ బాండ్ స్టార్ జార్జి లాటిన్ బీని కలవడానికి వెళ్ళాడు..బ్రూస్ లీ ని తరువాత రమ్మనాడు. అప్పుడు సమయం రాత్రి 7:30 తలనొప్పితో బ్రూస్ విలవిలలాడుతున్నాడు. బెట్టి టాబ్లెట్ ఇచ్చింది.. తలనొప్పి తగ్గడానికి బెట్టి టింగ్ ఈక్వజేసిక్ టాబ్లెట్‌ని ఇచ్చింది. అది వేసుకుని బ్రూస్ లీ పడుకున్నాడు. కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్నాడు. సమయం రాత్రి 9 గంటలు బ్రూస్ లీ వస్తాడని ఎదురు చూస్తున్న రేమండ్ చో.. బెట్టీకి ఫోన్ చేసాడు. బ్రూస్ ఇంకా ఎందుకు రాలేదు అని అడిగాడు. దీంతో బెట్టి బ్రూస్ లీని నిద్రలేపడానికి ప్రయత్నించింది. కానీ బ్రూస్ లేవలేదు. బెట్టి రేమండ్‌కి పిరిస్థితిని వివరించింది. అరగంట తరువాత అక్కడికి వచ్చిన రేమండ్ బ్రూస్ లీని నిద్రలేపడానికి ప్రయత్నించాడు. కానీ అతడు కళ్ళు తెరవలేదు. కాసేపటికే బెట్టి డాక్టర్ వచ్చాడు. బ్రూస్ కండీషన్ చాలా సీరియస్‌గా ఉందని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పాడు. అప్పటికే సమయం రాత్రి 10 దాటింది. కాని రాత్రి సమయంలో నీడ అయినా విడిచిపెట్టి పోతుంది కాని మరణం మాత్రం బ్రూస్లీని వెంటాడుతూనే ఉంది. హీరోయిన్ ‘బెట్టి టింగ్’ లెజెండ్‌ను మృత్యువు మింగేసింది.. అపస్మారక స్థితిలో ఉన్న బ్రూస్లీని వార్దిదరూ ఆసుపత్రికి తీసుకెళ్లారు. క్వీన్ ఎలిజిబెత్ ఆసుపత్రిలో అప్పటికే సిద్దంగా ఉన్న డాక్టర్లు బ్రూస్కి చికిత్స మొదలు పెట్టారు. బతికించడానికి ఎంతగానో ప్రయత్నించారు. కానీ లాభం లేకపోయింది. రాత్రి 11 గంటలు సమయంలో కోట్లాది అభిమానులు తట్టుకోలేని విషాద వార్తను చెప్పడానికి రేమండ్ చో ప్రిపేర్ అయ్యాడు. ‘బ్రూస్ లీ ఈజ్ డెడ్’.. అవును హ్యూమన్ డ్రాగన్ బ్రూస్ లీ చనిపోయాడు. లెజండ్ని మృత్యువు మింగేసింది. టాబ్లెట్టే కారణమా? తలనొప్పిగా ఉన్నప్పుడు హీరోయిన్ బెట్టి ఇచ్చిన టాబ్లెట్‌తో బ్రూస్లీ చనిపోయాడా? దీనికి సమాధానం మాత్రం ‘కాదు’..అని అనలేం. ఎందుకంటే బ్రూస్ వేసుకున్న ఈక్వజేసిక్ టాబ్లెట్ అతణ్ని చంపేసిందని ప్రాథమికంగా వైద్యులు నిర్ధారించారు. టాబ్లెట్ రియాక్షన్ అవడంతో మెదడులోకి నీరు చేరింది. సెరెబ్రల్ ఎడెమా బ్రూస్ లీని బలి తీసుకుంది. కాని ఈ కారణాన్ని మాత్రం చివరి నివేదికలో వైద్యులు వెల్లడించలేదు. దీంతో అభిమానులకు బ్రూస్లీ మరణంపై అనుమానాలు మొదలయ్యాయి.. బ్రూస్లీ ఫ్యామిలీ ఎవరీ బ్రూస్లీ..? నవంబర్ 27, 1940 సాన్ ఫ్రాన్సిస్కో అమెరికాలో లీయోచూన్, గ్రేసీలకు బ్రూస్ లీ జన్మించాడు. లీయోచూన్ చైనీయుడు, హాంకాంగ్ లో ఉంటాడు. తల్లి చైనీస్ సంతతికి చెందిన జర్మన్. వీరిద్దరూ కళాకారులే. ఓ ప్రదర్శన కోసం అమెరికాలో ఉన్నప్పుడు వాళ్లకు బ్రూస్ లీ పుట్టాడు. అప్పట్లో హాంకాంగ్ బ్రిటీష్ పాలనలో ఉండేది. అక్కడ చాలా మంది వలస వచ్చి ఉండేవారు. అక్కడి వారు గ్రూపులు గా చేరి వలస వచ్చిన వారిపై దాడికి దిగేవారు. అయితే ఇటువంటి పరిస్థితే బ్రూస్లీ కుటుంబానికి ఎదురైంది. బ్రూస్ 13 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు అతనిపై దాడి చేశారు. బ్రూస్ తల్లి జర్మన్ కావడమే ఇందుకు కారణం. దీంతో ఆత్మరక్షణ కోసం తండ్రి దగ్గర నుంచి ‘థామ్ చీ చువాన్ ’ అనే యుద్ధ విద్యను నేర్చుకున్నాడు. కొన్ని రోజుల తరువాత సైకో ఇప్ మెన్ దగ్గర స్టూడెంట్‌గా చేరాడు. కుంఫులో భాగమైన ‘వింగ్ చున్’ లో ఇప్మెన్ను ఎదురించే వారే లేరు. కానీ ఓ జర్మన్ జాతీయురాలికి పుట్టిన బ్రూస్ లీ కి ‘వింగ్ చున్’ నేర్చుకోడానికి వీలు లేదంటూ చైనీయులు అభ్యంతరం చెప్పారు. ఇప్మెన్పై ఒత్తిడి తేవడంతో శిక్షణ ఆగిపోయింది. కాని ఎవ్వరికీ తెలీకుండా బ్రూస్కి ఇప్ మెన్ శిక్షణ ఇచ్చాడు. ఆ తరువాత బాక్సింగ్, డాన్సింగ్, కత్తి సాముల్లో నైపుణ్యం సాధించాడు. ఇవన్నీ 18 సంవత్సరాల వయస్సులోనే నేర్చుకొని కదిలే కత్తిలా మారాడు. 1964లో లిండా ఎమెరీని పెళ్లి చేసుకున్నాడు. అనంతరం 1965లో మార్షల్ ఆర్ట్స్ అకాడమీని ప్రారంభించి.. జీత్ కున్ డోను రూపొందించాడు. పసివాడిగా ఉన్నప్పుడే గోల్డెన్ గర్ల్ సినిమాలో కనిపించాడు. 18 సంవత్సరాల నాటికే 12 సినిమాలు పూర్తి చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాడు. నిర్మాతలే చంపేశారా? గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందిన బ్రూస్లీ మరణానికి కారణం ఏమిటో ఎవ్వరికీ తెలియలేదు. బెట్టి ఇంట్లోనే మరణించాడు కాబట్టి బెట్టి విషం ఇచ్చి చంపేసిందని కొంతమంది అనుమానం. బ్రూస్ మరణం వెనుక హాంకాంగ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్లు మాఫియాతో చేతులు కలిపి బ్రూస్ లీని అంతం చేసారన్నది చాలా మంది నమ్మకం. దీనికి బెట్టి సహాయం చేసిందని కూడా అంటారు. అతని మరణానికి ఈక్వజేసిక్ రియాక్షన్ కారణం కాదని బ్రూస్ పర్సనల్ డాక్టర్ తెలిపారు. బ్రూస్ లీ పై షావోలీన్ మాస్టర్‌కు కోపం అందుకే వారే చంపేశారని చాలా మంది నమ్ముతున్నారు. కానీ నేటికి బ్రూస్ మరణం మిస్టరీగానే ఉండిపోయింది. – సాక్షి, స్కూల్ ఎడిషన్ -
వీడని మిస్టరీ
జాస్మిన్, శ్రీసాయి మృతిపై విచారణ ముమ్మరం నిందితుడు పవన్ చెబుతున్న ఆంశాలపై పోలీసుల దృష్టి జాస్మిన్ సోదరుడు, బంధులను గోప్యంగా విచారణ చేస్తున్న పోలీసులు రేపల్లె : నిజాంపట్నం మండలం అడవులదీవి గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్న షేక్ జాస్మిన్, వేముల శ్రీసాయి మృతి మిస్టరీ వీడలేదు. జాస్మిన్ మృతి ఘటనలో నిందితులుగా ఉన్న వేముల శ్రీసాయి, జొన్న పవన్‌కుమార్‌లను చెట్టుకు కట్టేసి కొట్టారు. దీంతో శ్రీసాయి మృతిచెందాడు. జాస్మిన్ బంధువులు తీవ్రంగా కొట్టటం వల్లే శ్రీసాయి మృతి చెందాడని పోలీసులు నిర్ధారించారు. శ్రీసాయి మృతి కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరికొంత మందిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. శ్రీసాయి మృతి కేసులో విచారణ ఒక కొలిక్కి వచ్చినట్లేననే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే జాస్మిన్ మృతి మిస్టరీ మాత్రం మీడలేదు. ఉరి వేసుకుని జాస్మిన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు జొన్న పవన్‌కుమార్ చెబుతున్నాడు. ఆదివారం జాస్మిన్ తన పుట్టినరోజని, ఇంట్లో ఎవరు లేరని, రావాలని శ్రీసాయికి ఆమె స్నేహితురాలితో ఫోన్ చేయించిందని పవన్‌కుమార్ తెలిపాడు. జాస్మిన్, శ్రీసాయి కొంత కాలంగా ప్రేమించుకుంటున్న విషయం వాస్తవమని, దీంతో శ్రీసాయి, తాను జాస్మిన్ ఇంటికి వెళ్లామని చెప్పినట్లు తెలిసింది. ఇంట్లో ఉండగా... జాస్మిన్ ఇంటి నుంచి తాను, ఆమె స్నేహితురాలు బయటకు వెళ్లిపోయామని పవన్‌కుమార్ చెబుతున్నాడు. ఇంట్లో శ్రీసాయి, జాస్మిన్ ఉన్న సమయంలో ఆమె బంధువు గౌస్ తలుపు కొట్టగా.. శ్రీసాయిని వెనుక డోర్ నుంచి పంపించిందని వివరించాడు. కొద్దిసేపటికి శ్రీసాయికి జాస్మిన్ ఫోన్ చేసి ‘నీవు ఇంటికి వచ్చిన విషయం గౌస్ చూసి మా అన్నకు పోన్ చేసి చెప్పాడు. మా అన్న నాకు ఫోన్ చేసి తిట్టి చావమన్నాడు. ఇక నాకు బతకాలని లేదు. చనిపోతున్నాను..’ అని చెప్పిందని తెలిపాడు. వెంటనే శ్రీసాయి, తాను వెళ్లి జాస్మిన్ స్నేహితురాలిని కలిసి విషయం చెప్పి వెళ్లి ఏమి చేస్తుందో చూసి రావాలని పంపామని చెప్పాడు. అమె ఇంట్లోకి చూసే సరికి జాస్మిన్ ఫ్యాన్‌కు ఉరి పెట్టుకుని ఉన్నట్లు వచ్చి చెప్పిందని, వెంటనే వెళ్లి పక్కనే ఉన్న ఇద్దరు వృద్ధులకు విషయం చెప్పి, ఇంట్లోకి వెళ్లి జాస్మిన్ ఉరి పోసుకున్న చీరను శ్రీసాయి ఒక్కడే తొలగించి, 108కు ఫోన్ చేశాడని పవన్ పోలీసులకు వివరించాడు. ఇంతలో అక్కడికి వచ్చిన గౌస్ తమను ఇంట్లోకి నెట్టి ఇంటి తలుపులకు గడియపెట్టినట్లు చెప్పాడు. పవన్‌కుమార్ బెబుతున్న విషయాలపై పోలీసులు దృష్టి పెట్టి లోతుగా విచారణ చేస్తున్నరు. పోస్టుమార్టం రిపోర్టుపై పలురకాల చర్చలు జాస్మిన్ పోస్టుమార్టం రిపోర్టుపై పలురకాలుగా చర్చ సాగుతోంది. పోస్టుమార్టం ప్రథమిక రిపోర్టు వైద్యాధికారుల నుంచి అందలేదని, రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. జాస్మిన్, శ్రీసాయి మృతిపై కేసులు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారిస్తున్నామని డీఎస్పీ పి.మహేష్ తెలిపారు. శ్రీసాయికి కన్నీటి విడ్కోలు మహ్మదీయపాలెం గ్రామస్తుల ఆగ్రహానికి బలైన వేముల శ్రీసాయి(18)కి కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం కన్నీటి వీడ్కోలు పలికారు. అడవులదీవి గ్రామంలో శ్రీసాయి అంత్యక్రియలు నిర్వహించారు. జాస్మిన్, వేముల శ్రీసాయి మృతితో రెండు రోజులుగా అడవులదీవిలో సెక్షన్-144 అమల్లో ఉంది. అడవులదీవిలో బంద్ నిర్వహించారు. -
వీడని చిక్కుముడి
సవాల్‌గా మారిన విద్యార్థిని మృతి కేసు అనుమానిత వ్యక్తులను విచారిస్తున్న పోలీసులు గొలుగొండ: విద్యార్థిని దివ్యశ్రీ మృతి మిస్టరీ వీడడం లేదు. ఈ సంఘటన పోలీసులకు అంతుచిక్కడం లేదు. ఈ నెల 4వ తేదీ రాత్రి గొలుగొండ మం డలం అప్పన్నపాలెంలో అనుమానాస్పదస్థితిలో విద్యార్థిని మృతి చెందిన సంగతి తెలిసిందే. 16 రోజులయినా ఎటువంటి వివరాలు, ఆధారాలు దొరకలేదు. దివ్యశ్రీది హత్యా, ఆత్మహత్యా అన్నది శేషప్రశ్నగానే మిగిలిపోయింది. అప్పట్లో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమేదు చేశారు. నర్సీపట్నం ఏఎస్పీ సత్యఏసుబాబు, రూరల్ సీఐ గపూర్, గొలుగొండ ఎస్ఐ జోగారావు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఊరుకి దూరంగా తోటలలో నివాసం ఉండటం వల్ల అక్కడ ఏమి జరిగిందన్నది ఎవరికీ తెలియడం లేదు. దివ్యశ్రీ చదివే కళాశాలలో కూడా విచారణ జరిపారు. మృతిచెందక ముందు విద్యార్థిని రాంబిల్లిలోని బంధువ ఇంటికి వెళ్లింది. అక్కడా పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్థినికి ఇంటిలో ఎటువంటి ఇబ్బందులు లేకపోవడం, ఎవరితోనూ శత్రుత్వం ఉండకపోవడం,ఆత్యహత్య చేసుకోడానికి బలమైన కారణాలు దొరకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. కుమార్తె మృతిపై తల్లిదండ్రులకు కొన్ని కారణాలు తెలిసే ఉంటాయని, అయితే వారు నోరు విప్పకపోవడం వల్లే దర్యాప్తు ఆలస్యం అవుతోందన్న వాదన ఉంది. నెల రోజులు క్రితం కొత్తయల్లవరానికి చెందిన యువకుడోకరు ఈ ప్రాంతంలో కార్పెంటర్ పనులు చేసేవాడు. అనుమానం వచ్చిన పోలీసులు అతనితోపాటు మరోయువకుడ్ని కూడా విచారణ చేస్తున్నారు. అలాగే వివిధ కోణాలలో దర్యాప్తు మమ్మరం చేశారు. ఇప్పటి వరకు ఎటువంటి కీలక సమాచారం దొరకలేదు.